అనసూయకు బాగా కోపమొచ్చింది… అవును, ఆమె అంతే… ఇతర సెలబ్రిటీల్లాగా ఎవరేమైనా ట్రోలింగుకు దిగితే మూసుక్కూర్చోవడం కాదు, ఈమె మాటకుమాట సమాధానమిస్తుంది… అవసరమైతే కేసు పెట్టి, తాటతీస్తానురోయ్ అని బెదిరించగలదు కూడా… ప్రత్యేకించి ఆమె బట్టల మీదో, వేసే వేషాల మీదో కామెంట్స్ గనుక చేస్తే ఆమెకు చర్రుమంటుంది… అసహనంతో ఊగిపోతుంది… ఈమధ్య ఇన్‌స్టాలో AMA session (ask me anything) లో ఓ నెటిజన్ అడిగాడు… ‘‘నిన్ను ఆంటీ అని పిలవాలా..? అక్క అని పిలవాలా..?’’
నిజానికి మర్యాదగానే ధ్వనిస్తున్నా… అందులో ఆమె వయస్సును పరోక్షంగా ప్రస్తావించడం ఉంది… అయితే దాన్ని నెగెటివ్‌గా తీసుకోవాల్సిన పనేమీ లేదు… అనసూయది పదహారేళ్ల పసిప్రాయమేమీ కాదు కదా… ఎలాగూ ఏజ్ బారే… కానీ ఆమాటంటే ఒప్పుకోదు, ఒప్పుకోవడానికి అస్సలు ఆమె తత్వం అంగీకరించదు… అందుకే ఆ నెటిజన్‌ను పట్టుకుని… ‘‘అక్కా, ఆంటీ అని పిలవొద్దు, అలా పిలిచేంతగా నేను మీకు తెలిసిన వ్యక్తిని కాను… ఐనా ఇలా అడిగావు అంటే నువ్వు ఏజ్-షేమింగ్‌కు పాల్పడుతున్నావనే సందేహం కూడా వస్తోంది’’ అని క్లాస్ పీకింది…
Ads
నిజానికి అనసూయ అనవసరంగా ఉడుక్కుంది గానీ, అందులో ఏజ్-షేమింగ్ ఏముంది..? వికీపీడియాలోనే 38 ఏళ్ల వయస్సు చూపిస్తోంది… ఎవరైనా అక్కా అని పిలిస్తే లేదా తను వేసే రంగమ్మత్త, దాక్షాయని వంటి వేషాలు చూస్తూ అత్తా అని పిలిస్తే అంతగా ఉడికిపోవాల్సిన అవసరం ఏముంది..? అందుకే సదరు నెటిజన్ మళ్లీ ‘‘అక్కా అని పిలిస్తే ఏజ్ షేమింగ్ ఎలా అవుతుంది..? అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు మరి..?’’ అని ఉల్టా క్లాస్ తీసుకున్నాడు… ఇక అనసూయ సుదీర్ఘ వివరణ ఇస్తూ పోయింది… ‘‘నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదా..?’’ అని దబాయిస్తూ… ‘‘కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అనేది నా ఇష్టం… ఒక నావ సముద్రం మీద పోతుంది, కానీ తనలోకి అదే సముద్రాన్ని తీసుకుంటే మునిగిపోతుంది… సో, జనసముద్రం నుంచి ఎంత తీసుకోవాలో నాకు తెలుసు’’ అంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది… ఆ నెటిజన్ జుట్టు పీక్కుని పారిపోయి ఉంటాడు, అది వేరే సంగతి…
మరి ఇంత టెంపర్‌మెంట్ చూపించిన అనసూయ ఓ జబర్దస్త్ స్కిట్‌లో హైపర్ ఆది పుష్పలో దాక్షాయణి పాత్రను, రష్మిక పాత్రను కలగలిపి అనసూయను చీప్‌గా తీసిపారేస్తే మటుకు కిక్కుమనలేదు… 1) అనసూయ చూస్తందిరా, ఒరేయ్, నవ్వుతున్నాదిరా అంటాడు ఆది… (సినిమా చూసినవాళ్లకు ఈ వెగటు సీన్ అర్థమవుతుంది…) నాకు తెలుసురా, అమ్మి నన్ను లవ్ సేస్తున్నదని, ఈ వెయ్యి రూపాయలు కాదు గానీ, పదివేలు పోతేపోనీ… అని ఆది (ఓ మాదిరి అర్థం వచ్చేలా…) ఆపేస్తాడు… ఒక్కసారి సినిమాలో సీన్ గుర్తుతెచ్చుకొండి… అనసూయ నవ్వు ప్లస్ కృత్రిమ కోపంతో చూసేసరికి ఇక ఆది మాటమార్చి పదివేలతో ఏదైనా పెద్ద పూజ ప్లాన్ చేయండ్రా అని ముగిస్తాడు… ఎవరో నెటిజన్ అక్క, అత్త అంటే అంత కోపమొచ్చిందిగా… మరి ఆది మీద రాలేదేం..? పైగా సంబరపడిపోయావేం..? మురిసిపోయావేం..?
2) మామూలుగా ఆడవేషం కట్టే శాంతిస్వరూప్‌ను జబర్దస్త్ స్కిట్లలో రకరకాలుగా వెక్కిరిస్తుంటారు… దాదాపు ప్రతి స్కిట్‌లోనూ… ఇదే హైపర్ ఆది తన స్కిట్‌లో శాంతిస్వరూప్‌కు పుష్ప సినిమాలో అనసూయ పోషించిన దాక్షాయణి గెటప్ వేయించాడు… అంతేకాదు, దాక్షాయణి కదా, సేమ్ ప్రింట్, యాజిటీజ్‌గా ఉన్నారు అంటూ అనసూయ వైపు చూస్తాడు… అక్కడా అనసూయకు కోపం రాలేదు… ఆది పంచ్‌కు మురిసిపోయింది… ఆ నెటిజన్ అక్క అనాలా, అత్తా అనాలా అడిగితే అందులో బోలెడు అవమానించే ఉద్దేశాల్ని వెతికిన అనసూయకు ఆది ఉద్దేశపూర్వకంగానే వేసిన పంచుల్లో మాత్రం (స్కిట్ కోసమే కావచ్చుగాక) కామెడీ కనిపించింది… హేమిటో, అనసక్కా, సారీ అనసత్తా… నువ్వు అర్థమే కావు… నీకు నువ్వైనా అర్థం అవుతావా అసలు..?!
Share this Article