Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జబర్దస్త్ తరహా బూతు టెండెన్సీలో బాలీవుడ్ పెద్ద మొహాలు..!!

August 18, 2022 by M S R

నిజానికి తాప్సీ పన్ను మెంటాలిటీకి ఆ వెకిలి, కంపు వ్యాఖ్య విన్న వెంటనే పరుషంగా రియాక్టయి ఉండాలి… కాఫీ విత్ కరణ్ షోకు ఎందుకు పోలేదు అనే ప్రశ్నకు, నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు కాబట్టి పోలేదు అంటూ ఖతర్నాక్ రిటార్ట్, సెటైర్ వేసిన తీరు గుర్తుంది కదా… అంతేకాదు, మా చిన్న బడ్జెట్‌లో మేమే సొంతంగా ఓ షో ప్లాన్ చేస్తున్నాం, కటింగ్ విత్ కశ్యప్ తర్రా విత్ తాప్సీ పేర్లు ఆలోచిస్తున్నాం అని కరణ్ మొహం మీద ఈడ్చికొట్టింది… కానీ ఈసారి మాత్రం ఎందుకో రియాక్ట్ కాలేదు… ఎందుకు..? మింగలేక, కక్కలేక… నవ్వలేక, ఏడ్వలేక… అనే స్థితి ఆమెది..! వివరాల్లోకి వెళ్తే… దొబారా అనే ఓ హిందీ సినిమా వస్తోందిగా… ప్రమోషన్ మీటింగులు, ఇంటర్వ్యూలు పెడుతున్నారు… రిపోర్టర్లు, యాంకర్లు ఏవేవో ప్రశ్నలు వేస్తుంటారు…

దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సిలను ఉద్దేశించి ప్రశ్నలు… వాళ్లూ సరదాగా ప్రతిస్పందిస్తున్నారు… జవాబులు చెబుతున్నారు… ఎవరో అడిగారు… ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఏమిటీ అని… వాళ్లు పెద్ద సీరియస్‌గా తీసుకోకుండా, మా సినిమాను కూడా బాయ్‌కాట్ చేస్తున్నట్టు ఎవరైనా వైరల్ చేస్తే బాగుండు, మాకూ ప్రచారం వచ్చేది అన్నట్టు వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు… (నిజంగా బాయ్‌కాట్ పిలుపుకు గురైతే కరీనాకపూర్‌, అమీర్‌ఖాన్‌లాగే శోకాలు పెట్టేవాళ్లేమో…)

తరువాత రణబీర్ బరిబాతల ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మీద ప్రశ్న… సదరు దర్శకుడు వెంటనే  ‘‘రణబీర్ ఫోటో చూసి చాలామంది మగాళ్లు కుళ్లుకుంటున్నారు… నన్నే చూడండి, ఇదుగో ఈ తాప్సీ స్తనాలకన్నా నా స్తనాల సైజే ఎక్కువ…’’ అన్నాడు… వెంటనే అందరూ షాక్… ఆ పదాన్ని అలా యూజ్ చేయడం, అదీ పక్కనే ఆ పాపులర్ నటిని పెట్టుకుని, ఆమె శరీరభాగాలపైనే కంపుకొట్టే చెత్త వ్యాఖ్యను వదలడం అక్కడున్నవాళ్లను నివ్వెరపరిచింది… అదుగో అక్కడ తాప్సికి ఏమనాలో దిక్కుతోచలేదు…

Ads

TAAPSI

ఏదో పిచ్చి నవ్వు నవ్వి వదిలేసింది… ఈమధ్యకాలంలో ఇలాంటి చిల్లర వ్యాఖ్య ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడి నోటి వెంట వినడం మొదటిసారి… అఫ్‌కోర్స్, మనకు వర్మలు, హిందీలో కరణ్‌లు ఉంటారు… కొంతకాలంగా ఈ దర్శకుడితో సినిమాలు చేస్తోంది తాప్సి… ఇద్దరి నడుమ చాలా క్లోజ్‌నెస్ పెరిగింది… ఆయనకు ఆల్‌రెడీ రెండుసార్లు పెళ్లిళ్లు, విడాకులు అయిపోయినయ్… ఆమె కొన్నాళ్లు బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌తో డేటింగ్ చేసింది… ఏమైందో తెలియదు… 2018 మన్‌మర్జియాఁ షూటింగ్ దగ్గర నుంచి తాప్సి క్లోజ్ అయిపోయింది…

ఐనా సరే, బాహటంగా అలాంటి డర్టీ వ్యాఖ్యలు చేయడానికి కశ్యప్‌కు సిగ్గూశరం లేవా అని నెటిజనం ఫైరవుతున్నారు… కానీ తను అలాంటివాడే… తన సినిమాల ధోరణి, తన ధోరణి కూడా అలాంటిదే… గతంలో ఒక అత్యాచారం కేసులో ఉన్నాడు, ఇప్పటికీ కేసు పెండింగే… ఆమధ్య ఐటీవాళ్లు దాడులు చేస్తే ఏకంగా 300 కోట్ల లెక్కాపత్రం లేని లావాదేవీలు బయటపడ్డాయి… తవ్వితే కశ్యప్ కథలెన్నో… తాజాగా కశ్మీర్ ఫైల్స్‌ ఆస్కార్ నామినేషన్ల మీద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికీ అనురాగ్ కశ్యప్‌కూ నడుమ మాటల యుద్ధం, ట్వీట్ల పోరు సాగుతోంది…

tapsee

ఒక్కొక్క హిందీ సినిమా ఫట్‌మని పేలిపోతుంటే… బాలీవుడ్ ప్రముఖులంతా బాగా ఫ్రస్ట్రేషన్‌లో పడిపోతున్నారు… ఒకడు బరిబాతల ఫోటో దిగి వైరల్ చేసుకుంటాడు.., మరొకడు బూతులు, అక్రమ సంబంధాలతో చాట్ షోలు చేస్తుంటాడు… ఇంకొకడు హీరోయిన్ స్తనాలతో పోల్చుకుని ఎదవ కామెంట్లకు దిగుతుంటాడు… పాతవన్నీ మరిచిపొండి ప్లీజ్ అని ఓ పొగరుబోతు పాత ఇగోను దాచిపెట్టి, తాజాగా ప్రేక్షకులను దేబిరిస్తుంటుంది… బాబ్బాబు, నేను దేశభక్తుడినే అని ఓ స్టార్ హీరో విపరీతంగా నటిస్తుంటాడు… నటన నేర్చుకుంటున్న ఇంకో వారస స్టార్ అర్జున్ కపూర్ ‘బాయ్‌కాట్ అనే వాళ్ల తాట తీయాల్సింది’ అని పేలుతుంటాడు… అసలు ఏమైంది బాలీవుడ్‌కు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions