Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…

June 1, 2025 by M S R

.

ఒకవైపు ఈనాడు తన ప్రమాణాల్ని తనే దిగజార్చుకుంటున్నదీ అనే అసంతృప్తి తెలుగు పాఠకుల్లో రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది… ఠాట్, నేనేం తక్కువ అనుకుంటూ సాక్షి మరింత వేగంగా డౌన్ అయిపోతోంది… పోటీ అంటే పోటీయే మరి…

అనేక ఉదాహరణలు చెప్పొచ్చు గానీ ఈరోజు ఓ స్పెషల్ స్టోరీ చదివాక సాక్షి మీద నిజంగానే జాలేసింది, నవ్వొచ్చింది కూడా… అది రెసిపీ రిలేటెడ్ ఆఫ్ బీట్ స్టోరీ… దాని హెడ్డింగ్ ఏమిటో తెలుసా..? ‘ఖుర్బానీ కా మీఠా…

Ads

మీకూ నవ్వొచ్చిందా..? అది ఖుర్బానీ కాదురా నాయనా..? ఖుర్బానీ అంటే త్యాగం… ఇది ఖుబానీ కా మీఠా… ఖుబానీ అంటే ఓ రకం నేరేడు పళ్లు… మధ్య ఆసియా దాని ఆరిజన్ అని చెబుతారు… ఇప్పుడు టర్కీలో ఎక్కువ పండిస్తారు… మన లడఖ్‌లో కూడా…

ఓ డిఫరెంట్ టేస్ట్ ఉండే ఈ పండులో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువ… ఆరోగ్యానికీ మంచిది… ప్రత్యేకంగా మొఘలాయి వంటకాల్లో ఫేమస్ డెజర్ట్, అంటే స్వీట్ రెసిపీ… హైదరాబాద్‌లో ఏదైనా పెళ్లిళ్లలో ఇది కూడా పెడితే వాళ్లకు ఘనమైన టేస్ట్ ఉన్నట్టు లెక్క… కాకపోతే చాలా పెళ్లిళ్లలో డబుల్ కా మీఠా పెడుతుంటారు… చౌకగా అయిపోతుందని…

సాక్షి సంగతికొద్దాం… కనీసం పేజీల్లో ఏ స్టోరీలు పెడుతున్నారో, ఆ హెడ్డింగులేమిటో, వాటి అర్థాలేమిటో చూసుకునే సిట్యుయేషన్ కూడా లేకుండా పోయింది… సాక్షి ప్లస్, సిటీ ప్లస్ ఎట్సెట్రా పేజీల్ని ఎడాపెడా నెట్‌లో కుక్కేయడం కాదు… వాటి నాణ్యత కూడా చూసుకోవాలి కదా…

khuabni ka meetha

పాఠకుల్లో పలుచన కావడమే కాదా ఇది..? ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రికకైనా క్వాలిటీ చెక్ ఓ ప్రధాన అంశం.., ఇదుగో ఇలాంటి హెడ్డింగులు పత్రిక పట్ల తేలికభావాన్ని క్రియేట్ చేస్తాయి… లేరా..? మంచి రచయితలు ఉన్నారు సాక్షిలో… భాష మీద పట్టున్న వాళ్లూ ఉన్నారు… కానీ ఎవరిని ఎక్కడ వాడుకోవాలో తెలియనితనం…

ఖుబానీ కా మీఠా ఎలా చేసుకోవాలో దాని విశిష్టత ఏమిటో చెప్పారు సరే, హెడ్డింగులోనే కాదు, టెక్స్ట్‌లో కూడా అదే ఖుర్బానీ పదాన్నే వాడారు… ప్రమాణాల ఖుర్బానీ… అదే స్వీటును ఇప్పుడు పేరు మార్చి, తీరు మార్చి అప్రికాట్ డెజర్ట్‌గా పిలుస్తున్నారట… అదేదో హోటల్‌లో ఎవరో చెఫ్‌కు ఈ క్రెడిట్స్ ఇవ్వాల్సినంత సీనూ లేదు…

ఖుబానీ వండే విధానం మారదు, మారితే అదిక ఖుబానీ కా మీఠా అనబడదు… అదొక యూనిక్ డెజర్ట్… ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా హైదరాబాదే దానికి ఫేమస్ అడ్డా… అది రాయడానికి ఇన్ని అవస్థలు, లోపాలు, దోషాలు… ప్చ్, చాలా చేదుగా ఉంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions