Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియన్ ఆర్మీ చేతిలో బ్రహ్మాస్త్రం… చైనా దగ్గర జవాబు లేదు దానికి…

October 17, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. ఇదీ గేమ్ చేంజర్ అంటే! బ్రహ్మోస్ ER ని పరీక్షించిన భారత్ ఆర్మీ! బ్రహ్మోస్ ER అంటే ఎక్స్టెండెడ్ రేంజ్.  ఇప్పుడు ధైర్యంగా ఒక అడుగు ఏమిటి 100 అడుగులు వేయవచ్చు!

*******************

బ్రహ్మోస్ మొదటి వర్షన్ ని విజయవంతంగా పరీక్షించినపుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు భారత్ ని పొగడ్తలతో ముంచెత్తినా, రేంజ్ విషయంలో కొంచెం అసంతృప్తిని ప్రకటించారు. భారత్ లాంటి పెద్ద దేశంకి 280 KM దూరం వెళ్లి టార్గెట్ ని పిన్ పాయింట్ యాక్యురేసితో కొట్టే సూపర్ సానిక్ మిసైల్ ఉండడం మంచిదే అయినా అది పాకిస్తాన్ ని దెబ్బతీయడానికి పనికి వస్తుంది, అదీ సరిహద్దుల దగ్గర నుండి ప్రయోగించాలి.

Ads

సరిహద్దుల్లో మోహరించడం వలన శత్రువు కంట పడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కనీసం 500 km రేంజ్ ఉంటే అప్పుడు పశ్చిమ దేశాలకి మరియు చైనాకి సవాల్ విసిరినట్లుగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు. వాళ్ళ వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళు చేసిన విమర్శ అసంతృప్తితో చేసిందే కానీ భేదభావంతో చేసింది కాదు!

*********************

2021 లో బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ వెర్షన్ అయిన బ్రహ్మోస్ NG (New Generation) ని సుఖోయ్ Su-30 MKI తో అనుసంధానం చేసి ప్రయోగించినపుడు హర్షం వ్యక్తం చేశారు. అవసరం అయితే సరిహద్దు దాటి గంటకి 1800 km వేగంతో ప్రయాణిస్తూ బ్రహ్మోస్ NG ని ప్రయోగించి అదేవేగంతో తిరిగి మన సరిహద్దులలోకి వచ్చేయవచ్చు SU30 MKI. చాలా ఎత్తునుండి ప్రయోగించడం వలన బ్రహ్మోస్ కి భూమ్యాకర్షణ తోడవడంతో వేగంతో పాటు రేంజ్ కూడా 50 KM పెరుగుతుంది!

******************

కానీ బ్రహ్మోస్ ER రేంజ్ వచ్చేసి 500 KM. YES! మూడేళ్లు తిరక్కుండానే వెస్ట్రన్ విశ్లేషకులని ఆశ్చర్యపరిచింది DRDO! మేము మరో రెండేళ్లు అంటే 2026 కి మొదటి ట్రయల్ ఉంటుంది అనుకున్నాము కానీ ముందే వచ్చేసింది అని వాపోయారు. ఈనెల 10 తారీఖున ఏకంగా ఆర్మీలో ప్రవేశపెట్టడానికి గాను అండమాన్ దీవుల నుండి పరీక్షించిన ఆర్మీ సంతృప్తిని వ్యక్తం చేసింది.

రాడార్ కి దొరక్కుండా 500 km దూరం వెళ్లి దాడి చేయడం అనేది నిజంగా గేమ్ చేంజర్. లడాక్ నుండి ప్రయోగిస్తే టిబెట్ లోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న చైనా ఎయిర్ బేస్ ల మీద దాడిచేయగల సత్తా ఇప్పుడు మనకి వచ్చేసింది. అదే బ్రహ్మోస్ ER ఎయిర్ లాంచ్ వర్షన్ SU 30 నుండి అయితే పని ఇంకా సులభం అవుతుంది.బ్రహ్మోస్ విషయంలో చైనా దగ్గర కూడా సమాధానం లేదు!

*****************

మరి చైనా దగ్గర ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ ఏమీ చేయలేదా? ప్రతీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంకి రెస్పాండ్ అయ్యే సమయం అనేది ఉంటుంది… రెస్పాండ్ అయ్యే సమయం ఆయా ఎయిర్ డిఫెన్స్ సిస్టంల మీద ఆధారపడి ఉంటుంది! నేను ఒక ఉదాహరణ చెప్తాను: ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఆటోమాటిక్, మాన్యువల్ అని రెండు రకాల మోడ్ లు ఉంటాయి. మాన్యువల్ మోడ్ లో కమాండ్ సిస్టం మీద ఆపరేటర్స్ ఉంటారు. వీళ్ళు నిత్యం రాడార్ ని పర్యవేక్షిస్తూ ఉంటారు.ఒకవేళ రాడార్ మీద ఏదన్నా ఆబ్జెక్టు కనపడితే వెంటనే ట్రాక్ చేయడం మొదలు పెడతారు.

వచ్చేది ఫ్రెండా లేక శత్రువా అని తెలుసుకున్నాక మిసైల్ ఫైర్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియకి 8 నుండి 12 సెకన్ల సమయం పడుతుంది. మామూలు సబ్ సానిక్ క్రూయిజ్ మిసైల్ కి అయితే 12 సెకన్ల సమయం తీసుకొని కూల్చేయవచ్చు. కానీ మాక్ 3 లేదా 4 స్పీడ్ తో వెళ్లే బ్రహ్మోస్ ని కూల్చాలి అంటే అది 4 సెకన్లలో చేయాలి.

కానీ డిటెక్ట్ చేయడానికి 3 సెకన్లు, దానిని ట్రాక్ చేయడానికి 3 సెకన్లు, ఫైర్ కంట్రోల్ రాడార్ కి ఆర్డర్ ఇవ్వడానికి 4 సెకన్ల సమయం పడుతుంది.ఆ తరువాత ఫైర్ చేసినా ఉపయోగం ఉండదు. అప్పటికే బ్రహ్మోస్ వెళ్ళిపోయి ఉంటుంది. రష్యా బ్రహ్మోస్ ER ల కోసం ఎదురు చూస్తున్నది. బహుశా వచ్చే వారం ఆర్డర్ చెయ్యచ్చు. బ్రహ్మోస్ లో రష్యాకి 48% స్టేక్ ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions