2015… జూన్… 72 మంది కమాండోలు… ధ్రువ్ హెలికాప్టర్లను ఎక్కారు… ఎంఐ ఛాపర్లను స్టాండ్‌బైగా ఉంచారు… అత్యాధునిక ఆయుధాలు… రాకెెట్ లాంచర్లు, నైట్ విజన్ గ్గాసెస్, గ్రెనేడ్లు… బర్మా సరిహద్దులు దాటాయి… రెండు గ్రూపులుగా విడిపోయారు… మళ్లీ రెండేసి సబ్ గ్రూపులు… నాగాలాండ్ దాటాక ఒక ఉగ్రవాద శిబిరం… మణిపూర్ దాటాక మరొకటి… చైనా మద్దతు ఉన్నట్టు చెప్పబడే ఎన్ఎస్‌సిఎన్-కే ఉగ్రవాదులు ఒకచోట… కేవైకేఎల్ ఉగ్రవాదులు మరోచోట… శిబిరాల్లోని ఉగ్రవాదులు తేరుకుని ఆయుధాలు పట్టుకునేలోపు… జస్ట్, 40 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది… కమాండోల్లో ఒక్కరికీ చిన్న గాయం కాలేదు… ఉగ్రవాదుల వైపు ఎందరు మరణించారో ఇప్పటికీ లెక్కతేలలేదు, సహజంగానే మాకేమీ నష్టం జరగలేదు అని ఉగ్రవాదులు చెప్పుకున్నారు గానీ కనీసం వంద మంది వరకూ చనిపోయి ఉంటారని సైనికవర్గాలు, 40 లేదా 50 అని మీడియావర్గాల భోగట్టా… ఆ రెండు క్యాంపులూ ధ్వంసం… ఇండియా తన సరిహద్దులు దాటి, వేరే దేశంలోకి వెళ్లి మరీ నిర్వహించిన మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్స్ ఆపరేషన్ అది… అప్పుడు ఆ ఏరియాలో మన సైనిక యూనిట్లకు కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్… ఈ ఆపరేషన్ సూపర్‌వైజ్ చేసింది తనే… అంతకుముందు ఆ ఉగ్రవాదులు మన సైన్యం కాన్వాయ్‌పై జరిపిన దాడికి అది ప్రతీకారం…
2016… సెప్టెంబరు… యూరీలో ఉగ్రవాదులు మన ఆర్మీ బేస్‌పై దాడి జరిపారు… ప్రతీకారం తీర్చుకోవాలి… 70 నుంచి 80 మంది కమాండోలు, నాలుగు గ్రూపులు… పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంట ఉండే లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా ఉన్న ఉగ్రవాద శిబిరాలు, లాంచింగ్ ప్యాడ్ల మీద రాకెట్లు, గ్రెనేడ్లతో దాడులు జరిపారు… సర్జికల్ స్ట్రయిక్స్… అక్కడక్కడా సరిహద్దులు దాటి మరీ… కాకపోతే బయటికి అధికారికంగా చెప్పబడదు… ఇవి ఎయిర్ స్ట్రయిక్స్ కావు… నేల మీద కాలినడకన సాగిన ఆపరేషన్… ఎంతమంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు మరణించారో లెక్కతేలదు… పాక్ ఎలాగూ చెప్పుకోదు కదా… అప్పుడు బిపిన్ రావత్ ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్… ఈ ఆపరేషన్ ప్లానింగ్, అమలుకు కీలక సూత్రధారి…
Ads
2019… ఫిబ్రవరి… అంతకుముందు పుల్వామాలో భారతీయ సైన్యంపై ఉగ్రవాదులు దాడి జరిపి, సైనికులను పొట్టనపెట్టుకున్న ఉదంతంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది… ఉగ్రవాదులకు, వాళ్లకు మద్దతునిచ్చే పాకిస్థాన్‌కు ఓ పాఠం నేర్పాలి… అప్పుడు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్… ఇండియా పాకిస్థాన్ సరిహద్దులు దాటి, బాలాకోట్ ప్రాంత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది… ఇక్కడా అంతే, ఎందరు మరణించారో పాకిస్థాన్ చెప్పుకోలేదు, సరికదా తమకు వీసమెత్తు నష్టం జరగలేదంటూ బుకాయించింది… మోడీ ప్రభుత్వం వచ్చాక మన సైన్యం ధోరణిలో మార్పుకు ఈ ఆపరేషన్లు ఉదాహరణ… మన దేశరక్షణకు అవసరమైతే మన దేశ సరిహద్దులు దాటి, దాడులు చేస్తామనే హెచ్చరికలు అవి… ఇవేకాదు, చైనా దూకుడుకు డోక్లాంలో గానీ, లడఖ్‌లో గానీ గట్టిగా నిలబడి, ఢీఅంటేఢీకి రెడీ… ఈ కీలక నిర్ణయాల్లో, అమలులో బిపిన్ రావత్ ఉన్నాడు…
సమర్థుడు, ఆపరేషన్ల ప్లానింగ్, టీమ్స్ ఎంపిక, అమలు, పర్యవేక్షణ… మోడీకి అందుకే దగ్గరయ్యాడు… వేరే ఆలోచన లేకుండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టుకు ఎంపికయ్యాడు… అంతకుముందు ఇదే పోస్టు ప్రతిపాదన వచ్చినప్పుడు ఒకరిద్దరు నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ల నుంచి వ్యతిరేకత, ప్రతిఘటన కనిపించింది… కానీ రావత్ ఎంపిక సమయంలో ఏ రణగొణ లేదు… ఉన్నత స్థాయిలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఈ పోస్టు, విస్తృత సమన్వయ అధికారాలు ఉపయోగపడతాయి… మన త్రివిధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్‌గా రాష్ట్రపతి వ్యవహరిస్తాడు… తరువాత స్థానం సీడీఎస్‌దే… సైబర్, స్పేస్ తదితర విభాగాల అధిపతులతోనూ సీడీఎస్ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది… అదే స్పిరిట్‌తో రావత్ కీలక, సున్నిత ప్రాంతాల్లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల జాయింట్ థియేటర్ కమాండ్ల ఏర్పాటుకు పూనుకున్నాడు… ఎక్కడికక్కడ దిగువ స్థాయిలో సమన్వయం, అవసరమైన వేళల్లో తక్షణ స్పందన కోసం అన్నమాట… ప్చ్, దురదృష్టం… 2015లో నాగాలాండ్‌లో ఒకసారి హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆయన నిన్న కూనూరు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు… వెళ్లిపోయాడు..!!
Share this Article