మీకు సరయు తెలుసు కదా… 7 ఆర్ట్స్ పేరిట బూతుల వీడియోలు చేస్తుంటుంది… ఓ రెస్టారెంట్ ప్రమోషన్ వీడియోతో ఈమధ్య ఏదో కేసులో కూడా ఇరుక్కుంది… మొన్నటి బిగ్‌బాస్‌లో ఆమెను ప్రవేశపెడితే ప్రేక్షకులు మొదటివారంలోనే ఫోఫోవమ్మా అనేశారు… ఇప్పుడామె బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షోలో ఒక కంటెస్టెంటు… ముమైత్ ఖాన్ తెలుసు కదా… బోల్డ్ ఐటమ్ బాంబ్… ఒక బిగ్‌బాస్ షోలో ఉన్నన్నాళ్లు బాగానే హడావుడి చేసింది… ఇప్పుడు మళ్లీ కంటెస్టెంటు… ఆమె నోట్లో నోరుపెడితే వాడి పని అయిపోయినట్టే… అలా దులిపేస్తుంది…
శ్రీరేపాక అనే పేరుగొట్టి చూడండి గూగుల్‌లో… ఆ బోల్డ్‌నెస్ చూసి హడలిపోతారు మీరే… దిగ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ వర్మ నగ్నం సినిమాలో ఈమె హీరోయిన్… ఏ రేంజ్ ఎక్స్‌పోజింగ్‌కైనా రెడీ… సరయుకు బామ్మ ఈమె… అర్థమైపోయింది కదా… ఇప్పుడీమె తాజా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంటు… తేజస్వి గుర్తుంది కదా… ఐస్‌క్రీం అనే మరో వర్మ గ్రేట్ సినిమాలో హీరోయిన్… ఒక బిగ్‌బాస్ సీజన్‌లో కంటెస్టెంట్… కాస్త ఎక్స్‌పోజింగులో పొట్టి పొట్టి దుస్తులతో చాలా ఫ్రీగా ఉండేది…
అరియానా గుర్తుంది కదా… ఏదో ట్యూబ్ చానెల్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు… వర్మ ఆమె మీద వెకిలి వ్యాఖ్యలు చేశాడు… ఈమె బాగా సిగ్గుపడిపోయి, థాంక్స్ చెప్పింది… అక్కడ మొదలు ఆ పరిచయం… బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇప్పించాడు… ఈ నాన్‌స్టాప్ ఓటీటీ షోలో కూడా చాన్స్ ఇప్పించాడు… ఆషురెడ్డి సరేసరి… ఈమధ్య బుల్లితెర మీద బోల్డంత ఉదారంగా వ్యవహరిస్తోంది… చొక్కారపు స్రవంతి గూగుల్ ఫోటోలు కూడా హాటే… జస్ట్, ఈ ఉదాహరణలు చాలు కదా… ఎలాంటి బ్యాచును ఈసారి బిగ్‌బాస్ హౌజులోకి దింపారో అర్థం చేసుకోవడానికి…
Ads
నిజానికి ఈసారి బిగ్‌బాస్ నిర్మాణబాధ్యతల్ని ఓంకార్‌కు థర్డ్ పార్టీ అగ్రిమెంట్ కింద ఇచ్చారన్నారు… తనే ఎంపికలు గట్రా చూస్తున్నాడు అన్నారు… కానీ పైపైన స్థూలంగా చూస్తే అంతా వర్మ తాలూకు బ్యాచే కనిపిస్తోంది… ఈ బిగ్‌బాస్ ముంబైలోని క్రియేటివ్ టీం పెద్దాయన ఎవరో వర్మ దోస్త్… అందుకే వర్మ చెప్పింది బాగానే చెల్లుబాటవుతుంది… ఫాఫం, నాగార్జున చేసేదేముంది..? హోస్టింగే కదా… అప్పుడప్పుడూ తెర మీదకు వచ్చి కాస్త పులిహోర ముచ్చట్లు చెప్పడమే కదా… పైగా హౌజ్ ‘కలర్ ఫుల్’గా ఉండాలని కోరుకునే మన్మథుడే కదా…
ఎందుకో కాస్త బిందుమాధవి ప్లజెంటు లుక్… మొన్నటి బిగ్‌బాస్‌లో శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ నడిపిన హమీదా కూడా బాగానే కనిపిస్తుంది… అంటే ఓవరాక్షన్ ఉండదు… మహేశ్ విట్టా పర్లేదు, ఆల్‌రెడీ అనుభవం ఉన్నవాడే కాబట్టి నెగ్గుకురాగలడు… అఖిల్ సార్థక్ తన పాత బిగ్‌బాస్ సీజన్‌లో సీరియస్ మొహంతో విసిగించాడు కానీ ఢీ షోకు వెళ్లాక నవ్వడం అలవాటైనట్టుంది… అనుభవం ఉంది… ఈ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడు… నటరాజ్ మాస్టర్ పాత షోలోనే తెగ విసిగించాడు, మళ్లీ ఎందుకు తీసుకున్నారో వాళ్లకే తెలియాలి…
ఆర్జే చైతూ, మోడల్ అనిల్ రాథోడ్, నటి మిత్రశర్మ, యాంకర్ శివ, నటుడు అజయ్, ఇంటర్వ్యూయర్ స్రవంతి బిగ్‌బాస్ హౌజుకు కొత్త… బయటి తమ వృత్తుల్లో సంపాదించిన పాపులారిటీ వేరు… బిగ్‌బాస్‌లో సేమ్ స్టేటస్, పాపులారిటీ, ఇగోస్ ఉండే తోటి కంటెస్టెంట్లతో నెగ్గుకురావడం వేరు… బట్, పాతవాళ్లకు కొంత అడ్వాంటేజ్ ఉన్నా సరే, కొత్తవాళ్లను తీసిపారేయడానికి వీల్లేదు… ఐనా బిగ్‌బాస్‌తో ముందుగానే కుదిరే ఒప్పందాలే అక్కడి ఫలితాల్ని, ప్రవర్తనను శాసిస్తయ్, అంతే ఓ ప్లాన్డ్ యవ్వారం… కానీ ఈసారి చెప్పుకోదగిన విశేషం మాత్రం… బోల్డ్ బ్యాచ్…!!
Share this Article