అసలు క్రైం వార్తలకు, స్టోరీలకు ఉన్నంత రీడబులిటీ వేరే వార్తలకు ఉండదు… కానీ పొలిటికల్ డప్పులు, బురద వార్తల నడుమ పత్రికలు, టీవీలు నేరవార్తలను పట్టించుకోవడం మానేశాయి… క్రైం వార్తల్లో హ్యూమన్ ఇంటరెస్ట్ ఎలిమెంట్ ప్రధానం… సరిగ్గా ప్రొజెక్ట్ చేయగలిగితేనే ఆ వార్తలకు పాపులారిటీ… కానీ పాపం శమించుగాక…
పోలీసులు ఏ కథ చెబితే దాన్ని రాసేసి, అచ్చేసి, చేతులు దులుపుకునే ధోరణే పెరిగిపోయింది… అదీ అనాసక్తంగా, నిర్లక్ష్యంగా ప్రజెంట్ చేస్తున్నారు ఈమధ్య… అవసరమైతే రీరైట్ చేసి, సందేహాలు తీర్చుకుని, పాఠకుడికి సరిగ్గా ఎక్కేలా ప్రయాసపడాల్సిన డెస్కులు కూడా నిర్లిప్తంగా మమ అనిపించేస్తున్నాయి… తెలుగు పాత్రికేయానికి దిశ, దశగా చెప్పుకునే ఈనాడులో ఓ వార్త దరిద్రంగా ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు…
Ads
గుంటూరు పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారట… ఎవరయ్యా అంటే… నగ్నంగా యువతులను కూర్చోబెట్టి పూజలు చేసే ముఠా అట… ఈ వార్త చదువుతుంటే రాసిన విలేఖరిని, దిద్దిన సబ్ ఎడిటర్‌ను, ఈ పత్రిక ఎడిటర్‌ను, ఓనర్ రామోజీరావును తలుచుకుని జాలేసే రీతిలో ఉంది… పోలీసులకే సరిగ్గా కథ అల్లడం చేతకాలేదు… వండిన కథకు కూడా ఏమాత్రం రంగు, రుచి, వాసన, చిక్కదనం లేవు… అన్నీ సందేహాలే…
అసలు కీలకమైన ప్రశ్న… క్షుద్ర పూజలు అంటే ఏమిటి నిర్వచనం..? ఏవి శాస్త్రీయ పూజలు..? ఏవి క్షుద్ర పూజలు..? క్షుద్రశక్తులను ఆహ్వానిస్తూ స్మశానాల్లో బలులు, నెత్తురు, నిమ్మకాయలు, చిత్రమైన ముగ్గులతో ఏ అమావాస్య రోజో సాగించే పూజల్ని క్షుద్ర పూజలు అనాలా..? పసుపు, కుంకుమ, హారతి, శఠగోపాలతో రోజూ మనం చూసే రొటీన్ గుడి పూజల్ని శాస్త్రీయ పూజలు అనాలా..? ఏ చట్టం ఈ పూజల్లో ఏవి నేరాలో, ఏవి కావో ఎలా నిర్ధారిస్తుంది..? అసలు పోలీసులు పెట్టిన సెక్షన్లు ఏమిటి..? అవి ఈ పూజలకు వర్తిస్తాయా..? సరే, సదరు పోలీసులను చూసి జాలిపడుతూ… ఆ చర్చను ఇక్కడే వదిలేసి, ఈ క్రైం న్యూస్‌లొోకి వెళ్దాం…
నగ్న పూజలకు అంగీకరించిన యువతుల్లో ఒకరు నిందితుల్లో ఒకడి బావమరిదికి ప్రేమికురాలట కూడా… నాలుగు రోజులపాటు పూజలో నగ్నంగా పార్టిసిపేట్ చేశారట కూడా… అకస్మాత్తుగా వాళ్లు తిరగబడి, దిశ యాప్ ద్వారా లైంగికంగా వేధిస్తున్నట్టుగా కంప్లయింట్ చేస్తే పోలీసులు సినిమాల్లో చూపినట్టుగా హుటాహుటిన పరుగెత్తుకెళ్లి వాళ్లను రక్షించి, ఈ కేసులు పెట్టారట… కేసులో పంచ్ కోసం లైంగిక వేధింపులు అనే అంశాన్ని యాడ్ చేశారన్నమాట…
అదృశ్య శక్తుల్ని సాధించడానికి ముఠాగా ఏర్పడ్డారట… తద్వారా కోట్లు సంపాదించడానికి ప్లాన్ చేశారట… సరే, ఇలాంటి మోసగాళ్లు, క్షుద్ర ఆలోచనల పూజారులు బోలెడు మంది ఉన్నారు… కానీ మంత్రగాళ్ల బారిన పడితే బాధితులు అవుతారు గానీ, వాళ్లను కూడా ముఠా సభ్యులుగా చిత్రీకరించి, కేసులో ఇరికించడం ఏమిటి..? లైంగిక వేధింపులకు పాల్పడితే మొదటి నాలుగు రోజులూ శుద్ధపూసల్లాగా ఉండి, హఠాత్తుగా పోకిరీలుగా మారారా ఈ ముఠా సభ్యులు..?
అసలు వాళ్లు ఏం సెక్షన్లు పెట్టారో, అవి కోర్టులో చెల్లుతాయా..? అంగీకారంతోనే వెళ్లి, డబ్బు కోసం నగ్నపూజల్లో పార్టిసిపేట్ చేశాక సదరు యువతుల తాజా ఆరోపణల్లో విశ్వసనీయత ఎంత..? నిజానికి అసలు కథ వేరనీ, పోలీసులు ఏదో కథను వండారని అర్థం కావడం లేదా..? మరి పత్రికలు గుడ్డిగా వాళ్లు చెప్పింది పబ్లిష్ చేయడం దేనికి..? పోనీ, రిపోర్టర్లకు ఇన్వెస్టిగేట్ చేసేంత, కొత్తగా రిపోర్ట్ చేసేంత ఓపిక, ఆసక్తి, టైం లేకపోవచ్చు… కనీసం డౌట్లు అడిగి, క్లారిఫై చేసుకుని, వీలైనంత స్ట్రెయిట్ స్టోరీ ఇచ్చే సామర్థ్యం కూడా లేదా..? ఒక పత్రికలో డబ్బులివ్వకపోతే తిరగబడ్డారని రాస్తారు, మరో పత్రికలో లైంగిక వేధింపులు అని రాస్తారు… ఏం రిపోర్టింగురా బాబూ… అసలు ఇలా చెత్తను పాఠకుల మెదళ్ల మీదకు రువ్వడమే అతి పెద్ద నేరం ప్లస్ క్షుద్ర పూజ…!!
Share this Article