.
Subramanyam Dogiparthi ....
మరో జస్టిస్ చక్రవర్తి సినిమా . ఆ సినిమాలో నేరం నుంచి విముక్తి కలిగినా చేసిన నేరానికి కోర్ట్ హాల్లో కుప్పకూలిపోతారు . ఈ బ్రహ్మరుద్రులు సినిమాలో నేరం చేసి పోలీసులకు లొంగిపోతారు . లొంగిపోవటంతో సినిమా ముగుస్తుంది . అశ్వినీదత్ నిర్మాతగా కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో 1986 నవంబర్లో వచ్చింది ఈ సినిమా .
న్యాయ పరిరక్షణలో స్వంత బావకే ఉరిశిక్షను విధించే జడ్జిగా , చెల్లెలు చేత శాపనార్థాలు తినే అన్నగా , క్లైమాక్సులో తన చెల్లెలికి , తన మేనల్లుడుకి అన్యాయం చేసిన విలనాసురులను కొందరిని మట్టుబెట్టి , మరి కొందరిని పోలీసులకు అప్పచెపుతారు అక్కినేని మేనల్లుడు వెంకటేషుతో కలిసి . జస్టిస్ జగదీష్ చంద్ర ప్రసాదుగా అక్కినేని నటన చాలా బాగుంటుంది . ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే .
Ads
ఆయన భార్యగా లక్ష్మి మధ్య వయసులో కూడా చాలా అందంగా కనిపిస్తుంది . ఆమెకూ ఇలాంటి పాత్రలు ఎడం చేత్తో చేసేవే . వెంకటేష్ కొత్త నటుడు అనే భావన ప్రేక్షకులకు అసలు కలగనివ్వడు . తప్పక మెచ్చుకోవాల్సిందే .
సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది పరుచూరి గోపాలకృష్ణ పాత్ర , అతని నటన . కధను , డైలాగులను సమకూర్చటమే కాకుండా విలనుగా బ్రహ్మాండంగా నటించారు . పండిపోయిన రాజకీయుడిగా డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది .
- ఇద్దరు హీరోయిన్లు . ఒకరు రజని , మరొకరు రంజని . రజని ఈ సినిమా టైంకు అనుభవజ్ఞురాలు అయిపోయింది . గ్లామర్ డాల్ కూడా అయిపోయింది . రంజని సింగపూర్ నటి . తమిళ , కన్నడ , మళయాళ భాషల్లో నటించింది . తెలుగులో ఇదే మొదటి సినిమా . నిజ జీవితంలో సామాజిక , పర్యావరణ ఉద్యమకారిణి . సెలబ్రిటీ కూడా .
పరుచూరి గోపాలకృష్ణ సహ విలన్లుగా నూతన్ ప్రసాద్ , ప్రభాకరరెడ్డి , బెనర్జీ , రాజ్ వర్మ నటించారు . నూతన్ ప్రసాద్ డైలాగ్ డెలివరీ , నటనలు కూడా ప్రత్యేకంగా మలిచారు . ఇతర పాత్రల్లో సంయుక్త , సుమిత్ర , రాళ్ళపల్లి , రాంజీ , సూర్య , తదితరులు నటించారు . అందాల మందాకిని ఐటెం డాన్సరుగా తళుక్కుమంటుంది .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగుంటాయి . బయట పెద్దగా హిట్ అయినట్లు లేదు . బుగ్గ గిల్లుకో , కోక చెదిరిపోతే డ్యూయెట్లు బాగుంటాయి . తాయిలాలో తాయిలాలో గ్రూప్ డాన్స్ చిత్రీకరణ చాలా బాగుంటుంది .
ఓ జాబిలీ అంటూ సాగే అక్కినేని , లక్ష్మిల పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . సినిమాకు ఐకానిక్ సాంగ్ ఓ ధర్మదేవతా ఓ న్యాయదేవతా . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు పాడారు . పాటలన్నీ వేటూరే వ్రాసారు . ఇన్ని విశేషాలున్నా సరే సినిమా పెద్దగా ఆడినట్టు లేదు… జనానికి పెద్దగా నచ్చలేదు…
సినిమా యూట్యూబులో ఉంది . అక్కినేని , వెంకటేష్ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడవచ్చు . It’s an action , emotional , sentimental , Paruchuri-mark movie . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article