నిన్న పునీత్ రాజకుమార్ ఫుడ్ వ్లాగర్ కృపాల్‌తో కలిసి భోంచేసిన వీడియో చూశాం కదా… మరో వీడియో చెప్పాల్సిందిగా పాఠకుల కోరిక… అన్నీ మనం ఎందుకు ప్రమోట్ చేస్తాంలే గానీ… ఈ వీడియో మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది…
నాలుగేళ్ల క్రితం వీడియో, 10 లక్షల వ్యూస్ ఉన్నయ్… అసలు కృపాల్ పాపులారిటీకి ఈ వ్యూస్ సంఖ్య తక్కువే… కాకపోతే ఓల్డ్ వీడియో కదా, అప్పట్లో ఇదే పెద్ద సంఖ్య… ఫుడ్ వీడియోలు చేసే వ్లాగర్లకు కృపాల్ వీడియోలు మంచి లెసన్స్… ఫుడ్ లవర్స్ ఈ వీడియోను ఓసారి చూడాలి… దిగువన వీడియో లింక్ ఇచ్చాను…
Ads
మావల్లి టిఫిన్ రూమ్స్ అలియాస్ ఎమ్‌టీఆర్… వందేళ్ల చరిత్ర ఉందట దానికి… తాము పాటించే పరిశుభ్రత ఏమిటో కస్టమర్లు చూడటానికి వీలుగా, ఎవరొచ్చినా సరే వంట సెక్షన్ మొత్తం పారదర్శకంగా చూడొచ్చు… ఆ హోటల్‌లో భోజనం ఈ వీడియో కంటెంట్… సాధారణంగా మన మెస్సుల్లో, రెస్టారెంట్లలో భోజనం అంటే..? మీల్స్ అంటే అన్నం, రెండు కూరలు, ఓ పప్పు, ఓ చట్నీ లేదా ఆవకాయ, ఓ సాంబారు, వీలైతే రసం, పెరుగు, అప్పడం… పెద్ద బఫే రెస్టారెంట్లలో అదనంగా స్వీట్, ఐస్‌క్రీమ్, సలాడ్, బగార్ అన్నాం లేదా బిర్యానీ, టమాట రైస్ గట్రా ఉంటాయి… కానీ రేటు అదిరిపోతుంది… ఇవన్నీ వద్దు అనుకుంటే, మెనూ కార్డులో ఉన్నవాటిలో మనకు నచ్చినవి అలకార్టె ఆర్డర్ ఇచ్చుకోవచ్చు… జుమ్లా బిల్లు వాచిపోతుంది… బై అండ్ లార్జ్ ఇంతే…
ఈ వీడియోలో భోజనం కాస్త డిఫరెంట్ కాంబినేషన్… అదీ మనం చెప్పుకునే విశేషం… హోటల్ ఓనర్ దగ్గరుంచి ఆ విశేషాలు కాజువల్‌గా చెప్పింది… అదేదో ప్రమోషన్ వీడియో అన్నట్టు గాకుండా…! ఇది కాస్త ఓల్డ్ వీడియో కదా… అప్పటి రేటు 270… ముందుగా గ్రేప్ జ్యూస్ ఇస్తారు… కోసంబరి, అంటే కాస్త క్రంచీ సలాడ్… భలేయాక్ పల్యా అని అరటి స్నాక్స్… ఒకటి లేదా రెండు పూరీలు, దానికి వేరే కూర… కడ్లె బెలె పాయసం… అంటే సగ్గుబియ్యం, శెనిగెపప్పుతో చేసిన పాయసం… మినీ మసాలా దోశ… మామూలు దోశల్లాగా గాకుండా కాస్త చిన్నగా, మెత్తగా, మందంగా వేస్తారు… నెయ్యి సరేసరి…
అంచుకు (నంజుకు) పెట్టుకోవడానికి రవ్వ వడ పెడతారు… కర్నాటక స్పెషల్ బిసిబెల్లెబాత్ తరువాత డిష్… దీని గురించి స్పెషల్‌గా చెప్పే పనిలేదు కదా… తరువాత కారా పొంగల్… అల్లం ముక్కలతోపాటు మిరియాల ముక్కలు, పొడి గాకుండా, మిరియాలే వేస్తారు, దీనికి చట్నీ గాకుండా చింతపండు పులుసును ఆధరువుగా ఇస్తారు… తెల్ల అన్నం, అందులోకి సీజన్ కూరగాయలతో కూర… ఎక్కువగా బెండ, నెయ్యి… నెక్స్ట్ రసం… తరువాత కర్డ్ రైస్… చిక్కగా, మెత్తగా, పోపు పెట్టి సర్వ్ చేస్తారు… ఇదయ్యాక ఐస్‌క్రీమ్, ఫ్రూట్ మిక్స్చర్… చివరలో గులాజ్ జామూన్, ఒక స్వీట్ పాన్…
ఒక్కసారి పరిశీలిస్తే అన్నం తక్కువ… టిఫిన్లు ఎక్కువ… రెండింటి బ్లెండ్… స్వీట్, హాట్, డ్రింక్… అన్నీ హెల్తీ డిషెసే… ఎక్కడా మసాలా బాపతు డిషెస్ లేవు… అదీ నచ్చింది… వాళ్లు పెట్టిన ఫార్ములాలో తింటే మరుసటి పూట ఇక తినాల్సిన పనిలేదు… హైదరాబాదులో ఈ ఫార్ములాలో అన్‌లిమిటెడ్ మీల్స్ పెడితే ఎంత తీసుకుంటారు..? ఒకవేళ పెడితేనే సుమా…!!
Share this Article