కిసీకా భాయ్ కిసీకా జాన్ అని సల్మాన్ ఖాన్ హిందీ సినిమా వస్తోంది కదా… అందులో ఏంటమ్మా అనే పాటలో వెంకటేశ్, రాంచరణ్ కూడా డాన్స్ అనబడే స్టెప్పులేశారు… విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ పాడిన ఈపాట ‘రామయ్యా వస్తావయ్యా’ టైపులో తెలుగులో స్టార్టవుతుంది… అక్కడక్కడా తెలుగిందీలో ఎవడికీ అర్థం కాకుండా తిక్కతిక్కగా సాగుతుంది… ఆ పాట దిక్కుమాలినతనం గురించి మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం…
ఎవడు ఏ ఇకారానికి పాల్పడినా మన తెలుగువాళ్లు ఆహా ఓహో, క్రియేటివిటీ, ప్రయోగం అని నెత్తిన మోస్తారు… చప్పట్లు కొడతారు… కానీ తమిళ సమాజం అలా కాదు, తమ కల్చర్‌ను కించపరిచే ప్రయత్నం హిందీవాళ్ల వైపు నుంచి ఎలా జరిగినా ఊరుకోరు… ఈ పాటలో సల్మాన్, వెంకటేశ్, రాంచరణ్ పచ్చ అంగీలు వేసుకుని, తెల్ల ధోవతులు కట్టుకుని ఓ పిచ్చి లుంగీ డాన్స్ చేస్తారు… వెగటు స్టెప్పులు…
లుంగీకి, ధోవతికీ తేడా తెలియని కొందరు డబ్బు కోసం ఇష్టారాజ్యంగా మన డ్రెస్ కల్చర్‌ను భ్రష్టుపట్టిస్తుంటారు… సీబీఎఫ్సీ ఈ సినిమాను బ్యాన్ ఎందుకు చేయకూడదు అంటూ శివరామకృష్ణన్ ప్రశ్నించాడు…
Ads
మరో వ్యక్తి కామెంట్ ఏమిటంటే..? ‘‘మన కల్చర్ డీప్ రూటెడ్… కానీ ఈ బాలీవుడ్ పాట దాన్ని అవమానిస్తోంది…’’ దీనికి బదులిస్తూ మాజీ క్రికెటర్ ‘‘నిజమే, నేనూ అంగీకరిస్తున్నాను… కాకపోతే క్రియేటివ్ ఫ్రీడం పేరుతో అన్నీ చలామణీ చేసుకుంటున్నారు వాళ్లు… చాలామంది ఈ ధోరణిని ఆమోదించడం విషాదం’’ అన్నాడు… ‘‘అసలు ఈ సినిమా మీద పిల్ ఎందుకు వేయకూడదు’’ అని ఓ నెటిజన్ కోపగించాడు…
ప్రముఖ తమిళ విమర్శకుడు రంగస్వామి ఈ లుంగీ స్టెప్పుల మీద తన అసంతృప్తిని ట్వీటాడు… వేష్టిని లుంగీ అంటున్నారు, అందులోకి చేతులు జొప్పించి వెకిలి మూవ్‌మెంట్స్ ఇస్తున్నారు… అసలు ఇవేం స్టెప్పులు..? వరస్ట్ అని ఓ ట్వీట్‌లో ఆగ్రహించాడు… సిగ్గు లేకుండా ఇలాంటి వెకిలి ధోరణులను బాలీవుడ్ సమర్థించుకుంటుంది అని మరో నెటిజెన్ తమిళంలో వ్యాఖ్యానించాడు…
తెలుగు మార్కెట్‌లో డబ్బు కావాలి ఈ సినిమా వాళ్లకు… తెలుగు పేరిట తమకు తోచింది చలామణీ చేసేస్తుంటారు… అసలు వాళ్లకు తెలుగువాళ్లు మద్రాసీలు కారనే బేసిక్ పాయింట్ కూడా తెలియదు… అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు… అప్పట్లో ఏదో షారూక్ ఖాన్ సినిమాలో లుంగీ డాన్స్ పెట్టారు, అది హిట్… ఇప్పుడిక సల్మాన్ ఖాన్ లుంగీ డాన్స్ పేరిట ఈ వెకిలి స్టెప్పులను పట్టుకొచ్చాడు… ఈ సినిమాకు తమిళ మాతృక వీరం సినిమా… దాన్నే తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు… సాదాసీదాగా ఆడింది… ఆ కథనే కాస్త మార్చి తీస్తున్నారు… జగపతిబాబు, భూమిక చావ్లా, పూజా హెగ్డే తదితరులున్నారు…
Share this Article