కొన్నేళ్లుగా ఈనాడును పీడిస్తున్న క్షుద్ర అనువాద వైరస్‌ను మినహాయిస్తే… ఈనాడు యాజమాన్యం మొదటి నుంచీ భాష, శైలి, వాక్యనిర్మాణం, విషయ వ్యక్తీకరణ అంశాల్లో నిక్కచ్చిగా ఉండేది… దాని రాజకీయ పోకడలు, ఇతర దరిద్రాలు ఎలా ఉన్నా, ప్రొఫెషనల్ అంశాల్లో సీరియస్‌నెస్ ఉండేది… వార్త చదివి జనం నవ్వుకునేలా ఉండకూడదనే పాలసీ విషయంలో రాజీపడేది కాదు… ఇప్పుడుందో లేదో తెలియదు గానీ గతంలో క్వాలిటీ సెల్ ఉండేది… పత్రికలో వచ్చే తప్పుల్ని పట్టుకునేది… మంచి మెచ్చుకుంటూనే, తప్పులు జరిగినచోట మందలింపులూ ఉండేవి… కొన్నేళ్లుగా ఈనాడులో వార్తలకు రంచురుచివాసనచిక్కదనాలు ఏమీలేక చప్పిడి పథ్యం వంటకాల్లా ఉంటున్నాయి… యాజమాన్యానికి, సెకండ్ కేడర్ బాసులకు నాణ్యత విషయంలో సీరియస్‌నెస్ పోయింది… ఇది మంచి ఉదాహరణ… నిన్న సోషల్ మీడియాలో ఈ వార్త మీద సెటైర్లు పేలాయి కూడా…!!
నిజానికి ఓ చిన్న క్రైం వార్తను పట్టుకుని, మొత్తం పత్రికలోని వార్తల మీద స్థూలంగా ముద్ర వేయడం కరెక్టు కాదు… కానీ ఉదాహరణకు మెతుకు ఒక్కటి చాలు కదా… వార్త రాయడం దగ్గర్నుంచి, దిద్దే దశలో, పేజీల్లో పెట్టే దశలో, ప్రూఫ్ చూసుకునే దశలో… ఎక్కడా ఎవరూ వార్తలను ప్రింటింగుకు పంపడానికి ముందే పెద్దగా చదవడం లేదు అనడానికి ఉదాహరణ… ఇక్కడ రిపోర్టర్‌ను ఏమీ అనడానికి లేదు… తను ఓ కంట్రిబ్యూటర్… ట్రెయిన్డ్ ఎంప్లాయీ కాదు… తప్పులు సహజం… సబ్ఎడిటర్ ఏం చేస్తున్నాడనేదే కీలకం… హెడింగ్ వోకే… కానీ వార్తలో మొదటి వాక్యమే జనం నవ్వుకునేలా వచ్చేసింది… మంటలంటుకుని మృతి చెందిన వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది… ఈ వాక్యం నిజానికి నవ్వుకునేలా కాదు, ఈనాడును చూసి జాలిపడేలా ఉంది… (రెండు రోజుల కింద ప్రమాదవశాత్తూ మంటలంటుకుని మృతిచెందినట్టు భావిస్తున్న ఆ వృద్ధురాలు నిజానికి ఆత్మహత్య చేసుకుందని తేలింది… ఇలా రాస్తే సరిపోయేది…) మనస్థాపం పదం తప్పు… అలాగే ఓచోట ‘చనిపోయింది’ అంటూ ఏకవచనం, మరోచోట ‘ఉంటున్నారని’ అంటూ గౌరవవచనం… ఆరో వాక్యం మరింత గందరగోళం… జస్ట్, ఈ వార్త మచ్చుకు ఒకటి కావచ్చు… జిల్లా ఎడిషన్లలో రోజూ ఎన్నో… సోవాట్ అంటారా..? సాక్షి, జ్యోతి వంటి పత్రికల్లో ఏమొచ్చినా ఎవరికీ పట్టదు… వాటి జర్నలిజం, భాష తదితరాంశాల మీద పాఠకుడికి ఆల్రెడీ ఓ అంచనా ఉంది… కానీ ఈనాడు వంటి అగ్రశ్రేణి దినపత్రికలో ఇలాంటి తప్పులు, నిర్లక్ష్యం ఉండొద్దనేదే సగటు తెలుగు పాఠకుడి కోరిక… ఈ కథన ఉద్దేశమూ అదే… ఎప్పటిలాగే రామోజీరావు తన ఈనాడు పత్రికను ఉదయమే సీరియస్‌గా ఎందుకు చదవకూడదు..?! రిమార్కులు రాసే తన ఎర్ర స్కెచ్ పెన్ను ఓ కొరడాలాగా ఎప్పటిలాగే ఎందుకు ఛెళ్లుమనకూడదు..?!
Ads
Share this Article