.
ఫాఫం కేసీయార్… ఫాఫం బీఆర్ఎస్ క్యాంప్… కాళేశ్వరం మీద ఏవేవో సమర్థనలకు నానా ప్రయాసలూ పడుతూ… నానాటికీ దారుణంగా మారిపోతోంది…
నో, నో, ఘోష్ కమిటీ నివేదిక మీద కోర్టుకు పోవడం గురించి కాదు… కాళేశ్వరం మేడిగడ్డ పగుళ్ల విషయంలో పోలవరానికి లింక్ పెట్టి ఆపసోపాలు పడుతున్న తీరు గురించి…
Ads
కేసీయార్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీ బ్యానర్… ఏమిటయ్యా అంటే..? రేవంత్ రెడ్డి ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి అట… మేడిగడ్డ వాడాల్సిందేననీ, రేపటి కోసమైనా కాళేశ్వరం రాష్ట్రానికి అవసరమేననీ సెలవిచ్చాడట…
రిపేర్లు వద్దన్నదెవరు మరి..? కాకపోతే అధ్వాన్నంగా కట్టారు కాబట్టి, అడ్డదిడ్డంగా ప్రాజెక్టు నిర్మాణంలాగే రిపేర్లు చేస్తే ‘ఉన్నది ఊశిపోతది’ కాబట్టి, కనీసం రిపేర్లయినా శాస్త్రీయంగా, నాణ్యంగా చేయాలి కాబట్టి, ఆగుతోంది… ఆయనెవరో గురుస్వామి, ఫాఫం, నోరు చింపుకున్నట్టున్నాడు ఎక్కడో…
ఇక మరో ముఖ్య విషయం… కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటారు గానీ, పోలవరాన్ని కూలవరం అనరెందుకు..? అంటూ అక్కడ కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయింది అంటాడు కేటీయార్… ఎన్‌డీఎస్ఏ కు కళ్లు కనిపించడం లేదా..? డయాఫ్రం వాల్ కూలిపోయిందీ అంటాడు… అసలు పోలవరానికీ కాళేశ్వరానికీ లింకేమిటీ అనడగకూడదట తనను..?
నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీ ఫోటో ఇది… ఆంధ్రాలో కూలవరం, చూడలేని కేంద్రం అంటాడు… సరే, బీజేపీని కౌంటర్ చేయడం, టీడీపీ కూటమిని కౌంటర్ చేయడం, తద్వారా మేడిగడ్డ పగుళ్లను ఏదో డిఫెండ్ చేసుకునే విఫల ప్రయత్నం…
ఎస్, నిజంగానే మొన్నామధ్య 8 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో కాఫర్ డ్యామ్ మీద మట్టికట్ట కొంత తస్కింది, అనగా కుంగింది… కానీ ఈరోజు నమస్తే తెలంగాణ ఫోటోలు, వార్తలు చూడండి ఓసారి… అసలు మాది పత్రిక అయితే కదా, పాత్రికేయ ప్రమాణాలు పాటించడానికి అన్నట్టుగా….
సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయట… అవి పెట్టేసి, కాఫర్ డ్యామ్ మొత్తం ఇలా కొట్టుకుపోయింది అని రాసిపారేశాడు… సోషల్ మీడియాలో ఫోటోలు, వార్తలు తనకు ప్రామాణికాలా..? ఆధారాలా..? కనీసం క్రాస్ చెక్ చేసుకునే సోయి ఎటూ లేదు… ఒకటీరెండు కామన్ సెన్స్ పాయింట్లు చూద్దాం…
ఆ ఫోటోల్లో కరెంటు పోల్స్ కనిపిస్తున్నాయి… పక్కన పొలాలు కనిపిస్తున్నాయి… గుడిసెలు, కొట్టాలు కనిపిస్తున్నాయి… కాఫర్ డ్యామ్ మీద ఇవి ఉంటాయా..? ఐనా అంత వెడల్పు ఉంటుందా కాఫర్ డ్యామ్ ఉపరితలం..? మరెందుకు వాటిని ప్రచురించి, కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందని రాసేసి తను ఆ బురదలో కొట్టుకుపోవడం..?
- అయితే నిజంగా అవి ఎక్కడి ఫోటోలు అని ‘ముచ్చట’ ఆరా తీసింది… అది పోలవరం ప్రాజెక్టుకి వెళ్లే మామిడిగొంది రహదారి… రహదారి పక్కనే వంద ఎకరాల్లో కొండ వుంది… దానిలో ప్రాజెక్టులో తీసిన మట్టిని అక్కడ డంప్ చేశారు… 2018 లో భారీ వర్షాలు కురవడంతో మట్టి మొత్తం రోడ్డు మీదకు చేరుకుంది… వర్షం తీవ్రతకు మట్టి రహదారి అలా పగుళ్లు బారింది… ఇది 2018 నాటి photo… ఎప్పుడో ఆ రోడ్డు కూడా పునరుద్ధరించామని అక్కడి ఉన్నతాధికారులు చెబుతున్నారు…
అది కూలవరమో కాదో తెలియదు, ఇక్కడ అప్రస్తుతం… కానీ కూలేశ్వరం మీద ఈ విఫల సమర్థనలు, సోషల్ మీడియాను తలపించే రాజకీయాలు, గాయగత్తరలు అవసరమా అధ్యక్షా..?!
Share this Article