‘‘టీవీ5 అమ్మేశారు… జస్ట్, వారం క్రితమే… డీల్ క్లోజ్… బీఆర్ నాయుడు ఫ్యామిలీకి టీవీ5కూ ఇప్పుడు సంబంధం లేదు… అందరూ తప్పుకున్నారు… దివ్యేష్ మానిక్ లాల్ షా, స్మృతి శ్రేయాన్స్ షా, శ్రేయాన్స్ శాంతిలాల్ షా ఇప్పుడు డైరెక్టర్లు… వీళ్లెవరో తెలుసా…? గుజరాతీ పెట్టుబడిదారులు… ఈ డైరెక్టర్లను నియమిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది… ఆన్‌లైన్‌లో ఈమేరకు మార్పులు చేసింది… టీవీ5 మాత్రమే కాదు, టీవీ5 కన్నడ, హిందూధర్మం కూడా అమ్మేసినట్టే… మరి ఏపీ సర్కారుతో పెట్టుకుంటాడా..? వ్యక్తిగత కక్ష ప్రదర్శిస్తాడా..? ఏపీలో టీవీ5 మీద 30, 40 కేసులున్నాయి… బార్క్‌లో కూడా కేసులున్నయ్… అవి సీబీఐకి అప్పగించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది… ఇక సీబీఐ ఎంటరైతే నాయుడి గారి కథ కంచికే… బండారం బట్టబయలే… అంతేకాదు, ఈడీ, హవాలా కేసులు కూడా… ఎంపీ రఘురామరాజుకు విదేశీ ఖాతాల నుంచి మిలియన్ యూరోలు బదిలీ అయ్యాయి… ఏపీ సర్కారు కేంద్రానికి కంప్లయింట్ చేసింది… ఇంకేముంది..? హవాలా కేసంటే మాటలా..? ఖతం… నాయుడి పని అయిపోయినట్టే… ఒక్కసారి హవాలా కేసుల్లో ఇరుక్కుంటే టీవీ5 ఖాతాలన్నీ క్లోజ్… సో, చానెల్ నడవదు… అందుకే వెంటనే అమ్మేసుకున్నాడు… బీజేపీ పెద్దల సహకారంతోనే ఇదంతా జరిగింది… కేంద్ర ఉత్తర్వులు ఇదే చెబుతున్నయ్…’’…….. హమ్మయ్య, ఇదండీ మొన్న రాత్రి నుంచి టీవీ5 మీద ఊదరగొడుతున్న ప్రచారం… ‘‘ఇంటర్ పోల్ కూడా వెతుకుతోంది… ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఆరా తీస్తోంది… బహుశా ఐబీ, మిలిటరీ ఇంటలిజెన్స్, రా కూడా రంగంలోకి దిగవచ్చు… ఉపా కేసు పెడతారని తెలుస్తోంది… అదే జరిగితే ఇక తీహారే…’’ అని మాత్రం రాయలేదబ్బా… సంతోషం… హమ్మయ్య… అక్కడికి ఆగిపోయింది… టీవీ5 నాయుడు ఊపిరి పీల్చుకున్నట్టే… అవునూ…, నిజంగా టీవీ5 అమ్మేశారా..?
Ads
అదుగో పులి, ఇదుగో తోక…! టీవీ5 అమ్మేస్తారనేది చాలారోజులుగా ప్రచారంలో ఉన్నదే… టీవీ5 హెడ్డాఫీసు కట్టిన భూమి డిస్ప్యూటెడ్ అనీ, కేసీయార్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ జగన్ దాన్ని మూయించేందుకు ప్రయత్నిస్తున్నాడనీ ప్రచారం ఉంది… కానీ ఏపీలో 30, 40 కేసులెక్కడివి..? బార్క్‌లో కేసులేమిటి..? సీబీఐ ఎంటర్ కావడమేంటి..? సమాచార ప్రసార శాఖ టీవీ5 డైరెక్టర్లను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటి..? హవాలా, ఈడీ దర్యాప్తులేమిటి..? దీంతో భయపడిపోయి నాయుడు అమ్మేసుకోవడం ఏమిటి..? పైగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం ఏమిటి..? హేమిటో… మరీ సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఇష్టారాజ్యంగా మారిపోయాయి… హేమిటిది..? రోజుల వ్యవధిలోనే చానెళ్లు అమ్మేయగలరా..? అమ్మేశారే అనుకుందాం, వెంటనే సమాచార ప్రసార శాఖ లేదా కార్పొరేట్ వ్యవహారాల శాఖ సదరు చానెళ్ల డైరెక్టర్ల పేర్లను మార్చేస్తాయా..? కార్పొరేట్ కంపెనీల పెట్టుబడులు, టీవీ చానెళ్ల వ్యవహారాలు, ఎంఐబీ రూల్స్ గట్రా తెలిసినవాళ్లకు ఈ ప్రచారం చదివితే నవ్వొస్తుంది… కానీ సగటు మనిషికి నిజంగానే టీవీ5 అమ్మేశారేమో అనే డౌట్స్ వస్తాయి… జర్నలిస్టు సర్కిళ్లే అయోమయంలో పడిపోయాయి… నిజమేంటి..?
టీవీ5 చానెళ్లను ఎవరూ టేకోవర్ చేయకూడదని ఏమీలేదు, నిజంగానే అమ్ముకునే పరిస్థితి వస్తే అమ్మేసుకుంటాడు… కానీ అమ్మేసే పరిస్థితి నిజంగా వచ్చిందా..? ఉందా..? ఒకవేళ అమ్మాలనుకున్నా… ఆ అమ్మకానికి కూడా ఓ ప్రక్రియ ఉంటుంది… రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అనేసే వ్యవహారం కాదు… సమాచార ప్రసార శాఖ వెబ్‌సైటులో ఏదో డేటా ఎంట్రీలో జరిగిన పొరపాటు అది… అందుకే నాయుడు అండ్ ఫ్యామిలీ పేర్ల బదులు ఇంకెవరో గుజరాతీయుల పేర్లు కనిపిస్తున్నయ్ అనేది ప్రాథమికంగా కనిపిస్తున్న కారణం… టీవీ5 యాజమాన్యం సంబంధిత అధికారులతో మాట్లాడింది… ఇప్పుడు రెక్టిఫై అయిపోయింది… అదే వెబ్‌సైటులో మళ్లీ పాత పేర్లే కనిపిస్తున్నాయి… సో, అంతా తూచ్… టీవీ5 ఎవరికీ అమ్మేయబడలేదు… ఇక సీన్ కట్ చేయండి… ఇంతకీ టీవీ5 కొన్నట్టుగా ప్రచారం జరిగిన ఆ దివ్యేశ్ మాణెక్ లాల్ షా, స్మృతి శ్రేయాన్ష్ షా, శ్రేయాన్ష్ శాంతిలాల్ షా ఎవరు..? నిజంగా వాళ్లకు ఎడాపెడా చానెళ్లను కొనేసేంత సీన్ ఉందా..?
గుజరాత్ సమాచార్ అని ఓ పత్రిక ఉంది… 1932 నుంచీ ఉంది, మధ్యలో ఈ శాంతిలాల్ షా కొనేశాడు… ఓ సాదాసీదా గుజరాతీ భాషా పత్రిక అది… అహ్మదాబాద్ హెడ్డాఫీసు, సూరత్ బ్రాంచ్ ఆఫీసు… అంతే… ఆ మధ్య ఏబీసీ దీని సర్క్యులేషన్ లెక్కింపును కూడా ఆపేసింది… ఏదో ఐఆర్ఎస్ సర్వే లెక్కల్ని చూపించుకుని యాడ్స్ సేకరించుకుంటూ కథ నడిపిస్తోంది… 2012లో ఈ పత్రికకు అనుబంధంగా జీఎస్‌టీవీ అని ఓ చానెల్ కూడా స్టార్ట్ చేశారు… దాని పాపులారిటీ కూడా అంతంతమాత్రమే… ఈ మీడియా గ్రూపు పేరు శ్రేయార్త్ ఆస్పాస్ లిమిటెడ్… టీవీ5 చానెళ్ల కంపెనీ పేరేమో శ్రేయ బ్రాడ్ కాస్టింగ్… సో, పేర్ల మధ్య ఈ సామ్యం కారణంగా డేటా ఎంట్రీ సమయంలో చోటుచేసుకున్న ఓ హ్యూమన్ ఎర్రర్ కావచ్చు… కాదు, నిజంగానే ఆ కంపెనీ టీవీ5ను కొనేసింది అనుకుందామంటే… ఆ గ్రూపుకి వాళ్ల పత్రిక, టీవీ చానెళ్లను ఉద్దరించడమే చేతకావడం లేదు… ఇక వేరే చానెళ్లను ఎందుకు కొంటారు..? పైగా తెలుగు, కన్నడ చానెళ్లను..? వాళ్లకు ఏం ఇంట్రస్టు..? ఈ చానెళ్ల నడుమ బేరసారాలు నడిపే తీట బీజేపీకి ఏముంటుంది..? అదసలే బాబు గారి కనుసన్నల్లో నడిచే ప్యూర్ యెల్లో చానెల్…!!
Share this Article