Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రావణ్‌పై రాజద్రోహం సెక్షన్? ప్రకాశ్‌రాజ్‌నూ బుక్ చేస్తారా?

July 5, 2026 by M S R

.

ప్రకాష్ రాజ్ అలా చేయకపోతేనే ఆశ్చర్యం… తను పక్కా సనాతన వ్యతిరేకి… ధర్మస్థల కుట్ర వెనుక తనే… ఇప్పుడు యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వెనుక తనే… బొద్దింకల వెనుక తనే… ఎప్పుడూ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలతో, కుట్రలతో ‘యాంటీ నేషనల్’గా ఎక్స్‌పోజ్ అవుతూనే ఉన్నాడు… ఐతే ఇప్పుడు ఓకీలక ప్రశ్న… పవన్ కల్యాణ్ రావణ్‌ను అరెస్టులతో వేటాడుతున్నట్టుగా ప్రకాష్ రాజ్‌ను కూడా వెంటాడగలడా..? చంద్రబాబు ఆ స్వేచ్ఛను ఇవ్వగలడా..?

ఎందుకంటే..? సాక్షాత్తూ జనసేనకు చెందిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఆరోపిస్తున్నాడు… ‘‘రావణ్, ప్రకాష్ రాజ్ కలిసే కుట్రలు చేశారు.., వారి వెనుక కుట్రదారులు ఉన్నారు… రాష్ట్రంలో భారీగా కుల, మత ఘర్షణలు రేపాలనేదే కుట్ర… ఆ మంటల్లో చలికాచుకోవడానికి తాడేపల్లి ప్యాలెస్ రెడీగా ఉంది… ఆ సూత్రధారుల ఆలోచనల్ని, ప్రయత్నాల్ని బయటపెడతాం’’ అంటూ ఓ ఆడియో కూడా బయటపెట్టాడు…

Ads

తను పరోక్షంగానో, ప్రత్యక్షంగానో వైసీపీ కావాలని చేయిస్తున్నదని అంటున్నాడు… వరుసగా జోసెఫ్‌ను వేర్వేరు చోట్ల పెట్టబడిన కేసుల్లో అరెస్టులు చేస్తూనే ఉన్నారు, బెయిల్ వస్తూనే ఉంది… ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు… కానీ నా జోలికి వస్తే నేను వెంటాడే తీరు ఇలాగే ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పదలిచాడు… దీనికి చంద్రబాబు అనుమతి ఉందో లేదో తెలియదు… కానీ..?

మామూలు సెక్షన్లు పెడితే వెంటనే బెయిల్ వస్తుందనే భావనతో పోలీసులు ఇక భీఎన్ఎస్ 152 సెక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియా న్యూస్ గ్రూపుల్లో వార్త కనిపిస్తోంది… అది సీరియస్ సెక్షన్… భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలోకి నెట్టే చర్యలపై పెట్టే సెక్షన్… అంత సులభంగా బెయిల్ దొరకదు… నిరూపణ అయితే శిక్ష కూడా సీరియస్‌గానే ఉంటుంది… గతంలో ఐపీసీలో ఉన్న 124ఏ స్థానంలో బీఎన్ఎస్‌లో ఈ సెక్షన్ వచ్చింది… రాజద్రోహం! బీఎన్ఎస్‌లో ఆ పదం వాడకపోయినా స్థూలంగా ఈ సెక్షన్ అదే…

 

వారెంట్ లేకపోయినా అరెస్టు చేయవచ్చు, నేరం నిరూపణ అయితే జీవిత ఖైదు లేదా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ఇప్పటికే పోలీసులు జోసెఫ్ రావణ్ మీద గన్నవరం పోలీసులు UAPA 13, 39 సెక్షన్లను నమోదు చేసినట్టు వార్తలొస్తున్నాయి… BNS 152 సంగతి తేలాల్సి ఉంది… ఉపా సెక్షన్లు కూడా సీరియసే… ఆంధ్రజ్యోతి వార్త ఇలా ఉంది…



రావణ్‌పై U/s 147, 148, 152, 192, 197(1)(d), 353(1)(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటు అత్యంత కీలకమైన, దేశ రక్షణకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) లోని సెక్షన్ 13, సెక్షన్ 39లను కూడా ఇందులో చేర్చి, దర్యాప్తు ప్రారంభించారు.



BNS 152 నేరం స్వభావం: ఎవరైనా కావాలని లేదా తెలిసి, మాటల ద్వారా (నోటితో లేదా రాతపూర్వకంగా), సంజ్ఞల ద్వారా, ఎలక్ట్రానిక్ సమాచార సాధనాల ద్వారా, లేదా ఆర్థిక సహాయం చేయడం వంటి పద్ధతుల ద్వారా దేశ విభజనను ప్రోత్సహించడం, సాయుధ తిరుగుబాటుకు ప్రేరేపించడం, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడటం లేదా వేర్పాటువాద భావాలను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తే అది ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది.



ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? పవన్ కల్యాణ్, జోసెఫ్ కలిసే చేశారని కదా ఏపీ మంత్రి ఆరోపణ… వీళ్ల వెనుక అసలు సూత్రధారులు, కుట్రదారులు ఉన్నారని కదా చెబుతున్నది… మరి జోసెఫ్ మీద ఈ సెక్షన్లు పెడితే ప్రకాష్ రాజ్‌కు కూడా వర్తింపజేస్తారా..? పవన్ కల్యాణ్ చేయగలడా..?

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ ఏమిటంటే..? ‘‘సూమోటోగా తీసుకుని ప్రభుత్వమే ప్రకాష్ రాజ్‌ను బుక్ చేయాలి, రాను రాను తను జాతికి, దేశానికి ప్రమాదకారిగా మారుతున్నాడు..’’ బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామే… ఇటు బీజేపీ, అటు జనసేన కారాలు మిరియాలు నూరుతున్నాయి, ఎటొచ్చీ ఎవరికీ అర్థం కాని మౌనాన్ని పాటిస్తున్నది టీడీపీ..!!

(నిజంగా ప్రకాష్ రాజ్‌కు అంత సీన్ ఉందా అనడిగాడు ఓ మిత్రుడు… ఎందుకు లేదు? కేసీయార్ అంతరంగిక టీమ్‌లో ఒకడిగా ఉద్ధవ్ ఠాక్రే వద్దకు, జేడీఎస్ కుమారస్వామి వద్దకు వెళ్లలేదా..? అసలు తనకు ఇంత ప్రయారిటీ ఏమిటి..? నిజంగా తాడేపల్లి ప్యాలెస్ తనను వాడుకుంటోందా..? ఈ వాదన విని ఓ మిత్రుడు ఏమన్నాడు అంటే..? ‘‘టాలీవుడ్ నుంచి ప్రకాష్ రాజ్‌ను బహిష్కరింపజేయగలడా’’…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రావణ్‌పై రాజద్రోహం సెక్షన్? ప్రకాశ్‌రాజ్‌నూ బుక్ చేస్తారా?
  • ఆ రోడ్డు పక్కన… ఆ కారును కేసీఆర్ ఎందుకు ఆపినట్టు ఆ అర్థరాత్రి వేళ!?
  • ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ఆపదలో పడితే మళ్లీ వస్తా :: చిరంజీవి
  • అశ్విని! వెండితెర వెలుగు తార- విధి నాటకంలో రాలిపోయింది!!
  • తవ్వేకొద్దీ వందల కోట్ల అవినీతి అనకొండలు! ఈ పాపం ఎవరిది ‘బాపూ’?!
  • నిరుద్యోగులు పొలిటికల్ పార్టీల ట్రాపుల్లో చిక్కితే- వాళ్లకే నష్టం!!
  • దేశమంతా కదిలింది – బంగారం పోగేసింది – జాతి రుణవిముక్తి !!
  • ఈమె గుర్తుందా? అందరూ బాగున్నారు- కానీ ఈమె ఏమైపోయింది?
  • నమ్మలేని ‘న్యాయం’ – ఎంత మంచివాడవురా, ఎన్నినోళ్ల పొగుడుదురా…
  • ఏ దేశమైనా విపత్తులో పడిపోతే… ముందుగా అక్కడ వాలేది ఇండియా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions