Prasen Bellamkonda…… ఇష్టమైన రచన ఉంటుందే తప్ప ఇష్టమైన రచయిత ఉండకూడదనేవారు యండమూరి. పోపోవోయ్ అని యండమూరి రాసిన చాకలి పద్దు కూడా నాకిష్టం అనేవాడిని నేను అప్పట్లో. అదో పిచ్చి. ఇష్టమైన పిచ్చి. మధుబాబు డికెష్టి నడకనూ యద్దనపూడి డ్రీమర్ శైలినీ కలిపి నాలాంటి కొన్ని లక్షల మందిని తన పద్దులో రాసేసుకున్నారాయన. ఆ తరువాత తన కధన రీతిని వ్యక్తిత్వ వికాస డ్రై ప్రవచనాలకు జోడించి నవలల స్థాయికి మార్చేసారాయన. బహుశా చాలా మందికి విజయానికి అయిదు ఆరు మెట్ల పుస్తకాలు ఇప్పటికీ భగవద్గీతలే.
అవును ఒక యండమూరి ఇప్పుడు చాలా అవసరం. సాంఘిక నవలను డిటెక్టివ్ నవలగా వ్యక్తిత్వ వికాస రచనను కూడా ఉత్కంఠభరితంగా నడపగల యండమూరి చాలా చాలా అవసరం… ఆయనకు ఆలస్యపు జన్మదిన శుభాకాంక్షలు…
Share this Article
Ads