.
మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈమె గురించి… కీర్తి భట్… యాక్సిడెంటులో ఫ్యామిలీ మొత్తం కోల్పోయింది… తనూ తీవ్రంగా గాయపడింది,.. ఈరోజుకూ బోల్టులు, రాడ్లు, నట్లు… చాన్నాళ్లు కోమాలో ఉండి, కష్టమ్మీద కోలుకుంది… మాతృత్వం పొందే అవకాశాల్నీ కోల్పోయింది…
ఒకరకంగా మరణాన్ని జయించింది… దగ్గరి బంధువులూ మోసం చేస్తే, కష్టమ్మీద బయటపడి, ఒంటరిగా పోరాడుతోంది… మొండిగా… ఆమధ్య బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్… అంతకుముందు సీరియల్ నటి… బిగ్‌బాస్‌కు వచ్చే ముందు తను దత్తత తీసుకుని, పెంచుకుంటున్న పాప చనిపోయింది…
Ads
ఈ వివరాలన్నీ ఆమె చెప్పుకుంది… ఇప్పుడు ఆమె మరికొన్ని విషయాలూ చెబుతోంది… నిజంగా తనకు బతుకంతా బాధలే… విధి ఆమె మనసుకు, దేహానికి చేసిన గాయాలే… ఆమె జీవితంలోకి ఓ ప్రియుడు వచ్చాడు… తనకు ఈమె మీద అనుమానం… మరెందుకు ప్రేమించినట్టు..? ఈమె సంపాదన కావాాలి…
సరే, తనతో బ్రేకప్… మళ్లీ ఒంటరితనం… ఎవరూ లేని అనాథ… ఆ టైమ్‌లో మరొకతను వచ్చాడు… విజయ్ కార్తీక్… ఆమెకు గర్భం వచ్చే అవకాశాలు లేవని తెలిసీ తోడుగా నిలిచాడు… ఇక లైఫ్ సజావుగా సాగినట్టే అనుకునే దశలో పాత ప్రియుడు మళ్లీ తెరమీదకు వచ్చాడు…
ఆమెను నిందిస్తూ వ్యాఖ్యలు చేయసాగాడు… అసలు ఆమె ఇప్పటిదాకా ఆ పాత ప్రియుడి గురించి ఎక్కడా చెప్పలేదు, చెడ్డగా కూడా చెప్పలేదు… ఇప్పుడు తన వ్యాఖ్యలతో గాయపడి కొన్ని వివరాలు చెబుతోంది ఇంటర్వ్యూల్లో…
ఆమె పెంచుకున్న బిడ్డ చనిపోయింది కదా బిగ్‌బాస్ షోకు రావడానికి పది రోజుల ముందు… ఆ పాప కీర్తి సొంత బిడ్డే అయి ఉంటుంది, డీఎన్ఏ టెస్టు చేయిద్దాం అనే డిస్కషన్ జరిగిందట ఆ ప్రేమికుడి ఇంట్లో…
‘‘మేం డీఎన్ఏ టెస్టు అడిగాం, కానీ ఆమె ఆ పాప చనిపోయిందని చెబుతోంది’’ అని ఆ పాత ప్రేమికుడి ఇంటోళ్లు అక్కడిక్కడా చెబుతున్నారట… పైగా అతని దగ్గర పదే పదే కీర్తి డబ్బు తీసుకునేదనీ విమర్శలు చేస్తున్నారట…
‘‘అసలు తనకు వచ్చే సంపాదన 12 వేలు, నేను లక్షల్లో సంపాదిస్తూ తననెందుకు డబ్బు అడుగుతాను, పైగా నా దత్త పుత్రిక గురించి తిక్క కామెంట్స్… ఎస్, ఇప్పుడు తప్పుడు మాటలు చెబుతున్నారు… కలిసి ఉండాలని అనుకున్నాం, కుదరలేదు, విడిపోయాం, ఐనంతమాత్రాన ఇష్టారాజ్యంగా నిందలు వేయాలా..?
తనను ప్రేమించడం వల్ల కొన్నాళ్లయినా హేపీగా ఉన్నాను, వాళ్లింట్లో తిన్నాను, పడలేదు, విడిపోయాం, ఐనా నేను తనను ద్వేషించడం లేదు, ఎక్కడా చెడుగా మాట్లాడలేదు, కానీ కొన్ని మాటలు మనిషిని ఎంత హర్ట్ చేస్తాయో ఎందుకు అర్థం చేసుకోరు..?
నా లైఫ్ నాది, వాళ్ల లైఫ్ వాళ్లది… నా ఫ్యామిలీయే నన్ను రోడ్డు మీద నిలబెట్టినప్పుడు కూడా ఎలా బతకాలో ఆలోచించాను తప్ప బాధపడలేదు… కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, తిరిగి ఇచ్చేస్తుందని నమ్ముతాను… ఎవరి ఖర్మ వాళ్లే అనుభవిస్తారు… నాగురించి కామెంట్స్ చేసేవాళ్లు అలాగే ఉన్నారు… నేను ఎదిగాను… మంచి పేమెంట్…
నేనేమీ వంకర మార్గంలో రాలేదు ఇక్కడి దాకా… సరైన, మంచి మార్గంలో వచ్చాను… వాళ్లు అక్కడే ఆగిపోయారు… టాలీవుడ్ కమిట్‌మెంట్స్ మీద కూడా ఓపెనైంది ఆమె… కొన్ని కమిట్‌మెంట్లకు ఒప్పుకుంటే ఎక్కడో ఉండేదాన్ని… నాకు అక్కర్లేదు… సొంత ఇల్లు కూడా లేదు… ఐనా పర్లేదు..’’ అంటోంది ఆమె… తనకు ఇప్పుడు సహనటుడు విజయ్ కార్తీక్ తోడుగా ఉన్నాడు… ఈ ప్రజెంట్ లైఫయినా ఇక సజావుగా సాగాలని ఆమె ఆశ… ఇన్నాళ్ల చేదు బతుక్కి ఇక ఫుల్‌స్టాప్ పడాలని ఆకాంక్ష…
Share this Article