కొన్ని పత్రికల్లో, కొన్ని సైట్లలో, కొన్ని ట్యూబ్ చానెళ్లలో, కొన్ని టీవీల్లో కనిపించింది వార్త… ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది, అందుకని స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించబోతున్నారు అని ఆ వార్త సారాంశం…
వోకే, ఇన్నేళ్లుగా అసలు పార్టీ నిర్మాణం, స్వరూప స్వభావాలు ఏమీ లేకుండా పార్టీని కొనసాగించడం ఎంత విశేషమో… అన్నిచోట్లా అభ్యర్థులున్నారా అసలు అనే ప్రశ్నల నుంచి 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించడం ఖచ్చితంగా ఓ రికార్డు… సరే, దానికి అనుకూలించిన అంశాలేమిటి అనేది వేరే డిబేట్…
తనకు బ్లాక్ క్యాట్ కమాండోలతో పటిష్టమైన భద్రత కల్పించడం అనేదీ ఆహ్వానిద్దాం… కానీ పవన్ కల్యాణ్‌కు మావోయిస్టులో ముప్పు అనేదే ఒకింత చర్చనీయాంశం… ఎందుకంటే..? తను మెయిన్‌గా సినిమా యాక్టర్… ఎప్పుడూ ఎక్కడా సైద్ధాంతికంగా తనతో మావోయిస్టులకు వైరం లేదు… మొదట్లో బీజేపీతోనే ఉన్నా, తరువాత రకరకాల రూట్లు మార్చి, ఎవరెవరితోనో కలిసి తిరిగి ఆ బీజేపీ శిబిరంలోనే ఉన్నాడు ఇప్పుడు…
Ads
పవన్ కల్యాణ్‌గా తను మావోయిస్టులకు టార్గెట్ కాడు… కాకపోతే బీజేపీ కూటమికి ఏపీ రాష్ట్రం దక్కడంలో పవన్ కల్యాణ్ కూడా ముఖ్యుడే, ఆల్రెడీ చంద్రబాబు ఏనాటి నుంచో మావోయిస్టులకు టార్గెటే, కాబట్టి పవన్ కల్యాణ్‌ను కూడా కాషాయ ప్రతినిధిగా భావించి టార్గెట్ చేస్తే తప్ప తను పవన్ కల్యాణ్‌గా టార్గెట్ కాడు… ఐనా ఏపీకి సంబంధించి టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది తప్ప, బీజేపీ కూటమిలో టీడీపీ లేదు… కేంద్రంలోనూ ఎన్డీయేలో ఉన్నారు తప్ప చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ బీజేపీ సభ్యులు కారు…
నో, నో, రాజ్యం ప్రతినిధులు కాబట్టి, టైమ్ దొరికితే సంచలనం కోసం, ఉనికిని బలంగా చాటడం కోసం, తీవ్ర స్థాయిలో తమపైకి వస్తున్న శత్రువును వెనక్కి నెట్టడం కోసం పవన్ కల్యాణ్‌కు ముప్పు తలబెడతారు అనుకుందాం కాసేపు… నిజానికి ప్రస్తుతం మావోయిస్టులు అలా అఫెన్స్‌లో దూకుడు ప్రదర్శించే సిట్యుయేషన్‌లో లేరు… అబూజ్‌మఢ్ వంటి బలమైన స్థావరాలనే కోల్పోతూ, వందలాది మందిని పోగొట్టుకుంటోంది ఇప్పుడు…
ఆత్మరక్షణలో భాగంగా కూంబింగ్‌కు వచ్చే ప్రత్యేక బలగాలపై దాడులు చేయడం మినహా… చాన్నాళ్లుగా పొలిటికల్ టార్గెట్ల వెంటబడటం లేదు మావోయిస్టులు… డిఫెన్స్ మాత్రమే మావోయిస్టుల ప్రస్తుత ప్రయాస… మన్యం ప్రాంతంలో ఏమైనా షెల్టర్ దొరకొచ్చు గానీ ఏపీలో పెద్దగా వాళ్లకు స్పేస్ దొరికే పరిస్థితులూ లేవు… వస్తే గిస్తే తెలంగాణ వైపు జొరబడి కాస్త ప్రొటెక్షన్ జోన్ వెతుక్కోవచ్చు… కానీ కేంద్ర ప్రభుత్వం పలురకాల ప్రత్యేక బలగాలతో ఒకరకంగా యుద్ధమే ప్రకటించింది మావోయిస్టులపై…
అనారోగ్యాలు, సుస్థిర- సుదృఢ స్థావరాలు రానురాను కరువవుతున్నాయి… ఈ స్థితిలో అది అఫెన్స్ ధోరణిలో కదిలే సిట్యుయేషన్ లేదు… ఇక వార్త విషయానికి వస్తే అది స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు కాదు, నేషనల్ సెక్యూరిటీ గార్డులా..? ఎన్ఎస్‌జీ…? గతంలో అసాధారణ పరిస్థితుల్లో బ్లాక్ క్యాట్ కమాండోలను మొహరించేవారు… తరువాత మరీ సీరియస్ థ్రెట్ ఉన్న ప్రముఖుల భద్రతకూ వినియోగిస్తున్నారు… కానీ 18 మంది కమాండోల రక్షణ కల్పించేంత సీరియస్ థ్రెట్ ఉందానేది ప్రశ్న… ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాత్రమే అయిన పవన్ కల్యాణ్ భద్రతకు వినియోగిస్తారా అనేది మరో ప్రశ్న…
గతంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు మాజీ ప్రధానులు, ప్రధానులు, వారి కుటుంబాలకు, ముఖ్యులకు రక్షణ కల్పించేది… ఇప్పుడు దాన్ని ప్రధాని భద్రతకు మాత్రమే పరిమితం చేశారు… రకరకాల విభాగాల్లో కూడా కమాండోలున్నారు… మరి పవన్ కల్యాణ్‌కు భద్రత కోసం వచ్చే ఆ 18 మంది ఏ విభాగపు కమాండోలో తెలియదు… జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్నవాళ్లకైనా బ్లాక్ క్యాట్ కమాండోల రక్షణ ఉంటుందా..? తెలియదు… ఆ కేటగిరీల్లో పవన్ కల్యాణ్ లేడు, ఏమో, ఇంకేమైనా స్పెషల్ కేటగిరీ ప్రొటెక్షన్ విభాగం ఏర్పాటు చేశారేమో తెలుగు మీడియానే చెప్పాలి..!!
Share this Article