రేవంత్ రెడ్డి ఎడాపెడా మీటింగుల్లో పాల్గొంటున్నాడు… జనంలో తిరుగుతున్నాడు… కానీ ఒక ముఖ్యమంత్రి చుట్టూ తప్పకుండా కనిపించాల్సిన భద్రతా వ్యూహాల్లో మాత్రం లోపాలు కనిపిస్తున్నాయి… నిర్లక్ష్యం చేయదగని లోపాలు…
ఉదాహరణకు… మొన్న హైదరాబాద్, రవీంద్రభారతిలో ఓ పోగ్రాం… ఎన్నో ఏళ్లుగా వెయ్యి మంది జర్నలిస్టులు ఎదురుచూస్తున్న స్థలం అప్పగింత కార్యక్రమం… జర్నలిస్టు సర్కిళ్లలో రేవంత్ రెడ్డి పట్ల, మంత్రి పొంగులేటి పట్ల పాజిటివిటీని పెంచిన నిర్ణయం, చర్య…
ఆ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు చాలామంది భార్యాపిల్లలతో సహా హాజరయ్యారు… ప్రభుత్వమే ఖర్చు భరించింది… సొంత నిర్వహణ… వేదిక మీద ఎవరుండాలి..? సీఎం రేవంత్, మంత్రులు పొంగులేటి, పొన్నం, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే, నగర మేయర్, డిప్యూటీ మేయర్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్, సీఎంలో ఉన్నతాధికారి, సీఎంపీఆర్వో, ఆ సొసైటీ పాలకవర్గం… అంటే ఐదుగురు డైరెక్టర్లు… అంతే కదా… మరో ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ కూడా…
Ads
నిజానికి వేదిక మీద ఎవరెవరు ఉండాలి, వాళ్ల నేపథ్యం ఏమిటో ముందుగానే పరిశీలిస్తారు పోలీసులు, వేరేవాళ్లు పైకి రాకుండా అడ్డుకుంటారు… కానీ సీఎం, మంత్రులు, శ్రీనివాసరెడ్డిలకు చిత్రపటాలు సమర్పించే సీన్‌లోకి ముగ్గురు నలుగురు వచ్చేశారు… ప్రముఖంగా కనిపించడానికి ప్రయత్నం చేశారు… వారిలో బిల్డర్లు కూడా ఉన్నారని సమాచారం, కానీ ఎవరూ వారించలేదు… సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు భిన్నంగా వచ్చినది ఎవరు..? సొసైటీ వాట్సప్ గ్రూపుల్లో దీని మీద రభస నడుస్తోంది… అది వేరే సంగతి… (వారిలో ఒకరు చిత్రకారుడు చిత్ర… తన చిత్రాలే కాబట్టి అనుమతించవచ్చు…)
నాన్ జర్నలిస్టులు అంత చొరవగా, ప్రోటోకాల్ పక్కకు తోసేస్తూ మరీ వేదిక మీదకు రావడమనేది చర్చ… ఎవరు వేదిక మీదకు రానిచ్చారు..? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఎవరైనా తనను తీసుకొచ్చారా..? అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లు పడ్డాయా..? అసలు హౌజ్ సైట్లను ఏం చేయబోతున్నారు..? జర్నలిస్టు కుటుంబాల్లో మళ్లీ భయసందేహాలు… 18 ఏళ్ల నిరీక్షణను కాస్తా ఎవరికో కాసుల పంట చేయబోతున్నారా..?
పాలకవర్గంలోని గొడవల వల్ల ప్రభుత్వానికి రావల్సిన మంచి పేరు కూడా రాకుండా పోతోందనే సందేహం ప్రభుత్వ ముఖ్యుల్లోనూ మొదలైంది… సాఫీగా, సజావుగా సగటు సొసైటీ మెంబర్‌కు స్థలం అప్పగింత కోసం ఏం చేస్తే బాగుంటుందనే సీరియస్ ఆలోచన కూడా సాగుతోందని సమాచారం… అంతేకాదు…
వీఐపీల సెక్యూరిటీని పర్యవేక్షించే ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ సైతం సదరు అపరిచితుడు ఎవరు..? సీఎంకు అంత సమీపంలోకి ఎలా రాగలిగాడు..? తన నేపథ్యం ఏమిటి..? పాలకవర్గ సభ్యుల్లో ఎవరైనా దీనికి సాయపడ్డారా..? ఈ కోణాల్లో ఆరాలు తీస్తోందని సమాచారం… రేవంత్ రెడ్డికి పెద్దగా సెక్యూరిటీ థ్రెట్స్ ఏమీ లేకపోవచ్చు గాక… కానీ సీఎం సీఎమ్మే కదా… తప్పనిసరిగా పాటించాల్సిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అవసరమే..!!
Share this Article