బిగ్‌బాస్ టీంను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు… ఆ షో ద్వారా కావల్సింది ఎక్కువ టీఆర్పీలు… కమర్షియల్ యాడ్స్, మూవీ ప్రమోషన్స్, డబ్బు… యాక్టివిటీ యాడ్స్ పేరిట ఇదే కంటెస్టెంట్లతో బోలెడు కమర్షియల్ యాడ్స్ అదే హౌజులో చేయిస్తారు… సో, కంటెస్టెంట్ల పర్‌ఫామెన్స్, వాళ్లకు వచ్చే వోట్లు, దానికి అనుకూలించే కంట్రవర్సీలు షోలో కంటెస్టెంట్ల గమనాన్ని నిర్దేశిస్తాయి… రెమ్యునరేషన్ల వరకూ కాస్త ఎక్కువ, తక్కువ అనేది వాళ్ల పాపులారిటీని బట్టి ఉంటుంది…
కానీ కంటెస్టెంట్ అంతిమంగా ఎన్ని వారాలు ఉండాలో కంటెస్టెంట్ల ఆటతీరే డిసైడ్ చేస్తుంది… అఫ్‌కోర్స్, కావాలని కొందరిని ఎలిమినేషన్ల నుంచి గట్టెక్కించడం వంటి యవ్వారాలు ఉంటాయి… కొందరి ఫీడ్ కట్ చేయడం, కొందరిని పదే పదే ప్రమోట్ చేయడం కూడా పరిపాటే… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… మనం గత సీజన్‌లో చూశాం కదా… యాంకర్ రవి ప్రతి వారం ఎలిమినేషన్ జాబితాలో ఉండేవాడు… పలుసార్లు మొత్తుకునేవాడు…
అన్నింట్లోనూ వేలు పెట్టేవాడు… అందరికీ టార్గెట్ అయ్యేవాడు… అదే సింగర్ శ్రీరామచంద్ర సైలెంట్ కిల్లర్‌గా వ్యవహరించి, చివరి దాకా షోలో కొనసాగాడు… పైగా హమీదాతో లవ్ ట్రాక్ అదనపు ఫాయిదా… కానీ సేమ్ రేంజ్ సింగర్ రేవంత్‌కు ఈ విద్య తెలిసినట్టు లేదు… మొదటిరోజే తోటి కంటెస్టెంట్ల తిరస్కారానికి తన మొహం వాచిపోయింది… ఒకవైపు బాలాదిత్యకు రాముడు మంచిబాలుడు అన్నట్టు మార్కులు పడి, క్లాస్ కేటగిరీలో నిలవగా… రేవంత్ మాత్రం ట్రాష్ కేటగిరీలో చేరాల్సి వచ్చింది…
Ads
ఎంతైనా రేవంత్‌కు కాస్త ఓవరాక్షనే… సరే, తను స్ట్రాంగ్ కంటెండర్ కాబట్టి అప్పుడే ఓ అంచనాకు రాలేం… తనను అలా వదిలేస్తే ఇనయ సుల్తానా కూడా కాస్త ఓవర్ ఎమోటివ్ అనిపించింది… ఎంట్రీ సమయంలోనే తన తండ్రిని తలుచుకుని దుఖపడింది… స్మరించుకుంది… మళ్లీ నిన్న దాన్నే ఇంకాస్త ఎక్కువ చేసింది… అంత అక్కరలేదు… ఏడుపు అనేది బిగ్‌బాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చదు… వాళ్లకు ఎంటర్‌టెయిన్‌మెంట్ కావాలి… అది ఇనయ గుర్తుంచుకోవాల్సింది… కానీ తనలో ఎనర్జీ ఉంది, యాక్టివ్…
గీతూ రాయల్… ఈమె ఓ చిత్రమైన కేరక్టర్… దడదడ మాట్లాడుతూనే ఉంటుంది, భోళాతనం ఎక్కువ… కానీ ప్లాన్డ్‌గా ఎలా ఆడాలో తెలియడం లేదు… ఊరికే నోరు పారేసుకుంటోంది… అందరితో మింగిల్ కావడం లేదు, దాంతో మిగతా కంటెస్టెంట్లు అందరూ టార్గెట్ చేసి, ట్రాష్ కేటగిరీలో పడేశారు… ఏమిటేమిటో తనలోతనే గొణుక్కుంటూ చిత్రంగా వ్యవహరించింది… కానీ షో కాస్త సరదాగా ఉండాలంటే గీతూ వంటి కేరక్టర్లే అవసరం… వీళ్లు తప్ప మిగతా వాళ్లలో చాలామంది దేభ్యం మొహాలేసుకుని కనిపించారు… ఎవరూ చురుకుగా లేరు… కొందరి పేర్లు త్వరగా రిజిష్టర్ కావడం కూడా కష్టమే… ఆదిరెడ్డిది కూడా ఓవరాక్షన్ అనిపిస్తోంది… కాస్త రఫ్ అండ్ టఫ్ కూడా…! చూడబోతే గతంలో సిరి హన్మంతును వాడేసినట్టు, ఈసారి శ్రీసత్యను ఏదేని లవ్ ట్రాకులో అర్జెంటుగా ఇరికిస్తారేమో అనిపిస్తోంది… చూడాలిక…!!
Share this Article