హర్యానా అసెంబ్లీ ఎన్నికల సన్నాహం!
మొదటి నుండి అనుకుంటున్నదే జరిగింది!
కాకపొతే కొంత సినిమా ఫక్కీ లాగా సన్నివేశాలు ఆవిష్కృతం అయ్యాయి!
రెజ్లర్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు!
పాపం! కొంతమంది సోషల్ మీడియాలో వీళ్ళని క్రీడాకారులుగా చూడాలి తప్పితే రాజకీయాలు అంటగట్టకూడదు అంటూ వాకృచ్చారు. నేను సంవత్సరం క్రితమే స్పష్టంగా చెప్పాను వీళ్ళ రాజకీయ కుట్ర గురుంచి.
సరే! అనుకున్నదే జరిగింది!
వాట్ నెక్స్ట్?
హర్యానా అసెంబ్లీ 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ 31 మంది అభ్యర్థుల పేర్లని ప్రకటించింది!
వీటిలో వినేష్ ఫోగట్ కి జూలానా అసెంబ్లీ సీటు కేటాయించింది! ఇది చాలా కాలం నుండి అనుకుంటున్నదే! చాలా ప్రి ప్లాన్డ్ గా ఉన్నారు కదా? ఇక భజరంగ్ పూనియాకి అసెంబ్లీ సీటు ఇవ్వకుండా కిసాన్ కాంగ్రెస్ కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది!
Ads
గుర్తుందా? నెల క్రితం పంజాబ్, హర్యానా రైతు ప్రతినిధులు ఏకంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ ని కలిసిన సంగతి? రైతుల సమస్య మీద మళ్ళీ ఆందోళన చేస్తాము అనే ప్రకటన కూడా చేశారు.
So! రాబోయే రెండవ రైతు ఉద్యమం సందర్బంగా భజరంగ్ పూనియా కాంగ్రెస్ తరుపున పోరాడుతాడు అన్నమాట! ఎంతైనా వినేష్ ఫోగట్ తో పాటు రోడ్డు మీద కూర్చుని మీడియా దృష్టిని ఆకర్షించి, దేశ వ్యాప్తంగా అందరికి తెలిసిపోయాడు కాబట్టి రైతు ఉద్యమంలో కాంగ్రెస్ తరుపున అందరికీ తెలిసిన వాడుగా ఒక గుర్తింపు వస్తుంది!
కాంగ్రెస్ ప్లాన్డ్ గానే ఉంది ఇక్కడి వరకూ. కానీ ఒక విషయంలో మాత్రం తప్పటడుగు వేసింది అదేమిటంటే…
********
వినేష్ ఫోగట్ ఇండియన్ రైల్వే లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ( OSD ) గా పనిచేస్తున్నది. అదీ ఉత్తర రైల్వే డివిజన్ ( NR ) లోని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో. భజరంగ్ పూనియా కూడా OSD గా అదే ఉత్తర రైల్వే డివిజన్ లో పనిచేస్తున్నాడు!
వినేష్, భజరంగ్ లు ఇద్దరూ రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్నందుకు రైల్వే శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది సెప్టెంబర్ 4 న. సెప్టెంబర్ 6 న వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇద్దరూ తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు!
భారత రైల్వే శాఖ నియమ నిబంధనలు!
ఎవరన్నా రైల్వే శాఖ ఉద్యోగి రాజీనామా చేయాలి అంటే సదరు ఉద్యోగి మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాలి. ఈ మూడు నెలల కాలంలో ఉద్యోగి మనసు మార్చుకొని రాజీనామా ఉపసంహారించుకొని ఉద్యోగం కొనసాగించవచ్చు.
వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా మూడు నెలల ముందు నోటీసు ఇవ్వలేదు కాబట్టి టెక్నీకల్ గా వాళ్ళ రాజీనామాలని రైల్వే శాఖ వెంటనే ఆమోదించదు. 90 రోజుల తరువాత మాత్రమే రాజీనామాలు అమలులోకి వస్తాయి.
*****
ఎన్నికల కమిషన్ నియమావళి!
ఎన్నికలలలో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఆయా ప్రభుత్వ శాఖల నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ( NOC ) ని నామినేషన్ పత్రాలతో ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే తిరస్కరిస్తారు!
రైల్వే శాఖ NOC ఇవ్వదు!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5 న జరగనున్నాయి!
సెప్టెంబర్ 4 న రాజీనామా చేశారు వినేష్, భజరంగ్ లు!
రైల్వే శాఖ NOC ఇవ్వాలి అంటే మూడు నెలల తరువాత అంటే డిసెంబర్ 3 తరువాత మాత్రమే ఇస్తుంది!
So! వినేష్ ఫోగట్ నామినేషన్ తిరస్కరించబడుతుంది! ఇదీ అందరూ ఎక్సపెక్ట్ చేసింది… కానీ…
*******
బీజేపీ అధిష్టానం ఆశ్చర్యకర చర్య!
ఈ నెల 12 న నామినేషన్ దాఖలు చేయబోతున్న వినేష్ ఫోగట్ కి ఉత్తర రైల్వే అధికారులు NOC ఇవ్వాలని నిర్ణయించారు!
అఫ్కోర్స్! బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది!
NOC ఇవ్వాలనే నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అనవసరంగా రాజకీయ రచ్చ ఎందుకని బీజేపీ భయపడ్డది అనే అప్రదిష్ట మూట కట్టుకోవడం తప్పితే వేరే ప్రయోజనం ఏముంటుంది?
ఇప్పటికే హర్యానాలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా లేదని సర్వే లు చెపుతున్నాయి.
గత పదేళ్లుగా హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజలలో అసంతృప్తి ఉండడం సహజం!
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో ప్రతీ ఒక్క సీటు కీలకమే! ఇటువంటి తరుణంలో ఒక్క సీటుని కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు! కానీ బీజేపీ అతి జాగ్రత్తలకి పోతున్నదేమో అనిపిస్తున్నది.
1. రేజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ని మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరగానే బ్రిజ్ భూషణ్ వెంటనే ఓ ప్రకటన చేస్తూ ‘నేను మొదటినుండి చెప్తూనే ఉన్నాను, కాంగ్రెస్ వెనుక ఉండి నా మీద ఆరోపణలు చేయిస్తున్నది, ఇప్పుడు చూడండి, ఇద్దరూ కాంగ్రెస్ లో చేరారు’ అన్నాడు… దీని మీద బీజేపీ అధిష్టానం బ్రిజ్ భూషణ్ ని మాట్లాడవద్దని ఆదేశించింది!
నాకు తెలంగాణా విషయంలో బండి సంజయ్ కుమార్ ఉదంతం గుర్తుకు వచ్చింది.
2. బబిత ఫోగట్, యోగేశ్వర్ దత్ ఇద్దరూ రెజ్లర్స్. మొదటి నుండి వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియాలకి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. రెండు నెలల క్రితం వరకూ బబిత ఫోగట్, యోగేశ్వర్ దత్ లకి బీజేపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఇద్దరూ కూడా బీజేపీ టికెట్ మీద పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో పోయిన శుక్రవారం రోజున బీజేపీ విడుదల చేసిన తొలి జాబితా లో ఇద్దరి పేర్లు లేవు. గేమ్ ఓవర్!
********
ఇక వినేష్ ఫోగట్ కి కోచ్ మరియు మామ మహావీర్ ఫోగట్ ఒక ప్రకటన చేశాడు….. నేను వినేష్ కి చాలా నచ్చ చెప్పాను, రాజకీయ రంగ ప్రవేశం చేసే వయసు కాదు నీది, వచ్చే ఒలంపిక్స్ కోసం ఇప్పటి నుండే సాధన చేయమని, కానీ నా మాట వినలేదు. ఒక వేళ రాజకీయాలలో చేరదలచుకుంటే కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ ని ఎంచుకోవాల్సింది కానీ కాంగ్రెస్ లో చేరి తప్పు చేసింది. హర్యానా ప్రజలు వినేష్ ఫోగట్ ని నమ్మే స్థితి ఉంటుంది అని నేను భావించట్లేదు!
So! మహావీర్ ఫోగట్ ప్రకటన కాస్తంత ఊరట బీజేపీకి.
********
జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ తప్పటడుగులు వేసింది.
గత అయిదేళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న వారికి టికెట్స్ ఇస్తామని వాగ్దానం చేసిన అధిష్టానం చివరికి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్లకి టికెట్స్ ఇవ్వాలని నిర్ణయించి జాబితా విడుదల చేసింది.
దాంతో అప్పటి వరకూ బీజేపీ కోసం కష్ట పడ్డవాళ్లు తిరుగుబాటు చేశారు. వీళ్ళలో ముగ్గురు ముస్లిం అభ్యర్థులు కూడా ఉన్నారు.
తిరుగుబాటుని చూసి మొదటి జాబితాని రద్దు చేసి మరుసటి రోజు మరో జాబితా విడుదల చేశారు.
అయినా అసమ్మతి ఆగలేదు.
జమ్మూ కాశ్మిర్ ఎలెక్షన్ ఇంచార్జ్ గా రామ్ మాధవ్ ను ఇటీవలే నియమించారు కానీ ఈ పని మూడు నెలల ముందే చేసి ఉంటే బాగుండేది!
రామ్ మాధవ్ నచ్చ చెప్పినా అసమ్మతి ఆగకపోవడంతో చాలా మంది సీనియర్ జిల్లా నేతలని జేపీ నడ్డా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకిలా జరుగుతున్నది?
రాహుల్, ఫరూక్ అబ్దుల్లాలు కలిసి జమ్మూ కాశ్మీర్ లో బీజేపీని ఒడిస్తాం అని ఛాలెంజ్ చేసిన తరుణంలో బీజేపీలో అంతర్గత కుమ్ములాట ఆ పార్టీకే మంచిది కాదు. RSS, బీజేపీ మధ్య సమన్వయం లేకపోవడం వలన ఇప్పటి వరకూ జాతీయ అధ్యక్షుడి ఎంపికే జరగలేదు! (పొట్లూరి పార్థసారథి)
Share this Article