Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!

May 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi……… కృష్ణంరాజు- రాఘవేంద్రరావు- పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్లో 1984 మే 25 న విడుదలయింది ఈ సూపర్ డూపర్ హిట్ బొబ్బిలి బ్రహ్మన్న . 41 సంవత్సరాలు అయింది .

కృష్ణంరాజు కెరీర్లో ఓ మైలురాయి . అమరదీపం , భక్త కన్నప్ప వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ బొబ్బిలి బ్రహ్మన్న , తాండ్ర పాపారాయుడు సినిమాలు ఆయన అభిమానులనే కాకుండా అందరు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలు .

Ads

అన్నాతమ్ముళ్ళుగా కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను వైవిధ్యతతో గొప్పగా పోషించారు . అన్న పాత్ర ధర్మం కోసం , సాంప్రదాయం కోసం పాకులాడే పాత్రయితే , తమ్ముడు పాత్ర జనక్షేమం కొరకు , తాను నమ్మిన న్యాయం , నిజం కొరకు అన్నను సైతం ఎదిరించే ఎర్ర వాసన ఉన్న పాత్ర . పరుచూరి బ్రదర్స్ రచయితలయితే ఆ మాత్రం ఎర్ర వాసన లేకుండా ఎలా !

స్టార్ హీరోల కొరకు వ్రాస్తారు . ఆఫ్ బీట్ సందేశాత్మక సినిమాల కొరకు వ్రాస్తారు . ఎవరికి వ్రాసినా కధ పకడ్బందీగానే నేస్తారు ఆ బ్రదర్స్ . కృష్ణంరాజు స్వంత బేనరుకు , ఆయన ఇమేజికి తగ్గట్లుగానే కధను నేసారు పరుచూరి బ్రదర్స్ .

టైటిల్సులోనే బ్రిటిష్ కాలం లోని సినిమా అని చెప్పినప్పటికీ రన్నింగ్ అంతా సమకాలీన కాలంలాగే అనిపిస్తుంది . కధ తర్వాత డైలాగ్స్ . అన్ని పాత్రల డైలాగులు బ్రహ్మాండంగా వ్రాసారు . ఇద్దరు కృష్ణంరాజుల డైలాగ్స్ , క్లైమాక్సులో శారద డైలాగ్స్ చాలా పదునుగా ఉంటాయి .

ఇంక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . స్క్రీన్ ప్లే ఎంత బిర్రుగా ఉంటుందంటే ప్రేక్షకుడు సీటుకు అతుక్కొనిపోతాడు . అప్పుడే సినిమా అయిపోయిందా అనేలా ఉంటుంది స్క్రీన్ ప్లే . సూపర్ ఫాస్ట్ రైల్ లాగా పరుగెత్తుతుంది . డ్యూయెట్లన్నీ చాలా అందంగా చిత్రీకరించారు . కృష్ణంరాజు చేత ఘట్టిగానే స్టెప్పులు వేయించారు .

ధర్మపీఠం తీర్పులు వగైరా కాస్త ఫ్యూడలిస్టు వాసనలు కనిపించినా బ్రిటిష్ టైం అని చెప్పారు కాబట్టి ఒగ్గేయొచ్చు . ఆ ఫ్యూడలిజంలో కూడా బెనెవలెన్స్ (benevolence) ఉంది కాబట్టి ఓకే . Benevolent feudalist cum autocratic model .

ఊళ్ళోకి పోలీసులు వచ్చే వీలు లేదు . బొబ్బిలి బ్రహ్మన్న వారసుల్లో నాలుగో తరం బ్రహ్మన్న ధర్మబద్ధంగా తీర్పులు ఇస్తూ ఉంటారు . ఎంతగా అంటే స్వంత కూతురి విషయంలో కూడా కఠినమైన తీర్పుని ఇస్తాడు . ఈ ప్లాటుని సుకన్యోపాఖ్యానం నుండి తీసుకున్నారు పరుచూరి బ్రదర్స్ .

ఈ సినిమా విజయానికి మరో ప్రధాన కారణం వేటూరి వారి పాటలు , చక్రవర్తి సంగీతం , రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ . క్లైమాక్సులో కృష్ణంరాజు మీద ఓ రాతి మనిషీ అనే పాట చాలా విభిన్నంగా చదరంగం డిజైన్ ఉన్న ఫ్లోరింగ్ మీద గొప్పగా చిత్రీకరించారు దర్శకుడు . Great creativity behind it’s picturization .

మరొకటి బ్రహ్మన్న వీర గాధ బుర్ర కధ . జయసుధ గొప్పగా నటించింది . కొద్దిగా గ్లామర్ పాత్ర అయినా జయసుధకు నటించే అవకాశం ఉన్న పాత్రే . సద్వినియోగం చేసుకుంది .

కృష్ణంరాజు , జయసుధల డ్యూయెట్లు చాలా రొమాంటిగ్గా చిత్రీకరించారు రాఘవేంద్రరావు . చలిగాలి వీచింది సనజాజి పూచింది కోలాటాలతో గోదావరి నేపధ్యంలో సాగే పాట అందంగా ఉంటుంది . అబ్బా నాతో ఉంటుంది మజా డ్యూయెట్లో కృష్ణంరాజు కుర్రాడయిపోతాడు . హుషారుగా ఉంటుంది . మరో డ్యూయెట్ తద్దినక తద్దినక . ఈ పాటలో కూడా ఇద్దరూ చాలా ఎనర్జిటిగ్గా స్టెప్పులు వేస్తారు .

కృష్ణంరాజు , జయసుధల తర్వాత ప్రధాన పాత్ర శారదది . పరుచూరి బ్రదర్స్ రచయితలయినా ఈ పాత్ర అంత ప్రాధాన్యత ఉన్నది కాదు . క్లైమాక్సు లోనే ఉన్న కాసేపు తన ప్రతిభను చూపుతుంది . అసూయతో సలసల కాగే విలనాసురుడిగా రావు గోపాలరావు , చెంచాలుగా నూతన్ ప్రసాద్ , అల్లు రామలింగయ్య , సారధి , పిచ్చి మాలోకం కొడుగ్గా సత్యనారాయణ బాగా నటించారు . బ్రహ్మన్న కూతురిగా ముచ్చెర్ల అరుణ , ఆమె ప్రేమికుడిగా రాజేష్ , ఇతర పాత్రల్లో చలపతిరావు , పి జె శర్మ , డా శివప్రసాద్ , అన్నపూర్ణ , సి హెచ్ కృష్ణమూర్తి , కృష్ణవేణి , ప్రభృతులు నటించారు .

ఈ సూపర్ హిట్ సినిమా ద్వారా రాఘవేంద్రరావుకు మొదటిసారి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది . కృష్ణంరాజుకి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు వచ్చింది . హిందీలో ధరం అధికారి అనే టైటిలుతో రీమేక్ చేసారు . దిలీప్ , జితేంద్ర , శ్రీదేవి నటించారు . అక్కడా హిట్టయింది . 1995 లో వచ్చిన పెదరాయుడు సినిమాలో ఈ బొబ్బిలి బ్రహ్మన్న వాసనలు కనిపిస్తాయి .

తూర్పు గోదావరి జిల్లా లోని కడియం వద్ద ఉన్న వేమగిరి మెట్ట , దోసకాయలపల్లి , చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . ఈ ప్రాంతమంతా రాజు గారిదేగా ! వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ విజయా శేషమహల్లో జరుపుకున్నారు . డబ్బులు ఆంధ్రా నుంచి . ఫంక్షన్ మద్రాసులో . అప్పట్లో అంతే .

An excellent action-filled , story-oriented , entertaining movie . ఇంతకుముందు చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పడేయండి . కృష్ణంరాజు , జయసుధ అభిమానులు మళ్ళా చూడండి . యూట్యూబులో ఉంది .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…
  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!
  • హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…
  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions