ఈనాడుకన్నా ఆంధ్రజ్యోతి టెంపర్ కొన్ని విషయాల్లో చాలా బెటర్… (మిగతావి పత్రిక లక్షణాల్ని కోల్పోయి, డప్పులుగా మారి చాలా రోజులైంది కాబట్టి… ఆ సిబ్బంది కార్యకర్తల రేంజ్ కాబట్టి… వీటికి Neutral ముసుగు ఉంది కాబట్టి… ఈ రెండింటినే ఓసారి పోలుద్దాం….) చాలా విషయాల్లో ఆంధ్రజ్యోతి ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెబుతుంది… ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా, ఏ అభ్యంతరాలున్నా, రాసిన దాంట్లో బండబూతులున్నా సరే…. దానికంటూ ఓ లైన్ ఉంది… కొన్నిసార్లు నేరుగా చెబుతుంది, లేకపోతో ఎవడో ఓ కోన్‌కిస్కా గొట్టం గాడి ఇంటర్వ్యూ పేరిట రాసిపారేస్తుంది… కానీ ఈనాడు..? ఇన్నేళ్ల ఘనచరిత్ర అని చెప్పుకునే సదరు పత్రిక, యాజమాన్యం సిగ్గుపడేలా వ్యవహరిస్తోంది… తను ఈ దేశంలోని టాప్ టెన్ పత్రికల్లో ఒకటి అనే సోయి లేదు దానికి…! వేలు, లక్షల కోట్లకు ఎదిగాక, ఎక్కడ ఏ పాలకుడు పట్టుకుని ఒత్తుతాడో అనే భయం… అలాగని రాయకుండా ఉండలేని అసహనం… దాంతో ఎవడో ఏదో రాసేదాకా ఆగడం, ఇక దాన్ని పట్టుకుని ఊరేగడం… చివరకు రామోజీరావు తన సంధ్యవేళ మరీ ఆ పాతాళ స్థాయికి దిగజారిపోవడం అనూహ్యం, ఆశ్చర్యకరం… ఇలాంటి ఎడిటోరియల్ స్టాఫ్‌ను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రాప్తం….
అదొక మ్యాగజైన్… మెడికల్ వ్యవహారాలను పరిశీలిస్తూ ఆన్లైన్లో పబ్లిష్ చేసేది… సో, వాట్..? మెడికల్ రీసెర్చ్ వేరు, పాండెమిక్ కంట్రోల్ వేరు… ఈ పత్రికకు ఇండియాలో పరిస్థితులపై అవగాహన ఉందా..? ఉందనే అనుకుందాం… ఇదే పత్రిక అమెరికాలో అదుపు తప్పిన ఫస్ట వేవ్ మరణాలు, కేసుల గురించి రాసిందెక్కడ..? అదెందుకు చేతకాలేదు..? ఈరోజుకూ కేసుల సంఖ్యలో అమెరికాయే అగ్రస్థానం కదా… అంతెందుకు..? చైనాపై వ్యక్తమయ్యే సందేహాలు, WHOపై ప్రపంచం మొత్తం వ్యక్తం చేస్తున్న సందేహాల్ని ఇది రాసిందెక్కడ..? ఆ కోణంలో దీనికి ఉన్న క్రెడిబులిటీ ఏంటి..? దీన్ని ఈనాడు భుజాన మోయడం ఏమిటి..? పోనీ, మోడీ అసమర్థుడే, దుర్మార్గుడే అనుకుందాం… అదేదో నువ్వే రాయొచ్చు కదా…. రాయద… జగన్ గురించి, కేసీయార్ గురించి రాయదు… వణుకు… ఇంకెందుకు నీ టాప్ టెన్ పాత్రికేయం, నీ రాతలు..? WHO ఈరోజుకూ చైనా అదుపాజ్ఞల్లో ఉందనే సోయి ఉందా ఈ ఈనాడుకు..?
Ads
ఇవన్నీ సరే, నువ్వు తిట్టాలనుకున్నవి ఎవడో తిట్టాడు, నీ ఓం సిటీకి మోడీ ఒప్పుకోలేదు కాబట్టి, నీ చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు కాబట్టి, నీకు కోపం ఉంది కాబట్టి, నువ్వు నేరుగా తిట్టడానికి భయం కాబట్టి….. ఎవడో దారినబోయే దానయ్య తిట్లను నువ్వు పబ్లిష్ చేశావు సరే…. కానీ, ఇదే లాన్సెట్ పత్రిక వాడు… మోడీ వేక్సిన్ విధానంలో తప్పుల గురించి రాస్తే…. ఇదే కోవాగ్జిన్ కంపెనీ భారత్ బయోటెక్ దొంగమాటలు, దోపిడీ తంత్రాల గురించి రాస్తే అవి పబ్లిష్ చేస్తుందా ఈనాడు..? మంచి నీళ్ల సీసా ఖరీదు వేక్సిన్ 1200 ఎందుకు అయ్యిందో నువ్వే సంపాదకీయం రాయొచ్చు కదా రామోజీరావు గారూ…? నువ్వు ప్రజల కోణంలో ఉండే పాత్రికేయుడివి కదా…. రాయవు, ఎందుకంటే అది నీ వియ్యంకుడిది కాబట్టి… పైగా ఇది విమర్శనాత్మక సంపాదకీయం అట… సంపాదకీయం అంటే సంపాదకీయమే… విమర్శనాత్మకం, గుణాత్మకం, ప్రశంసాత్మకం, విశ్లేషణాత్మకం, వ్యంగాత్మకం వంటి కేటగిరీలు ఉండవు… అది కూడా తెలియకుండా నోటికొచ్చినట్టు రాయడం దేనికి…! అదీ ఫస్ట్ పేజీలో సెకండ్ లీడ్…!!
Share this Article