.
బ్లాస్టింగ్ ద్వారా ఎవరో కుట్ర చేసి మేడిగడ్డను కూల్చారని కాదా బీఆర్ఎస్ క్యాంపు ఆరోపణ… అసలు అది కాదు నిజం… అసలు సిసలు బ్లాస్టింగ్ అంశాలను, బీఆర్ఎస్ ముఖ్యుల నిర్వాకాలు, అక్రమాలను బ్లాస్ట్ చేసే అంశాలను ఘోష్ కమిషన్ తన రిపోర్టులో పొందుపరిచినట్టు సమాచారం…
ఈ అంశాలన్నీ జనంలోకి బలంగా వెళ్తే… కేసీయార్ నిజస్వరూపం ఏమిటో తేటతెల్లమై, కాళేశ్వరం పేరిట తెలంగాణ ఎలా దోపిడీకి గురైందో తెలిసి యావత్ తెలంగాణ షాక్‌తో మాన్పడిపోయే నిజాలు ఉన్నాయట రిపోర్టులో… ఆర్థిక, సాంకేతిక, రాజకీయ, పరిపాలనపరమైన విధాన నిర్ణయాలు, అవకతవకలతో కలిపి మరీ…
Ads
ఇంతకుముందు బయటికి వచ్చింది జస్ట్, జిస్ట్ (సంక్షిప్త సారాంశం) మాత్రమే… అసెంబ్లీలో ఈరోజు నివేదిక పెట్టడంతోపాటు చర్చ కూడా జరగనుంది… అంతటి సీరియస్ అంశాలున్నాయి కాబట్టే కేసీయార్ క్యాంపు అది బయటికి రాకుండా కిందామీదా పడుతోంది…
ముందు కమిషన్ ఏర్పాటే చెల్లుబాటు కాదన్నారు… తరువాత అసెంబ్లీలో పెట్టొద్దన్నారు… పెడితే మామీద చర్యలు ఉండొద్దని అంటున్నారు… కోర్టుల్లో విఫలప్రయత్నాలు… అంటేనే అర్థమవుతోంది కదా, కమిషన్ రిపోర్టు అంశాలు బ్లాస్టింగ్ నేచర్ అని… చర్చను పక్కదోవ పట్టించడానికి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తానని హరీష్ కోరిక…
నిన్న సాయంత్రం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి రిపోర్టు అంశాలు వివరించి, బీఆర్ఎస్‌ను ఎలా కార్నర్ చేయాలో, ఎలా కౌంటర్ ఇవ్వాలో సూచనలు చేసినట్టు కూడా సమాచారం… సో, అత్యంత కీలకమైన చర్చ… అవునూ, ఇంతకీ ఏముంది అందులో…?
ఎలాగూ ఈరోజు సాయంత్రానికి అసలు బ్లాస్టింగ్ పాయింట్లన్నీ తెలంగాణ జనం ఎలాగూ వింటుంది… ప్రస్తుతానికి తెలియవస్తున్న సమాచారం మేరకు చెప్పుకోవాలంటే…
ఇప్పటివరకూ ఏదో నాలుగు తట్టల సిమెంటు చాలు, మేడిగడ్డ పగుళ్లు రిపేర్ చేయొచ్చు అని వితండవాదం చేస్తోంది కదా బీఆర్ఎస్..? కాదు, తస్కిన ఆ రెండు పిల్లర్లు కాదు… అసలు ఆ బరాజు మొత్తం మళ్లీ కట్టాల్సిందేనట… అంతేకాదు, అన్నారం, సుందిళ్ల బరాజులు కూడా ఏమాత్రం సురక్షితంగా లేవు అట…
పిల్లర్ల కిందకు మట్టి వచ్చి చేరి, మొత్తం డొల్ల అయిపోయింది బరాజుల నాణ్యత… శాటిలైట్ ఇమేజెస్ కూడా రిపోర్టులో పొందుపరిచారట… బుంగలు బయటపడకుండా మట్టితో నింపడం, సామర్థ్యాన్ని మించి నీళ్లు నిల్వ చేయడం వంటి సాంకేతిక కారణాలతోపాటు… తెలంగాణపై దీని భారాన్ని కూడా చెప్పారట… ఇప్పటివరకు 16 వేల కోట్ల మిత్తీలు కట్టారు… ప్రాజెక్టు పూర్తిగాకుండానే మొత్తం చెల్లింపులు…
ఎన్నికలకు ముందే ఈ ప్రపంచవింత ప్రదర్శించాలనే తొందరపాటుతో నిబంధనలన్నీ కాలరాశారు… తుమ్మడిహెట్టికి గనుక ఫిక్సయిపోయి ఉంటే… 30 వేల కోట్లతోనే కొంత గ్రావిటీ, కొంత లిఫ్టు ఉండేది, సరిపోయేది… ఇప్పుడు లక్ష కోట్ల ప్రాజెక్టు ఎటూ గాకుండా పోయింది… అంటే, మూడు రెట్ల అధిక ఖర్చు ప్లస్ నిరర్థకం… ఎవరు అసలు బాధ్యులు..?
ఒకవేళ ఈ బరాజులు వృథా, మళ్లీ కడితే ప్రయోజనం ఎంత అనే డీప్ చర్చలోకి గనుక ప్రభుత్వం వెళ్తే… రాజకీయ విధాన నిర్ణయాలు భిన్నంగా తీసుకుంటే… ఇక బీఆర్ఎస్ క్యాంపు ఆకాశమెత్తు ఊదరగొట్టిన ఈ సోకాల్డ్ త్రీగార్జెస్ పరిస్థితి కాలువలు, రిజర్వాయర్లే అన్నట్టుగా మిగిలిపోనుందన్నమాట…
ఎంత దారుణం..? కేసీయార్ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నమాట… పదేళ్ల అరాచకానికి అచ్చమైన ప్రతీకలుగా ఆ మూడు బరాజులు నిలబడబోతున్నాయన్నమాట…
ఏదో ప్యాకేజీ అంచనాల్ని 6 నెలల్లోనే రెండింతలు పెంచారని కూడా రిపోర్టులో పేర్కొన్నట్టు టాక్… కొన్నిచోట్ల అసలు సాయిల్ టెస్టు కూడా చేయకుండా నయా విశ్వేశ్వరయ్య కేసీయార్ ఎలా చెబితే అలా కట్టేశారట… అందుకే ఈ దురవస్థ… అంతులేని ప్రజాధన నిరర్థక దుర్వినియోగం… ఏమేం నిజాలు బయటపడతాయో వేచి చూద్దాం…
చట్టబద్ధంగా ఓ కమిషన్ వేశాక, అనేక అక్రమాలు బయటపడుతుంటే… బాధ్యత కలిగిన ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంటుగా ఉంటుంది..? సో, రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ ప్రకటించబోతున్నాడో కూడా వేచి చూద్దాం…
Share this Article