.
ఆహా మోడీ, ఓహో అమిత్ షా…. బీజేపీకి జవసత్వాలు, కీర్తిపతాకలు అని కీర్తిస్తుంటారు కదా… ఫాఫం, అంత సీనేమీ లేదు గానీ… ఏదో రాహుల్ గాంధీ అనే శనిగ్రహం వల్ల కలిసివచ్చిన అదృష్టమే తప్ప, సొంత తెలివితేటలేమీ కాదు…
అరెరె, ఆగండి, జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక తీరు చూశాక, సొంత పార్టీ కేడరే వెలిబుచ్చుతున్న అభిప్రాయం అది… రాజాసింగ్ చెబుతున్నాడని కాదు… స్టిల్, వెంకయ్యనాయుడి కోటరీయే… ఇంకా ఇంకా తెలంగాణ బీజేపీని ఏదో ఓ పార్టీకి తోకగా చేస్తున్న తీరు చూసిన మనస్తాపంతో…
Ads
దశాబ్దాల తరబడీ చంద్రబాబుకు తోకగా మార్చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని సొంతంగా ఎదగనివ్వని కుట్రలు, కుతంత్రాలు చూస్తూనే ఉన్నాం… చివరకు ఆఫ్టరాల్ జుబ్లీ హిల్స్ అనే ఓ ఉపఎన్నికలో కూడా వదలరా వీళ్లు..?
కొందరు బీజేపీ వీరాభిమానులతో మాట్లాడితే అర్థమైంది ఏమిటంటే…?
‘‘జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతుందని కిషన్ రెడ్డికి తెలుసు… అభ్యర్థిత్వం ఆలస్యం… ఏమాత్రం ఫీల్డులో మూవ్‌మెంట్ లేదు… మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి…
ఒకవైపు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం… ఓడితే ఆయనకే తలవొంపులు అని తెలుసు తనకు… మోడీ సమకాలికుడు కాబట్టి, బీఆర్ఎస్ స్నేహితుడు కాబట్టి…. ఏవో పిచ్చి సమీకరణాలతో కిషన్ రెడ్డిని పదే పదే తెలంగాణ బీజేపీకి తనే దిక్కు అన్నట్టు కలరిస్తున్నది బీజేపీ హైకమాండ్…
బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి పీకేసి, కిషన్ రెడ్డికి పగ్గాలు ఇవ్వడం వెనుకా బీఆర్ఎస్ ప్రతిపాదిత సమీకరణాలు ఉన్నాయని ప్రతి కార్యకర్తకూ అర్థమైంది… ఐనాసరే, పదే పదే బీజేపీ ఎదుగుదలను పణంగా ఎందుకు పెట్టబడుతోంది..? ఎవరి ఫాయిదా కోసం..? మోడీషా లెక్కలా..? లేక ఫామ్ హౌజ్ లెక్కలా ఇవన్నీ..?!
జుబ్లీ హిల్స్ ఓటమిని ఓ సాకుగా చూపించి… రేప్పొద్దున బీఆర్ఎస్ లేనిదే బీజేపీకి తెలంగాణలో అధికారం రాదని చెప్పే సిట్యుయేషన్/ గ్రౌండ్ క్రియేట్ చేయడమా..? అయితే అది ఎవరి కోసం..? బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు పన్నినా 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు, మొన్న ఎమ్మెల్సీ సీట్లు పొందారు కదా… మరి ఆ ఫైటింగ్ స్పిరిట్‌ను ఇప్పుడు ఎవరు, ఎవరికి తాకట్టు పెడుతున్నట్టు..?
తెలంగాణలో ఒక్కటంటే ఒక్క బేధోపాయం లేదు… మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల మీద ప్రయోగించిన ఆ అస్త్రాలు తెలంగాణలో ఎందుకు లేవు..? కనీస ప్రయత్నాలూ ఎందుకు లేవు..? పదే పదే బీజేపీని దేశవ్యాప్తంగా పలుచన చేసిన అదే కేసీయార్‌ను మళ్లీ గద్దె మీద చూడాలని ఎవరు ఆశపడుతున్నారు..? దేనికి ఈ కృతజ్ఞత..?
నాలుగు దశాబ్దాలపాటు చంద్రబాబు కాళ్ల మీద పారాడించిన పార్టీని ఇప్పుడు… స్టిల్ అదే భావదాస్యంతో కేసీయార్ పాదాలకు తాకట్టు పెట్టడమేనా..? పొత్తో, అవగాహనో, విలీనమో… మళ్లీ కేసీయార్‌ను సీఎం గద్దె మీద చూడాలని ఆశపడుతున్న ఆ వీరాభిమాని ఎవరు..? అందుకేనా సీబీఐ కాళేశ్వరం మీద ఒక్క అడుగు కూడా కదలడం లేదు..? …………….. కేడర్ అభిప్రాయాల సారాంశం ఇదే… తరువాత ఇక బీజేపీ ఇష్టం… అమిత్ షా, మోడీ కళ్లకు గంతలు ఎవరు కడుతున్నారు..? ఎవరి కోసం..? ఇదే ప్రశ్న..!!
Share this Article