Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…

June 2, 2025 by M S R

.

మీడియా చెవుల్లో పూలు పెట్టడం, పిచ్చోళ్లను చేయడం చాలామంది సినిమా సెలబ్రిటీలకు అలవాటే… అఫ్‌కోర్స్, ఉన్నవీ లేనివీ రాసి సెలబ్రిటీలను పిచ్చోళ్లను చేయడం కూడా మీడియాకు అలవాటే… కానీ రీసెంటుగా శ్రీలీల కూడా మీడియాకు ఝలక్కులు ఇస్తోంది…

రీసెంటుగా ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది… బిగ్ డే, కమింగ్ సూన్ అని రాసింది… అన్నీ ఓ పెళ్లి ఎంగేజ్‌మెంట్ తరహా ఫోటోలు అవి… సో, ఇంకేముంది..? శ్రీలీల పెళ్లవుతుందోచ్ అని ఎడాపెడా మీడియా వార్తల్ని కుమ్మేసింది…

Ads

మరి ఆ ఫోటోలు చూశాక, ఆ పోస్టు రాతలు చదివాక ఎవరైనా అలాగే అనుకుంటారు కదా… అంత గుట్టుచప్పుడు గాకుండా ఎంగేజ్‌మెంట్ ఏమిటి..? అసలు వరుడు ఎవరు..? అంటూ రకరకాల ఊహాగానాలు ఎవరి స్టయిళ్లో వాళ్లు రాసిపారేశారు…

నిజానికి ఓ పదేళ్ల దాకా పెళ్లీ గిళ్లీ జాన్తా నై అని శ్రీలీల ఎప్పుడో చెప్పినట్టు గుర్తు… ఏమో, మనసు మార్చుకుందా..? సరే, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో రిలేషన్ షిప్, డేటింగ్ గట్రా వార్తలు కూడా గతంలో వచ్చాయి…

 

మరి ఈ వరుడు ఎవరు అని జుత్తు పీక్కున్నారు అందరూ… తాపీగా తమాషా మొత్తం చూసి, అప్పుడు పెదవి విప్పి ఓ పిచ్చి క్లారిటీ ఇచ్చింది ఆమె… అబ్బే, ఇదంతా మా అమ్మ చేసింది… నా బర్త్ డే 14 తేదీన… సో, ఇప్పటి నుంచే ప్రిబర్త్‌డే హంగామా చేస్తుంది అమ్మ అని చెప్పుకొచ్చింది…

ఆ ఫోటోల్లో రానా భార్య మిహిక కూడా ఉన్నట్టుంది… ఈ ప్రిబర్త్ డే హంగామాకు ముఖ్య అతిథా..? ఐనా 14న బర్త్ డే అయితే 15 రోజుల ముందే ప్రిబర్త్‌డే హడావుడి ఉంటుంబదా..? అదీ పెళ్లి ఎంగేజ్‌మెంట్ తరహాలో… అబ్బో, నువ్వూ ముదిరిపోయావు శ్రీలీల అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ…

srileela

అవునూ, ఎంగేజ్‌మెంట్లలో అలా అమ్మాయిని బుట్టలో తీసుకురావడం ఏమిటి..? దాంతోనే అర్థమైపోలా ఎంగేజ్‌మెంటూ లేదు, ఏమీ లేదు అని..! ఆమె చెప్పినట్టు ప్రిబర్త్ డే సెలబ్రేషన్స్ కూడా కావు, ఈ బుట్టలో తీసుకువచ్చే ప్రిబర్త్‌డే సెలబ్రేషన్స్ ఏమిటి మరి..!!

మరి నిజానికి ఏం జరిగింది..? ఏదో ఫోటో షూట్ కావచ్చు బహుశా… లేదా ఎవరి ఫంక్షన్‌లోనో సరదాగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు కావచ్చు…

కాకపోతే ఇన్‌స్టాలో బిగ్ డే, కమింగ్ సూన్ అని రాసి అందరినీ తప్పుదోవ పట్టించేసింది తను… కావాలని కాకపోవచ్చు లేదా సరదాగా ఓ ఉత్కంఠ రేపాలని కావచ్చు… సో, అలా వడ్లగింజలో బియ్యపుగింజ తరహాలో..!! చివరగా… వినేవాడు ఉంటే శ్రీలీలలు ఏమైనా చెబుతారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions