Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్‌ను టాకిల్ చేయడం అంటే మాటలా మరి… బీజేపీ అనాలోచిత అడుగులు…

April 7, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……….  పులి తన ఆహారం కోసం వేటాడడానికి చాలా సహనంగా రహస్యంగా వేచి చూస్తుంది ! అలాంటి పులిని వేటాడడానికి వేటగాడికి ఎంత సహనం, ధైర్యం, ఓర్పు ఉండాలి ? ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా చివరికి వెటగాడే పులికి ఆహారం అయిపోతాడు! ఇలాంటి చవకబారు వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తనకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునే కరకట్టకి పరిమితం చేశాడు KCR!

నీకు, నీ తెలుగు దేశం పార్టీకి తెలంగాణాలో పని లేదు, పోయి ఆంధ్రాలో నీ రాజకీయం చేసుకో అంటూ తరిమేశాడు చంద్ర బాబుని ! అక్కడితో ఆగకుండా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం కేడర్ ని దాదాపుగా తుడిచిపెట్టేశాడు KCR! చంద్రబాబు ఎలాంటి కుయుక్తులు పన్నుతాడో దగ్గర ఉండి మరీ చూసిన అనుభవం ఉంది KCR కి !

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా సహాయపడగల వాళ్ళని అందరినీ తన వైపు లాక్కున్నాడు KCR! వీళ్లలో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లే ! ఎవరి బలహీనతలు ఏమిటో తెలుసుకొని మరీ, వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి మరీ, ఇన్నాళ్ళూ అధికారం చెలాయిస్తూ వచ్చిన KCR తెలంగాణ సెంటిమెంట్ ని ఎలా వాడుకోవచ్చో ఒక ప్రామాణిక గ్రంధాన్ని రచించాడు !

Ads

నిజానికి తాను అధికారంలోకి రావడానికి ఆంధ్రా వ్యతిరేకతని వాడుకున్నాడు తప్పితే తన చుట్టూ ఉన్న కోటరీలో ఎక్కువగా ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లే ఉన్నారు… ఇది సత్యం ! గుమాస్తా తెలంగాణాలో ఆంధ్రా వాళ్ళు పనిచేయడం లేదా ? తెలంగాణలోని సివిల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల కాంట్రాక్టుల హక్కుదారులు ఎవరు ? అదేంటని తెలంగాణ ప్రజలు ప్రశ్నించకూడదు అని ముందే ముందరి కాళ్ళకి బంధం వేశాడు KCR… అదేమిటంటే మన రాష్ట్రం మనకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాం అని…! అయిపాయే !

నిజానికి ఎంఎల్ఏల కొనుగోలు వ్యవహారంలో KCR కి హైకోర్టు నుండి రెండుసార్లు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ హౌస్ కేసుని సిబిఐకి బదిలీ చేసింది కోర్టు. కానీ తెలంగాణా సిఐడి కేసు తాలూకు ఫైల్స్ ని సిబిఐకి ఇవ్వలేదు చాలాకాలం పాటు. దాంతో సిబిఐ హైకోర్టులో ఫిర్యాదు చేసింది కోర్టు ఆర్డర్ చేసినా ఇంతవరకు ఫామ్ హౌస్ తాలూకు కేసు వివరాలు వాటి తాలూకు ఫైల్స్ మాకు ఇవ్వలేదంటూ… దాంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు తాలూకు ఫైల్స్ ఎందుకు ఇవ్వలేదంటూ ! ఈ వ్యవహారంలో తప్పు అంతా బిజేపి వైపు ఉన్నట్లు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు KCR… కానీ విఫలం అయ్యింది ప్లాన్ కాస్తా ! కనీసం అప్పటి నుండి అయినా రాష్ట్ర బిజేపి నాయకత్వం జాగ్రత్తగా ఉండాలి కదా ?

KCR తన కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చిన మొబైల్ ఫోన్లకి బండి సంజయ్ మీద పెట్టిన కేసుతో సంబంధం ఉందా ? ఖచ్చితంగా సంబంధం ఉంది ! వారం రోజుల క్రితం ఈడీ అధికారులు కవితకు ఒక విజ్ఞప్తి ని పంపారు… దాని సారాంశం ఏమిటంటే : మీరు మాకు అందచేసిన మొబైల్ ఫోన్ల తాలూకు డాటాని రికవరీ చేయడానికి గాను అనుమతి లేదా ఆధరైజేషన్ లెటర్ ఇవ్వమని… మీరు ఆధరైజేషన్ లెటర్ ఇస్తే మీరు మాకు ఇచ్చిన ఫోన్లని రికవరీ కోసం వాడుకుంటాము… అంటే ఫోన్ టాంపరింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట.

ఇలా విజ్ఞప్తి చేయడంలో ED ఆంతర్యం ఏమిటంటే కవిత ఫోన్లు ఇచ్చింది టెస్ట్ చేసుకోమని కానీ వాటిని టాంపరింగ్ చేసిన తరువాత కోర్టులో కేసు వేయవచ్చు నేను ఫోన్లు ఇచ్చింది ఎలా ఉన్నాయో అలానే టెస్ట్ చేసుకోమనే, కానీ అధికారులు నా ఫోన్లని టాంపర్ చేశారు అని… అందుకని ముందు జాగ్రత్తగా ఆధరైజేషన్ లెటర్ అడిగారు ED అధికారులు !

ఇక మళ్ళీ ప్రశ్నా పత్రం కేసులో వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ‘‘బండి సంజయ్ ప్రధాన ముద్దాయి కాబట్టి దానిని నిరూపించాలి అంటే సంజయ్ ఫోన్ ఇస్తే ఆయన డిలీట్ చేసిన వాట్సప్ డాటా రికవరీకి పంపిస్తే కుట్ర బయటపడుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. కానీ బండి సంజయ్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించారు అంటూ ముక్తాయింపు ఇచ్చారు రంగనాథ్… ఇక్కడ సంజయ్ ఫోన్ అధికారికంగా పార్లమెంట్ సభ్యులకి ఇచ్చే మొబైల్ ఫోనా లేక ఆయన స్వంత మొబైల్ ఫోనా అన్నది తెలియదు.

దీనిని బట్టి మనకి అర్ధం అవుతున్నది ఏమిటీ ? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మొబైల్ ఫోన్ డాటాని రికవరీ చేసి కేసుని బలంగా చేయడానికి మీరు ప్రయత్నిస్తే మేము ఇక్కడ బండి సంజయ్ ఫోన్ స్వాధీనం చేసుకొని, డాటా రికవరీ చేస్తాము అనే హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది కదా ?

ఈ విషయంలో తెలంగాణ హైకోర్ట్ వారి ప్రశ్న ఏమిటంటే… ఒకసారి ప్రశ్నాపత్రం పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక అది లీకేజీగా ఎలా పరిగణిస్తాము అని అడ్వొకేట్ జనరల్ ని ప్రశ్నించింది. నిజమే కదా ? కానీ సదరు అడ్వొకేట్ జనరల్ తిరిగి సమాధానం ఇస్తూ ప్రశ్నా పత్రం లీకేజీ విషయంలో… ముందు రోజు సదరు జర్నలిస్టు సంజయ్ కి 100 ఫోన్ కాల్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బండి సంజయ్ పాత్ర ఉంది కాబట్టి మీరు ఆదేశాలు ఇస్తే మేము బండి సంజయ్ ఫోన్ స్వాధీనం చేసుకొని, డిలీట్ చేసిన డాటా రికవరీ చేసి, కుట్ర కోణం నిరూపిస్తాము అని అన్నారు. ఇప్పుడు కేసు ఈ నెల 10కి వాయిదా వేసింది హైకోర్టు!

ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రని తగ్గించడానికి బేరసారాలు చేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయింది !

ఒక పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ ఫోన్ లో ఎవరితో అయినా ఎన్ని సార్లు అయినా మాట్లాడవచ్చు… అందులో తప్పు పట్టడానికి ఎవరికీ అధికారం ఉండదు… కానీ మొబైల్ సంస్థతో మాట్లాడి, సంజయ్ మొబైల్ డాటా తీసుకొని, ఎవరు ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడారనే విషయాన్ని ఆధారంగా చేసుకొని, కేసుని క్లిష్టంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారని అర్ధం అయిపోతున్నది.

ఏది ఏమయినా కోర్టు ఇచ్చే ఆదేశాలమీద ఆధారపడి ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతున్నదో ? KCR లాంటి వ్యక్తిని డీల్ చేయాలంటే చంద్రబాబుతోనే కాలేదు… అలాంటిది బండి సంజయ్‌తో అవుతుందా అన్నదే ప్రశ్న ఇక్కడ ! బండి సంజయ్ గెలిచినప్పుడు నేను పోస్ట్ పెట్టాను మరియు అప్పుడే చెప్పాను సంజయ్ ఇలాంటి రాజకీయాలని ఎదుర్కోగలడా అని ! కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి బయటపడేయడానికి KCR చేస్తున్న ప్రయత్నాలే ఇవి ! అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలా లేదా ?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions