.
బీహార్‌లో బీజేపీకి మరింత బలాన్ని, ఆనందాన్ని… అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిన అంశం ఏమిటో తెలుసా..? ఈసారి నితిశ్ తోక జాడించాలని అనుకున్నా… అది కుదిరే సిట్యుయేషన్ లేదు…
నితిశ్ దేశంలోకెల్లా అత్యంత చంచల, అవకాశవాది… ఇందులో ఎవరికీ ఏ డౌటూ అక్కర్లేదు… నితిశ్ కూడా నవ్వుతూ అంగీకరిస్తాడు… అందుకే కదా, అటూ ఇటూ జంపుతూ… ముఖ్యమంబత్రి పీఠంపై రెండు దశాబ్దాలుగా కూర్చుని, ఇంచు కూడా కదలడం లేదు…
Ads

ఈ కథనం రాసే సమయానికి ( సాయంత్రం 5 గంటలు ) బీహార్ అసెంబ్లీ ముఖచిత్రం ఇదీ… ఎప్పుడైనా నితిశ్ బీజేపీ మీద అలిగి, జంప్ చేసి, ఆర్జేడీతో కూడాలనుకున్నా… కూడికలు, తీసివేతలు, భాగహారాలు ఏవీ తనకు సహకరించవు…
లోకసభలో మెజారిటీ కోసం బీజేపీ నితిశ్, చంద్రబాబు మీద ఆధారపడి ఉంది కదా… మోడీ దురదృష్టం కొద్దీ… ఇప్పుడు నితిశ్ ఏరకంగానూ బ్లాక్ మెయిల్ చేయలేడు… ఎందుకంటే..?

బీజేపీ, జేడీయూ ఈసారి బీహార్ ఎన్నికల్లో చెరి 101 స్థానాల్లో పోటీచేశాయి… ఎక్కువ, తక్కువ పంచాయితీల్లేకుండా… అందులో బీజేపీ ఏకంగా 92 సీట్లు గెలవడం అంటే ఆల్మోస్ట్ 92 శాతం స్ట్రయిక్ రేటు… దీంతో పోలిస్తే నితిశ్ 83 శాతమే… (చివరి ఫలితాలు వెలువడేసరికి కాస్త అటూ ఇటూ మారొచ్చు…
మరోవైపు ఆర్జేడీ కూటమి ఘోరంగా మరీ 34 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది… సో, నితిశ్ మరోసారి తోక జాడించినా… ఆర్జేడీ కూటమి ప్లస్ ఇతరులు కలిసినా సరే కనాకష్టమ్మీద (34+ 6) 123 మార్క్ చేరుకోగలడు… అదీ ఆరు పార్టీలు కలిసొస్తే…! తుది ఫలితాలు వచ్చేసరికి ఆర్జేడీ కూటమి ప్లస్ జేడీయూ కలిసినా మెజారిటీ మార్క్ చేరుకోలేని స్థితి కూడా రావొచ్చు…

చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోకజనశక్తి పార్టీ 28 సీట్లలో పోటీచేసి దాదాపు 20 దాకా గెలవడం అంటే విశేషమే… ఈసారి బీజేపీకి సంతోషాన్ని కలిగించే మరో అంశం లెఫ్ట్ పార్టీలు మరీ ఒకటీరెండు సీట్లకు పరిమితం అయిపోవడం… కాంగ్రెస్ ఏకంగా 61 సీట్లకు డిమాండ్ చేసి, ఆర్జేడీపై ఒత్తిడి చేసి నిలబడితే, జస్ట్ 5 సీట్ల గెలుపుకు పరిమితం కావడం బీజేపీకి ఫుల్ హేపీ…
ఎందుకంటే… రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన శుష్క నినాదాలు వోట్ చోరీ, సర్, బీజేపీ వ్యతిరేక వోట్ల తొలగింపు వంటివి మొత్తం మట్టిగొట్టుకుపోవడం…! వక్ఫ్ బిల్లు పునరుద్ధరిస్తామని తేజస్వి, 370 ఆర్టికల్ పునరుద్దరిస్తామని రాహుల్ జనాభిప్రాయాలకు వ్యతిరేక ధోరణిలో పోయారు…
సరే, బీజేపీకి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా సరే... రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలపాలి... తను కాంగ్రెస్‌ను లీడ్ చేసినన్ని రోజులూ బీజేపీకి ఢోకా లేదు..!
అన్నింటికీ మించి అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు… జనసురాజ్ పార్టీ పెట్టి, 238 సీట్లలో (అవుటాఫ్ 244) పోటీచేసిన ప్రశాంత్ కిషోర్‌ను బీహార్ ప్రజలు ఈడ్చి – కొట్టారు… అప్పట్లో నితిశ్ తన వారసుడిగా చేరదీస్తే… దాన్ని తన్నేసి, సొంతంగా వేరే దుకాణం పెట్టుకున్నాడు… ఇదుగో ఇలా మిగిలాడు..!!
Share this Article