తెలుగునాట ప్రతి మీడియా ఒక పార్టీ గొంతుక… కరపత్రిక… నిష్పాక్షికత అనేది ఓ భ్రమ… ఎవరి బాస్ పాదపూజ కోసం ఏం చేయాలో అది చేస్తయ్… ఎవ్వరూ మినహాయింపు కాదు… పార్టీల పోరాటం కాస్తా మీడియా పోరాటంగా, సోషల్ మీడియా పోరాటంగా పరిణమించింది… ఇది ఇంకా ఏ రూపాలు తీసుకుంటుందో తెలియదు… పార్టీల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాన్తానై… మీడియాను కంట్రోల్ చేయడం కూడా పోరాటాంశమే ఇప్పుడు…
యెల్లో మీడియా వర్సెస్ జగన్ మీడియా పోరు చూస్తూనే ఉన్నాం… తెలంగాణలో పింక్ మీడియా ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది… బీజేపీ ఈ పింక్ మీడియాపై కస్సుమంటోంది… ముందుగా కేసీయార్ సొంత మీడియాపై కాన్సంట్రేట్ చేసింది… ఏకంగా పార్లమెంటరీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది… ఎహె, ఈ ఫిర్యాదులతో ఏమవుతుందీ అనుకోవద్దు… ఇప్పుడున్న స్థితిలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటంలో పింక్ మీడియా మీద పోరు కూడా ఓ భాగం అయిపోయింది…
Ads
తెలంగాణ బీజేపీ ముఖ్యులంతా వెళ్లి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి…. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ మీద ఫిర్యాదులు చేశాయి… ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా నవ్వకండి… ఇది ఒక చర్చ… పార్టీలకు అనుబంధంగా మీడియా సంస్థలు తెలంగాణలోనే కాదు… దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నయ్… అసలు నిష్పక్షపాత మీడియా అనేది లేకుండా పోయిన స్థితిలో… పార్టీల పోరాటం కాస్తా మీడియా మీద ప్రభావాన్ని చూపిస్తోంది…
నిజంగా కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంది..? ఏం చెబుతుంది..? బీజేపీ అనుకూల మీడియా కూడా ఉంది కదా… మరి వాటి మాటేమిటి..? సో, ఫలితంపై ఆసక్తి ఏర్పడింది… జస్ట్, వీళ్లేదో ఫిర్యాదు చేశారు, ప్రొటెస్ట్ చేశారు అన్నట్టుగా లేదు… లోకసభ సెక్రెటేరియట్ వెంటనే స్పందించింది… ప్రివిలేజ్ అండ్ ఎథిక్స్ బ్రాంచ్ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఎడిటర్లకు నోటీసులు కూడా జారీచేసేశాడు… (టీన్యూస్‌కు ఎడిటర్ లేడు)… 25వ తేదీలోపు సమాధానం ఇస్తారా..? చర్యలు తీసుకోవాలా అని హెచ్చరించాడు…
తరువాత ఏమవుతుంది అనేది కాసేపు వదిలేద్దాం… తెలుగు రాజకీయాల్లో మీడియా కంట్రోల్ అనేది ఓ పార్ట్… సాక్షిని మూసేయించాలని చంద్రబాబు ప్రయత్నించాడు… యెల్లో మీడియా మీద కేసులతో కంట్రోల్ చేయాలని జగన్ ప్రభుత్వ ప్రయత్నం… సేమ్, ఇప్పుడు తెలంగాణలో..!! కేసీయార్ సొంత మీడియా మీద బీజేపీ కక్షకట్టింది… అసాధారణం అని గానీ, జరగదని గానీ అనుకోవడానికి లేదు… ఎవరి అధికార పరిధిలో వాళ్లు కొరడాలు అందుకుంటున్నారు… అదీ విశేషం…
బీజేపీకి ఉన్న ఏకైక మీడియా వీ6 చానెల్, వెలుగు దినపత్రిక… పింక్ మీడియాలో చాలా చానెళ్లు, పత్రికలు పరోక్షంగా భయం కొద్దీ, భక్తి కొద్దీ వ్యవహరిస్తున్నయ్… వాటికి పగ్గాలు వేయాలనేది బీజేపీ ప్రయత్నం… ఇక కేసీయార్‌కు చిర్రెత్తితే వెలుగు, వీ6 టీవీ మీద ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాల్సిందే… ఏవో కేసులు పెట్టగానే కేసీయార్ సొంత మీడియా లొంగిపోతుందా, వంగిపోతుందా..? పోరాడుతుంది…!! రాజ్యాంగంలోని భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన సెక్షన్లను ముందు పెడుతుంది…
సో, లోకసభ సెక్రెటేరియట్ తదుపరి స్పందన అనేది వేచి చూడాలి… ఒకవైపు సాక్షి టీవీలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుమతుల రద్దు అనేది బాగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో… బీజేపీ వర్సెస్ పింక్ మీడియా అనేదీ ఆసక్తికరంగా మారింది… అన్నట్టూ… అటు జగన్‌కు, ఇటు కేసీయార్‌కు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఇప్పుడు… ఆ టీం చేసేది పూర్తిగా సోషల్ మీడియా వక్రీకరణలు, వక్రబాష్యాలు, తప్పుడు ప్రచారాలు… దీనికి కౌంటర్‌గా చంద్రబాబు రాబిన్ శర్మను పెట్టుకున్నాడు కదా, ఆమధ్య ఆయన్ని వదిలేసి సునీల్ కనుగోలును పెట్టుకున్నాడు అని వార్తలొచ్చాయి…
కానీ తాజా వార్తలు ఏమిటంటే..? తెలంగాణ పీసీసీ ప్లస్ కర్నాటక పీసీసీకి ఈ పీకేమార్క్ ఒప్పందాల్ని సునీల్ కుదుర్చుకున్నాడని..! సో, రాబోయే కాలంలో ఈ సునీల్ టీంను కేసీయార్ ఎలా ‘‘ఒత్తబోతన్నాడు’’ అనేదీ ఆసక్తికరమే… అంతేకాదు, బీజేపీ మీడియా అండ్ సోషల్ మీడియా టీమ్స్ మీద ఎలా స్పందించబోతున్నాడనేదీ ఇంట్రస్టింగే…!! అవునూ… రాజకీయ పోరాటంలో మీడియా కంట్రోల్ కూడా భాగమేనా బండి సంజయ్‌జీ..!!
Share this Article