ఫాఫం ప్రజాశక్తి దినపత్రిక… హఠాత్తుగా ఏమైంది దీనికి..? ఈమధ్య ప్రభుత్వ ప్రకటనలు బాగా కొట్టీ కొట్టీ… బుర్రలు ఖాళీ అవుతున్నాయా..? లేకపోతే ఫస్ట్ పేజీ లీడ్ స్టోరీ ఈరకంగానా..? కిసాన్‌కు జైకొట్టిన జవాన్… ఇదీ శీర్షిక… 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు, కేజ్రీవాలుడు దీక్ష చేస్తున్నాడు, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు లేఖలు రాస్తున్నారు అని ఏవేవో రాసుకుంటూ పోయారు… వోకే, సీపీఎం పార్టీ తాజా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పొలిటికల్ లైన్ తీసుకున్నారు… ఎవరికీ అభ్యంతరం లేదు…
మోడీ ఏం చేసినా… ఖండఖండాలుగా నరకాల్సిందే కాబట్టి… పార్టీ పొలిటికల్ లైన్‌ను బట్టి ఏదో కథ వండాల్సిందే… అది పార్టీ పాత్రికేయ ధర్మం అనబడును… దాని గురించి చింత ఎవరికీ లేదు… కానీ మరీ నవ్వు పుట్టించేలా ఫస్ట్ పేజీ బ్యానర్లు వండటం దేనికి..? అరె, అది ఒక జాతీయ పార్టీ వాయిస్ బ్రదరూ..? మరీ అల్లాటప్పాగా ఏదిపడితే అది వండేసి, వడ్డించేస్తే ఎలా..? ఇజ్జత్ ముఖ్యం కదా…
Ads
ఎస్, వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమనే స్వీయ నిర్ధారణతో… ఢిల్లీని ముట్టడిస్తున్న రైతులకు సంఘీభావంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎర్రదండు కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా ఆహ్వానించాల్సిందే… ఎవరి పొలిటికల్ లైన్ వాళ్లది… ఎటొచ్చీ… చేసే ప్రోగ్రామ్, రాసే పంచ్ అదిరిపోవాలి… ప్రజలు హర్షించాలి… ఈ నిరసనలో, ఈ రాతల్లో నిజం ఉంది, నిజాయితీ ఉంది అని ఫీల్ కావాలి… దాన్ని చేజేతులా పోగొట్టడం కాదా ఇది..?
అసలు శౌర్య చక్ర అవార్డులు మొదలైంది ఎప్పుడు..? ఇప్పటివరకూ ఎన్ని ఇచ్చారు..? అసలు జవాన్లలో 25 వేల మంది శౌర్య చక్ర గ్రహీతలు ఉన్నారా..? అదే గనుక నిజమైతే పెద్ద సంచలన వార్త అయి ఉండేది… పోనీ, జవాన్లు శౌర్య చక్ర అవార్డులను వాపస్ ఇస్తున్నట్టు వార్తలో ఎక్కడైనా సబ్స్టాన్షియేట్ చేశారా..? సరే, ఒకసారి వికీపీడియా చూడండి…
Status | Currently Awarded |
---|---|
Established | 1952 |
First awarded | 1952 |
Last awarded | 2019 |
Total awarded posthumously | 627 |
Total recipients | 2014 (As of 2017) |
1952లో ప్రారంభమైంది ఈ శౌర్య చక్ర అవార్డుల ప్రదానం… మొత్తం ఇప్పటికి 2014 మందికి మాత్రమే ఇచ్చినట్టు వికీ సమాచారం… సరే, వికీని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు… కానీ బ్యానర్లోనే 25 వేల జవాన్ల ఆగ్రహం అని రాసేటప్పుడు… కనీస నిర్ధారణ అవసరం లేదా..? అబ్బే, రాయడానికి ఏముంది బ్రదర్, రాసేయడమే అంటారా..? పోనీ, భారతీయ సైన్యంలో తిరుగుబాటు… ఢిల్లీ వైపు కదులుతున్న బెటాలియన్లు అని రాసేయకూడదా..? ఏదో ఒకటి రాసేస్తే సరి… ఢిల్లీపై ఎగురుతున్న ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలు… అని మరోరోజు… సరేనా..?! రైతులకు మద్దతుగా చైనా ఆర్మీ కూడా సరిహద్దులు దాటి ఢిల్లీ వైపు వస్తున్నట్టు కూడా రాసుకోవచ్చు… అసలు క్రియేటివిటీకి దరిద్రం దేనికి..?!
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ కథనాన్ని ఉతికి ఆరేసినట్టుంది… ఇలా…
Share this Article