Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెట్రో మంటల పాపం పూర్తిగా మోడీదే… జీఎస్టీ కాదు, సెంట్రల్ ఎక్సయిజే అసలు దోపిడీ…

September 19, 2021 by M S R

ఎవరైనా నిజంగా పెట్రోధరల మంటకు అసలైన కారణాలేమిటో రాస్తారేమోనని చూస్తే అదొక నిరాశ… అందరూ గొర్రెలమందలాగా జీఎస్టీలో పెట్రో ఉత్పత్తులు ఉండకపోవటమే దానికి కారణమనీ, వాటిని తగ్గించాలంటే జీఎస్టీలోకి చేర్చడమే మార్చడమే శరణ్యమనీ రాసిపారేశారు… కొందరైతే జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తుల్ని చేర్చితే లీటర్ పెట్రోల్ ధర ఎంతకు తగ్గొచ్చో కూడా లెక్కలేశారు… ప్రజల్లో ఆశల్ని రేకెత్తించారు, అదుగో జీఎస్టీ కౌన్సిల్ మీటింగు జరుగుతోంది, చర్చిస్తారు, జీఎస్టీలోకి చేర్చే చాన్సుంది, ధరలు తగ్గే అవకాశముందనీ బోలెడు కథనాలు రాసేశారు… కానీ వాళ్లు మరిచిపోయిన అంశాలు కొన్ని…

  • బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలివిగా ఈ అంశాన్ని జీఎస్టీ అంశం వైపు నెట్టేస్తోంది…
  • రాష్ట్రాలు అంగీకరించడం లేదు కాబట్టి మేం ఏ నిర్ణయమూ ఇప్పుడు తీసుకురాలేకపోతున్నాం…
  • అసలు రాష్ట్రాలదే తప్పు తప్ప కేంద్రప్రభుత్వానిది పాపం, ఏ తప్పూ లేదు… అది శుద్ధపూస…

కానీ నిజమేమిటి..?

petro

Ads

నిజం ఏమిటంటే…. సంపూర్ణంగా పెట్రోధరల మంటకు ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం… ఏమీ డౌట్ లేదు… అది దిగ్రేట్ వరల్డ్ ఫేమస్ ఎకనమిస్ట్ నిర్మలా సీతారామన్‌కు కూడా తెలుసు… ఫాఫం, ఆమె ఏం చేయగలదు..? మోడీ చెప్పినట్టు ఏవో పనికిరాని ముచ్చట్లను మీడియా ముందు చెప్పడం తప్ప, తనలోతను పశ్చాత్తాపపడటం తప్ప..! అందరికీ తెలుసు కదా.., మోడీ అనే కేరక్టర్ ప్రజల కష్టాలతో ఏమాత్రం కనెక్ట్ కాలేడనీ, ప్రజలకు ఉపశమనం కలిగించే ఏ చర్యకూ తను ఇష్టపడడనీ..! జనం ఈ కరోనా కష్టాల్లో పడి ఏమైపోతేనేం…? తన వేక్సిన్ దందా తనది… మస్తు విదేశీమారకద్రవ్యం ఉంది, కేంద్రం దగ్గర మస్తు డబ్బు ఉంది అని చెప్పుకోవడానికి తప్ప… అసలు అదంతా జనానికి ప్రయోజనం కలిగించకపోతే దానికి సార్థకత లేదని తనకు తెలియదు, నిజానికి ఆయన తప్పేమీ లేదు, బేసిక్‌గా తనది ఓ పక్కా గుజరాతీ వ్యాపారి మనస్తత్వం…

నిజానికి అసలు సమస్య మోడీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి… క్రూడాయిల్ ధరలు పడిపోయినప్పుడల్లా, ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా సెంట్రల్ ఎక్సయిజు పెంచుకుంటూ పోయింది… ఆ ధరలు పెరిగినప్పుడు దేశీయంగా పెట్రో ధరలు పెరిగిపోతుంటే మాత్రం చూస్తూ ఉండిపోయింది… రాష్ట్రాల మీదకు నెట్టేస్తూ నీతులు చెబుతోంది… రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవచ్చు కదా అని సన్నాయినొక్కులు నొక్కుతోంది… నువ్వేమో ఎడాపెడా దండుకుంటావు, రాష్ట్రాలు ఆదాయం వదులుకోవాలా..? ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్లీ క్రూడ్ ధరలు పెరుగుతున్నయ్, ఇక పెట్రో ధరలు ఎక్కడికి చేరుకుంటాయో ఎవరూ చెప్పలేని స్థితి, మోడీ ప్రభుత్వం ఆదుకుంటుందనే భ్రమలు కూడా ఎవరికీ లేవు ఇప్పుడు…

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిచాలని కేరళ హైకోర్టు చెప్పింది కాబట్టి ఈసారి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఆ అంశాన్ని పెట్టారు, మమ అనిపించేసి, రాష్ట్రాలకు అంగీకరించడం లేదంటూ తప్పును, పాపాన్ని వాటిపైకి నెట్టేసింది నిర్మలా సీతారామన్… మరి సెంట్రల్ ఎక్సయిజు మాటేమిటి..? ఎంతసేపూ రాష్ట్రాలను నిందించడం ఏమిటో అర్థం కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయని మరిచిపోతున్నట్టుంది మోడీ ప్రభుత్వం… మీడియా మాత్రం రెచ్చిపోయి ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రో ధరలు ఎంత తగ్గొచ్చో లెక్కలేస్తూ జనాన్ని బీజేపీ కోరుకున్న భ్రమల్లోకి, మాయల్లోకి, మళ్లింపుల్లోకి తీసుకుపోయింది… నిజాలేమిటి మరి..?

petro

  • చూశారు కదా… పెట్రోల్, డీజిల్, గ్యాస్ కలిపి 2013-14, అంటే యూపీయే ప్రభుత్వ హయాంలో సెంట్రల్ ఎక్సయిజు రూపంలో ఎంత రెవిన్యూ వచ్చేది, ఇప్పుడు ఎంతకు పెరిగిందో చూశారు కదా… అదీ తేడా…
  • పెట్రోల్ మీద సెంట్రల్ ఎక్సయిజు యూపీయే హయాంలో, అంటే 2014లో ప్రతి లీటర్‌పై 9.48 రూపాయలు ఉండేది, ఇప్పుడది 32.9 రూపాయలు… తేడా అర్థమైంది కదా…
  • నిజానికి పెట్రో ధరలు తగ్గాలి, అంతర్జాతీయంగా సగటు క్రూడాయిల్ ధరలు 2014తో పోలిస్తే బాగా తగ్గిపోయాయి… ఆ ప్రయోజనం కూడా ప్రజలకు రాకుండా అడ్డుపడి, ఆ ఆదాయం మొత్తం తనే కాజేసింది… 2014-15లో క్రూడాయిల్ సగటు ధర 84 డాలర్లు (బ్యారెల్ ధర) ఉంటే అది కాస్తా ఇప్పుడు 44 డాలర్లు…
  • అంతర్జాతీయ ధరలను బట్టే దేశంలో పెట్రో ధరలు అని నీతులు చెప్పే నేతలు దీనికి ఏమంటారు..?
  • డీజిల్ సంగతి చూద్దామా..? 2014లో దీనిపై సెంట్రల్ ఎక్సయిజు డ్యూటీ లీటర్‌కు 3.56 రూపాయలు… అది కాస్తా 2021 వచ్చేసరికి 31.8 రూపాయలు అయ్యింది… జస్ట్, తొమ్మిది రెట్లు…
  • ఇప్పుడు చెప్పండి, పెట్రో ధరల పాపం రాష్ట్రాలదా..? కేంద్రానిదా..? ఏ లెక్కలు ఏ కోణంలో చూసినా రాష్ట్రాల పాపం ఏమీ లేదు… అవీ పన్నులు భారీగా వేస్తున్నయ్, కానీ కేంద్రం కొడుతున్న కొరడా దెబ్బలతో పోలిస్తే చాలా చాలా తక్కువ… ఇప్పటికీ బీజేపీ డైవర్ట్ చేసే ఆలోచనల్లో పడిపోతోంది తప్ప, నిజంగా జనానికి కాస్త ఉపశమనం కలిగించే ఉపయుక్త చర్యలు ఆలోచించడం లేదు… మోడీ అంటే అంతే…!! కరోనా వేక్సిన్ల పాలసీల దగ్గర్నుంచి, ఈ కరోనా సాయంలో జనానికి భరోసా ఇవ్వలేని అసమర్థత దాకా… ఎన్నెన్నో అమానవీయ పోకడలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions