చూడబోతే అదేదో పురాతన కాలం నాటి ఏదో ఫాంటసీ కథలా కనిపిస్తోంది…
సో వాట్… మంచిదే కదా, ఇంట్రస్టింగ్… ఎహె, అంతటి మమ్ముట్టి మరీ ముసలాడిలా, సడెన్‌గా చూస్తే ఎవడో మంత్రగాడిలా కనిపిస్తున్నాడు…
వోకే, తప్పేముంది..? పాత్రోచిత ఆహార్యం కావచ్చు…
Ads
అబ్బా, ఆ డైలాగులు గట్రా ఏదో హారర్ కథలా అనిపిస్తోంది… వావ్, మరీ మంచిది… ట్రెండ్ అదే కదా…
అబ్బా, అది కాదు మహాశయా… అదేదో భూతాలు, మంత్రాలు, మాయలు కథలా ఉంది… పర్లేదంటారా..?
వోకే మిత్రమా… అవీ కథలే కదా… హాలీవుడ్‌లో వేల కోట్లు కురిపిస్తున్నవి అవే కదా…
అయ్యా, సారూ… మన సౌత్ హీరో ఇలాంటి పాత్ర చేయడం ఏమిటసలు..? ఏవో ట్రెండీ డ్రెస్సులు వేసి, పిచ్చి స్టెప్పులు వేసి, వెకిలి కామెడీ కురిపించి, వెగటు రొమాన్స్ పండించి,బీభత్సమైన సూపర్ మ్యాన్ ఫైటింగులు పెట్టి, తెర నిండా నెత్తురు పారించి, కనిపించినవాడినల్లా కత్తికోకండగా నరికి పోగులు పెట్టి, తలెగరేసి, మీసాలు తిప్పి, ఇదేరా మగతనం అంటే అని డవిలాగులు కొట్టాలి కదా… మా ఫ్యాన్స్ మహా మూర్ఖులు, ఇలాంటి ఎలివేషన్సే కోరతారు అని చెప్పాలి కదా… ఇలా భిన్నమైన కథలతో ప్రయోగాలు చేయడం ఏమిటసలు..?
అవునోయ్, అదే మరి మమ్ముట్టిలు, మోహన్‌లాల్‌లు… వాళ్లు రజినీలు కారు, చిరంజీవిలు కారు… నిఖార్సుగా మోహన్‌బాబులు అయితే అస్సలు కారు… చివరకు బూతు వెబ్ సీరీసుల వెంకటేశ్‌లు కూడా కారు… గుడ్..,
ఎహె, ఏవో వైఎస్ వంటి పాత్రలు చేసుకోవచ్చు కదా… మరీ ఈ అర్థం కాని ప్రయోగాలు మమ్ముట్టికేల మాస్టారూ..?
ఓహ్, నువ్వు చెప్పేది భ్రమయుగం సినిమా గురించా..? మరి అలాంటి కథలు చేస్తేనే కదోయ్, ఓ పాపులర్ హీరో నటజీవితానికి సార్థకత…? తనను కూడా మడతపెట్టిన కుర్చీ సాంగ్స్ చేయమంటావా ఏమిటి..?
కలియుగానికి ఓ వికృతరూపమట, భ్రమయుగం అంటే… ట్రెయిలర్ కూడా రిలీజ్ చేశారు, పైగా ఫుల్లు బ్లాక్ అండ్ వైట్ సినిమా అట… ఇది మరీ హెడ్ వెయిట్ కదా మాస్టారూ…
అదిరా సాహసమంటే… ఈ గ్రాఫిక్ సినిమాల రోజుల్లో ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమాను అంతటి పాపులర్ హీరో రిలీజ్ చేయడం అంటే మాటలా..? జానేదేవ్… సినిమాను జనం చూస్తారా లేదా… సినిమాకు నాలుగు పైసలు రాలతాయా లేదా… బట్, వాడు కదా కథను బట్టి డేరింగ్ స్టెప్ వేయడం అంటే… ప్రయోగాలకు ఎవర్ రెడీగా ఉండటం అంటే…
ఏమో గురూ గారూ… పావులు అంటాడు, పాచికలు అంటాడు… నట్టడివిలో ఓ గుడి… అంతా ఓ మాయల పకీరు సినిమాలాగా కనిపిస్తోంది…
పోనీలేవోయ్… ఊఊఊ అని అరుస్తూ వచ్చిన ఒక కాంతారా ఆ రేంజ్ హిట్ కొడుతుందని ఎవరనుకున్నారు..? ఏ సగటు సౌత్ సినిమా వాసనలు, ఛాయలు లేకుండా ఓ భిన్నమైన సినిమా తీస్తున్నందుకు ఆ టీంను, ఆ పాత్ర చేస్తున్నందుకు మమ్ముట్టిని కదా అభినందించాల్సింది…
పర్లేదంటారా..?
తప్పదు అంటాను… మమ్ముట్టిలు కాకపోతే ఇంకెవరోయ్ మన సినిమాల్లో ఈ సాహసాలు చేయగలిగేది… ఆల్ ది బెస్టోయ్ మమ్ముట్టీ…
చూడబోతే, మీరు ఈ లేటు వయస్సులో ఆయనకు గొట్టు ఫ్యాన్ అయిపోతున్నట్టున్నారు…
తప్పేముందోయ్… మన సొల్లు హీరోలను చూసీ చూసీ మనసు బండబారిపోయి… ఇదుగో ఇలాంటి కథల్ని, ఇలాంటి హీరోల్ని కదా చూడాలని తపిస్తోంది… హిట్టో ఫట్టో జానేదేవో… ఈ డేరింగ్ ప్రయత్నాలను కదా మనం అభినందించాల్సింది…
Share this Article