Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్రమార్కులు… డబ్బు కోసం ఏ అంశాన్నీ వదలరు… చివరకు ఇవీ…

May 6, 2025 by M S R

.

ఇదోరకం అక్రమం… సింపుల్‌గా చెప్పాలంటే ఓ ప్రభుత్వ సలహాదారు ఒక పుస్తకం రాశాడు… ఓ బ్యాంకు అక్షరాలా 7.25 కోట్లతో 1,89,450 పుస్తకాలు కొన్నది… వాటిని బ్యాంకు పైస్థాయి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ అమ్మాలట…  అరాచకం…

వివరాల్లోకి వెళ్తే… ఈ పుస్తకం పేరు “India@100: Envisioning Tomorrow’s Economic Powerhouse”, దీనిని భారతదేశ మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (2018- 2021),  IMF లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రచించాడు…

Ads

ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ 2024 ఆగస్టు 1న ప్రచురించింది. ఈ పుస్తకాల కొనుగోలు నిర్ణయం బ్యాంక్ అంతర్గత వ్యవహారాల్లో పెద్ద వివాదానికి దారితీసింది, దీనితో ఒక జనరల్ మేనేజర్ సస్పెన్షన్‌కు గురై, ప్రస్తుతం KPMG సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించారు…

bank

ఈ పుస్తకాన్ని యూనియన్ బ్యాంక్ 18 జోనల్ కార్యాలయాల ద్వారా 1,89,450 కాపీలు కొనుగోలు చేసింది, వీటిలో 10,525 కాపీలు ఒక్కోటి రూ. 350 చొప్పున పేపర్‌బ్యాక్ వెర్షన్‌లు, 10,422 కాపీలు ఒక్కోటి రూ. 597 చొప్పున హార్డ్‌కవర్ వెర్షన్‌లుగా ఉన్నాయి…

ఈ కాపీలను బ్యాంక్ కస్టమర్లు, స్థానిక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ కొనుగోలు నిర్ణయం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితీష్ రంజన్ ఆమోదంతో డిసెంబర్ 2023లో జరిగినప్పటికీ, దీని గురించి మార్కెటింగ్,  పబ్లిసిటీ విభాగానికి సమాచారం ఇవ్వలేదు.

అంతేగాక, ఈ కొనుగోలుకు సంబంధించి సాధారణ వ్యవహారాల విభాగం జనరల్ మేనేజర్ గిరిజా మిశ్రా ఆమోదం లేకపోవడం, బ్యాంక్ బోర్డుకు సమాచారం అందించకపోవడం వంటి అంశాలు ఈ వివాదానికి కారణమయ్యాయి…

జనవరి 2024లో విచారణ జరపాలని KPMG ని నియమించారు, నెలాఖరుకు వారు తమ నివేదికను సమర్పించారు… అయితే, ఆ నివేదికలోని వివరాలు లేదా సిఫార్సులు ఈరోజుకూ బహిర్గతం కాలేదు, బ్యాంక్ తదుపరి చర్యలు తీసుకుందా అనేది కూడా స్పష్టంగా తెలియలేదు…

bank

ఈ కొనుగోలు నిర్ణయంపై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఖర్చును “వృథా వ్యయం”గా అభివర్ణిస్తూ, దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి… సుబ్రమణ్యన్ IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఈ పుస్తకం ప్రమోషన్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అతని పదవీకాలం అకాలంగా ముగిసింది… డబ్బు కక్కుర్తి, అక్రమాలకు ఏ స్థాయి వాడైనా ఎలా తెగబడుతున్నారనేది మొత్తం ఈ కథనంలో ప్రధానాంశం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions