పెద్ద సారు ప్రపంచానికి నీతులు చెబుతాడు… తన చుట్టూ ఉన్న ప్రమథగణాలు మాత్రం ఇంకా నాటి పురాణయుగంలోనే ఉండిపోయాయి… ఏమైనా అంటే కోపం… తాండవం చేస్తాయి… మరీ అవసరమైతే తనవైపే కన్నెర్ర చేస్తూ చూస్తయ్… ఆయనకు అలవాటే కదా భస్మాసుర ప్రహసనాలు… విషయం ఏమిటంటే..? ఆయన తెలంగాణ యాసకు పట్టం కడతాడు అని అమాయకంగా నమ్మారు కదా తెలంగాణ జనం… నో, నో, ఇప్పుడు రుద్దబడిన తెలుగే మన తెలంగాణ భాష అంటూ… ప్రపంచ తెలుగు మహాసభలు అని పెట్టి, జనం కళ్లకు గంతలు కట్టి, జనం చెవుల్లో పువ్వులు పెట్టి… తన భజన బ్యాచులతో చప్పట్లు కొట్టించుకుని, కొత్త కీర్తనలు రాయించుకుని, పరవశించిపోయాడు తెలుసు కదా… ఇప్పుడు ఆ తెలుగు భాష కాదు, తెలంగాణ భాష కాదు… బాహుబలి మార్క్ కిలికిలి భాష ఏదో తన క్యాంపులో కరోనా వైరసులా విస్తరిస్తున్నట్టుంది… మచ్చుకు నమస్తే తెలంగాణ ఫేస్ బుక్ పోస్టు చూడండి ఓసారి…
ఏమైనా అర్థమైందా..? నవ్వొచ్చిందా..? జాలేసిందా…? పోనీ, అసహ్యమేసిందా..? ఒక ‘లిమిటెడ్ కంపెనీ’ వాడే భాష ఇంత దరిద్రంగా ఉందేమిటీ అని ఆశ్చర్యం వేసిందా..? ఆ గూగుల్ వాడు కూడా దీన్ని గుర్తించలేక, ఇదేం భాషో చెప్పలేక చేతులెత్తేసినట్టుగా కూడా అనుకుంటున్నారా..? అవును బాసూ… మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తూ చప్పట్లు కొట్టే స్థాయిలోనే స్టకప్ అయిపోయాం… చివరకు ఇలాంటివి చదవాల్సి వస్తోంది…
Ads
అబ్బే, ఏదో టెక్నికల్ మిస్టేక్ పట్టుకుని ఇదేం వెటకారం అంటూ మీదపడకండి… అసలు టెక్నికల్‌గా మిస్టేక్సే మన అలవాట్లుగా మారినప్పుడే ఈ తల్నొప్పులు… జనం నుంచి నవ్వులు… నగుబాటు… ఎహె, చాల్లెండి, సోషల్ మీడియా పోస్టులు అంటేనే నాన్సెన్స్, దానికి భాషేమిటి..? భాషా సంస్కారం ఏమిటి..? అసలు ఇలా రాయడమే సోషల్ మీడియాకు సూటబుల్ అని సమర్థించుకుంటారా..? అంతేలెండి… తెలంగాణ సమాజం అటువైపే తీసుకువెళ్లబడుతోంది… థాలియా మేరా దోస్తోన్… ఫిర్ ఏక్ బార్… థాలియా…!! (అమ్మా, తమిళిసై… అవమానంగా ఏమీ ఫీల్ కాకు, మేమిలాగే ఉంటాం, ప్లీజ్…)
Share this Article