తెలంగాణ నాశనం అయిపోతోంది… ధ్వంసం అయిపోతోంది… ఎడారిలా మారిపోతోంది… ఇక ఎటుచూసినా నెర్రెల పొలాలు, నీళ్లింకిన ఒర్రెలు… జీవజాతులకు ముప్పు… జనం మనుగడే ప్రశ్నార్థకం… జనం వలసపోకతప్పదు… రేడియేషన్ ముప్పుతో నాగసాకి, హిరోషిమాల్లాగా మారిపోనున్న తెలంగాణ……. ఏమిటీ తిట్లు, శాపనార్థాలు అంటారా..?
నమస్తే తెలంగాణ కొద్దిరోజులుగా అలాగే తిడుతోంది… ఫుల్లు ప్రస్ట్రేషన్… ఓనర్‌ను మించిన ఓటమి బాధ… పాత్రికేయం లేదు, తొక్కా లేదు… నోటికొచ్చింది రాయడమే… బహుశా కేసీయార్ కూడా వదిలేసి ఉంటాడు నిరాశలో పడిపోయి… అఫ్ కోర్స్, కేటీయార్ దాన్ని ఎప్పుడూ గుర్తించలేదు… కానీ మరీ ఇంత వేగంగా జారిపోవాలా..? అదీ ప్రశ్న…
చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… వికారాబాద్ అడవుల్లో దమ్మగూడెం ఏరియాలోని వేయో రెండు వేల ఎకరాలో నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కోసం కేటాయించారు… ఆల్రెడీ తమిళనాడులో ఒకటి ఉంది… రాబోయే రోజుల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం అంతర్జాతీయ జలాల్లో అంతర్జాతీయ పాలిటిక్స్ కేంద్రీకృతం కాబోతున్నాయి… చైనా దూకుడు పెరిగింది… ఇండియాకు వ్యతిరేకంగా నానా పన్నాగాలకూ తెగబడుతోంది…
Ads
ఈ స్థితిలో మనకు ఓ అదనపు నేవీ రాడార్ అవసరం… మన భద్రత, రక్షణ వ్యూహాలకు హైదరాబాద్ కీలకస్థానం… అనేక రక్షణ సంస్థలకు అడ్డా హైదరాబాద్… కేసీయార్ ప్రభుత్వం కూడా వోకే చెప్పింది, చెప్పకతప్పదు, ఎందుకంటే, దేశరక్షణ తరువాతే ఏదైనా… కాకపోతే పోలో బైసన్ ల్యాండ్‌తో కుండమార్పిడి బేరం పెట్టాడు కేసీయార్… సెక్రెటేరియట్ అక్కడ కట్టాలని ప్లాన్… జస్ట్, భూమి అప్పగింత మిగిలింది… ఈలోపు రేవంత్ సర్కారు వచ్చింది, వోకే చెప్పింది… ఫైల్ క్లియర్ అయిపోయింది…
ఇక చూసుకొండి… అనేక లక్షల చెట్లు నరుకుతారు, అక్కడి జీవజాతులు అంతరించిపోతాయి, ఔషధ చెట్లు మటాష్, ఎడారి కాబోతోంది, మూసీ తదితర జీవనదులూ ఎండిపోతాయి, తెలంగాణకు గొడ్డలిపోటు అన్నట్టు వారం పది రోజులు డీజే సౌండ్‌తో ఊదరగొట్టింది ఆ పత్రిక… బీఆర్ఎస్ ముఖ్యుల కూతలకన్నా అనేక రెట్లు బలంగా… జస్ట్, ఒక్కసారైనా తమిళనాడులో ఆల్రెడీ ఉన్న రాడార్ ఏరియాలో ఇవీ దుష్ఫలితాలు అని రాయాలి కదా, అప్పుడే తన రాతలకు క్రెడిబులిటీ… వదిలేసింది…
అదయ్యాక కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం మీద రచ్చ… అంతర్రాష్ట్ర నదీజలాల మీద కేంద్ర ప్రభుత్వ విధానం మారింది… తప్పదు, ఐనా రేవంత్ సర్కారు తాము అప్పగించలేదని చెబుతూనే ఉంది, కానీ వినదు, కేసీయార్ నల్గొండ మీటింగు, కుంటివాడినే ఐనా కట్టెపట్టుకుని వచ్చిన, కొట్లాడత అని ప్రసంగాలు… లోకసభ వరకైనా పార్టీని, పార్టీ ముఖ్యులను కాపాడుకునే ఓ ప్రయత్నం… సరే, రాజకీయంగా తనకు తప్పదు, తప్పుపట్టలేం… కానీ తనకన్నా ఎక్కువ నమస్తే తెలంగాణకే ఎక్కువ బాధ,.,
ఇప్పుడిక రేవంత్‌ను ఎండగట్టడానికి మరో ఫీచర్ స్టార్ట్ చేసింది… కాంగ్రెస్‌తోపాటు వచ్చిన కరవు అని సీరీస్… ఈరోజు ఓ ఫుల్ పేజీ… అంటే కాలపురుషుడు తెలంగాణపై పగబట్టాడా..? భూగర్భజలాలను మొత్తం తాగేశాడా..? నదులను ఎండబెట్టాడా..? తనకు కేసీయార్ అంతేనే ప్రేమా..? మిగతావాళ్ల మీద ద్వేషమా..? ఇక తెలంగాణను ఎడారిని చేస్తాడా..? అరె, వోటు వేసిన సిరా గుర్తు కూడా చెరిగిపోలేదు, అప్పుడే ఇంత దాడా..? ఎస్, ఓ ప్రతిపక్షంగా రేవంత్ ప్రజావ్యతిరేక విధానాలు, నిర్ణయాలను తూర్పారబట్టండి, కానీ మరీ ఇలాగా..? ఇంకా ఇంకా ఎక్కువ చెప్పుకుంటే స్పేస్ వేస్ట్… పిటీ నమస్తే..!!
Share this Article