Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నన్ను ఈ కాపర్-టి ఆపగలదా..? పిడికిట్లో పట్టుకుని మరీ పుట్టాడు..!!

October 4, 2025 by M S R

.

నన్ను ఆపేదెవరు!’… కాప‌ర్-టి పిడికిట్లో ప‌ట్టుకుని మరీ పుట్టిన బ్రెజిల్ శిశువు!

బ్ర‌ెజిల్‌ : గ‌ర్భం రాకుండా త‌ల్లి వాడిన కాప‌ర్-టి (IUD) త‌న చిన్న పిడికిలిలో గ‌ట్టిగా ప‌ట్టుకుని ఓ మగ శిశువు జ‌న్మించిన అద్భుత ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటు చేసుకుంది… వైద్యరంగంలోనే ఇదొక అరుదైన, ఆశ్చర్యపరిచే సంఘటన…

Ads

గోయియాస్‌లోని నెరోపోలిస్‌లో గల హాస్పిటల్ సాగ్రాడో కొరాకావో డీ జీసస్ (Hospital Sagrado Coração de Jesus) లో మాథ్యూస్ గాబ్రియెల్ అనే ఈ మగబిడ్డ జన్మించాడు… శిశువు తల్లి, క్విడీ అరాఉజో డి ఒలివెరా, దాదాపు రెండేళ్లుగా అత్యంత ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతి అయిన కాప‌ర్ కాయిల్‌ (Copper Coil) ను ఉపయోగిస్తున్నది…

సాధారణంగా, ఈ పరికరం 99 శాతం కంటే ఎక్కువ గ‌ర్భ‌ధారణ‌ను నిరోధించ‌గ‌ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది… అయితే, ఒలివెరాకు ఈ కాయిల్ శరీరంలో ఉన్నప్పటికీ గర్భం వచ్చిందని సాధారణ చెకప్‌లో తెలిసింది… గ‌ర్భ‌స్థ శిశువుకు ప్ర‌మాదం క‌ల‌గ‌కుండా ఉండాలంటే కాప‌ర్-టి తొల‌గించ‌వ‌ద్దని డాక్ట‌ర్లు సలహా ఇవ్వడంతో, ఒలివెరా ప్ర‌స‌వం వ‌ర‌కు దానిని అలాగే ఉంచేసింది…

బిడ్డ పుట్టిన వెంటనే, శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ IUD కూడా బయటకు వచ్చింది… అక్కడే ఉన్న డాక్టర్ న‌టాలియా రోడ్రిగ్స్, ఈ అద్భుతాన్ని మ‌రింత గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు… కాప‌ర్-టి జాగ్రత్తగా తీసి, దాన్ని మాథ్యూస్ చిన్న చేతిలో పెట్టారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటో ఇప్ప‌టికీ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది…

“నన్ను ఆపలేని IUD… నా విజ‌యానికి ట్రోఫీని ప‌ట్టుకున్నాను!” అనే శీర్షిక‌తో డాక్ట‌ర్ రోడ్రిగ్స్ ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు… ఈ ఫోటోను చూసిన వారంతా… “ప్ర‌పంచంలోకి రావాల‌ని ఆ బిడ్డ ఎంత గట్టిగా నిర్ణయించుకున్నాడో!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో…! మెగా క్యాంపుకీ బన్నీకి నడుమ గ్యాప్ అలాగే ఉందన్నమాట..!!
  • విధిలేదు… సొంత భర్త ప్రాణాలే తీసేసింది… ఈమె కథ ఇప్పుడెందుకంటే..?
  • కొత్త సెన్సార్ రూల్స్..! నిర్మాతల గుండెల్లో కొత్త గుబులు..!!
  • చేతుల విరిచి కట్టి, గడ్డిమోపులు చుట్టూ పేర్చి… కాలబెట్టారు…
  • శుష్క రాజకీయ మూసీ వ్యూహాలకు… అసలు నిజాల వెల్లడితో సీఎం అడ్డుకట్ట…
  • శృంగేరీ పీఠం ఉత్తరాధికారి నకిలీ శంకరాచార్యుడా..? ఏంటీ రచ్చ..?!
  • శివధర్‌రెడ్డి దగ్గర తుపాకీ లేదా..? దాంట్లో బుల్లెట్లు లేవా మాజీ కామ్రేడ్ దేవ్‌జీ..?
  • ఎంజీఆర్‌పై ఉచ్చ భాష… మన తెలుగుతనంలోనే ఏదో తేడా ఉన్నట్టుంది…
  • శెట్టి గ్యాంగ్… ఎనిమిదేళ్లు దాటినా రష్మికపై అదే కక్ష… అదే వేధింపులు…
  • ఆహా..! నిన్న కేసు, జైలు… సీన్ కట్ చేస్తే… నేడు హాలీవుడ్ ఆశీస్సులు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions