అది ఒకప్పుడు… బీజేపీ అంటే బనియా పార్టీ, బ్రాహ్మణ్ పార్టీ… ఆ ముద్రల నుంచి వేగంగా చాలా దూరం వచ్చేసింది పార్టీ… మొన్న చెప్పుకున్నాం కదా… తమిళనాట పార్టీ అధ్యక్షుడిగా అన్నా మలై, ఎస్సీ, మాజీ ఐపీఎస్… తెలంగాణలో బీసీ సీఎం అనే స్లోగన్… ఎస్సీ వర్గీకరణకు హామీ… బీజేపీ కోసం మంద కృష్ణ మద్దతు… రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము… ఆదివాసీ… ఛత్తీస్‌గఢ్‌లో సీఎంగా ఓ ఎస్టీ, విష్ణుదేవశాయి ఎంపిక… తాజాగా మధ్యప్రదేశ్ సీఎంగా ఓబీసీ మోహన్ యాదవ్ ఎంపిక…
మొత్తం శాసనసభ్యులందరినీ కూర్చోబెట్టి, అభిప్రాయాలు తీసుకుని విష్ణుదేవను ఎంపిక చేసినట్టుగానే… మధ్యప్రదేశ్‌లో కూడా 163 మంది శాసనసభ్యులను సంప్రదించి, మెజారిటీ అభిప్రాయంతో మోహన్ యాదవ్ పేరుకు టిక్ కొట్టింది బీజేపీ హైకమాండ్… (మొత్తం 230 సీట్లకు గాను 163 సీట్లు అంటే దాదాపు స్వీప్… కాంగ్రెస్ 66 సీట్లకు పరిమితమైంది…) రెండు రాష్ట్రాల్లోనూ క్యాంపుల్లేవ్, వర్గ కొట్లాటల్లేవ్… నిజానికి పార్టీలోనే చాలామంది ఆశ్చర్యపోయారు మోహన్ యాదవ్ పేరుకు వచ్చిన యాక్సెప్టెన్సీ చూసి… అసలు ఎవరు అతను..?
1965లో ఉజ్జయినిలో పుట్టాడు… (ప్రజెంట్ రాజకీయ ప్రమాణాల్లో యంగ్ అనుకోవచ్చు…) మొదటి నుంచీ సంఘ్ పరివారే… విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో వర్క్ చేసేవాడు… బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంబీఏ, పీహెచ్‌డీ… వకీలు, వ్యాపారి… తోడుగా రాజకీయం… ఆర్ఎస్ఎస్ నేపథ్యం తనకు ఉపయోగపడేది… గతంలో పలు పదవుల్లో వర్క్ చేశాడు గానీ 2013లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, గెలిచాడు… తరువాత 2018లోనూ గెలుపు… ఈసారి హ్యాట్రిక్… 13 వేల వోట్ల మెజారిటీతో గెలుపు… గతంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా చేశాడు…
Ads
నిజానికి ఈ సీఎం పోస్టుకు ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర తోమర్ పేర్లతోపాటు జ్యోతిరాదిత్య సింధియా పేర్లు బాగా వినవచ్చాయి… శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరు మొదటి నుంచే చర్చల్లో లేదు… కానీ అనూహ్యంగా బీజేపీ జ్యోతిరాదిత్య పేరును కూడా పక్కన పెట్టేసి మోహన్ యాదవ్ పేరును పైకి తీసింది… రాష్ట్రంలో సగం జనాభా ఓబీసీలే… రాబోయే రోజుల్లో మరింతగా బీసీ వోట్లలో తమ బలాన్ని పెంచుకోవడం పార్టీ హైకమాండ్ ఆలోచన… పైగా మోహన్ యాదవ్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది…
బీజేపీ కులసమీకరణాల్ని కూడా చూసుకుంది ఇక్కడ… ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లని ఎంపిక చేసింది… ఒకరు రాజేంద్ర శుక్లా… బ్రాహ్మిణ్… మరొకరు జగదీష్ దేవరా… ఎస్సీ… వింధ్య ప్రాంతంలో బ్రాహ్మణ జనాభా ఎక్కువ కాగా మాల్వా నిమర్ ఏరియాల్లో ఎస్సీ జనాభా ఎక్కువ… ఓ, ఒక ఓబీసీ సీఎం, ఒక బ్రాహ్మిణ్ డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం… సీనియర్ నరేంద్ర తోమర్ రాజపుత్… తనను స్పీకర్‌ను చేసేశారు… బహుశా జ్యోతిరాదిత్యను కేంద్ర కేబినెట్‌లోనే కొనసాగు అంటారేమో…
ఇక చూడాలి… రాజులు పట్టు వదలని రాజస్థాన్‌లో ఎవరిని సీఎంను చేస్తారో… అసలే అక్కడ వసుంధర రాజె సింధియా టెంపర్ ఎక్కువ… తనకు ఓ వర్గం… ప్రత్యేక భేటీలు… మోడీ, షాలకు కొరకరాని కొయ్య మొదటి నుంచీ… మారుతున్న పార్టీ ప్రాధాన్యాలు, కుల సమీకరణాల్లో ఆమెనూ కొట్టిపారేస్తారేమో…!!
Share this Article