.
అసలే బెట్టింగ్ యాప్స్ కేసులతో వేడివేడిగా ఉంది టాలీవుడ్ వాతావరణం… కేసులు, పోలీస్ విచారణలు… అప్పట్లో అకున్ సభర్వాల్ డ్రగ్స్ కేసుల మీద క్రియేట్ చేసిన వాతావరణాన్ని మించి ఉంది ఇప్పుడు… నడుమ వేణుస్వామి వివాదం ఒకటి జొరబడింది…
వేణుస్వామి ఎవరో జర్నలిస్టుతో ఓ ప్రైవేటు సంభాషణలో ఏదో అన్నాడుట… అదెవడో చాటుగా రికార్డ్ చేశాడుట… అది టీవీల్లో, సైట్లలో, యూట్యూబ్ చానెళ్లలో ప్రసారం… నిజంగానే వేణుస్వామి ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంతలు సూసైడ్ చేసుకుంటారని అన్నాడా..?
Ads
ఎహె, నేనలా అనలేదు, ఒకవేళ నేను ఆ వివరాలు చెప్పాలనుకుంటే నేనే నా సొంత వీడియోలు, నా మాటల్లోనే సోషల్ మీడియాలో పెట్టుకుంటాను కదా, వేరే ఇంటర్వ్యూలల్లో చెప్పేవాడిని కదానేది తన వాదన…
సరే, ఆ వివాదంలోని మెరిట్స్, డీమెరిట్స్ పక్కన పెడితే… ఇప్పుడు అసలే బెట్టింగ్ యాప్ కేసులతో తెలుగు ఇండస్ట్రీలో ఓ గందరగోళం నెలకొంది… మొత్తం 25 మంది… కొందరు కొత్త వీడియోలు చేస్తూ సారీలు చెబుతున్నారు, భయపడుతున్నారు, దగ్గుబాటి, రానాలు తమదైన చట్టపరమైన వివరణను ఇస్తున్నారు, మధ్యలో బాలయ్య ఇష్యూ వచ్చింది… తాజాగా మరో బెట్టింగ్ ఆత్మహత్య కూడా చోటుచేసుేకోవడంతో… మొత్తం 16 ఆత్మహత్యలట…
357 పైచిలుకు బెట్టింగ్ యాప్స్ బ్లాక్ చేశారు… జీఎస్టీ ఇంటలిజెన్స్ (డీజీజీఐ) రంగప్రవేశం చేసింది… 2400 అకౌంట్లను బ్లాక్ చేసి 126 కోట్లు సీజ్ చేసింది… 700 గేమింగ్ కంపెనీలను జల్లెడ పడుతున్నారు…
ఇదెప్పుడో చేయాల్సింది… కోట్లకుకోట్ల డబ్బు దోపిడీ ఆగిపోయేది… ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా సీరియస్‌గానే కదులుతున్నారు… యాప్స్ ఓ పెద్ద నెట్‌వర్క్ కాగా, వాటిని ప్రమోట్ చేయడం కూడా ఓ రాకెట్ అట… మహారాష్ట్ర ప్రభుత్వం గనుక రంగంలోకి దిగితే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బుక్కవుతారని టాక్…
ఈ కేసుల్లో బుక్కయిన సెలబ్రిటీల ఫోన్లు సీజ్ చేస్తే, వాటిల్లో దాగిన ఇంకెన్ని బాగోతాలు బయటికొస్తాయో అనేది ఇప్పుడు కొత్త ఆందోళన… విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరై తన వెర్షన్ తను చెప్పుకుంది…
శ్రీముఖి, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్ తదితరుల విచారణ తేదీలు వస్తే మీడియా కాన్సంట్రేషన్ అటువైపే మళ్లుతుంది… కాకపోతే యాంకర్ శ్యామలలాగే అరెస్టుల నుంచి వీళ్లు కోర్టు రక్షణ పొందడానికి ప్రయత్నిస్తారు…
ఈ వేడి ఇలా పెరుగుతుంటే… వేణుస్వామి ముగ్గురు టాప్ సినిమా సెలబ్రిటీల మీద ఏదో చెప్పాడు అనే ప్రచారంతో… ఇదీ ఓ డిస్కషన్‌కు దారితీస్తోంది… నిజంగా ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండల ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది ఆ డిస్కషన్… సమంత అదేదో ఇంగ్లిష్ వెబ్ సీరీస్ తరువాత మళ్లీ తెర మీదకు రాలేదు… విజయ్ దేవరకొండ చాన్నాళ్లుగా తెర మీద లేడు… ప్రభాస్ సరేసరి…
కానీ ఈ ప్రచారాలతో ఓ అస్థిరత పెరుగుతుంది… అసలే నమ్మకాలు, ప్రచారాల ప్రభావం విపరీతంగా ఉండే ఇండస్ట్రీ ఇది… ఐతే మరో టీవీ మాజీ న్యూస్ రీడర్ పేరు ఈ బెట్టింగ్ యాప్స్ దందాలకు సంబంధించి వెలుగులోకి వస్తోంది… పోలీసులు ఇంకా తవ్వుతున్నారు… ఇప్పటికి తెర మీదకు వచ్చినవి కొన్ని పేర్లే, కొన్ని మొహాలే…
తీగ లాగిన కారకులు ఎవరైతేనేం..? ఎప్పుడో ఓసారి, ఎక్కడో ఓచోట ఈ దురాశల బుడగలు పేలిపోవల్సిందే… ఆ సమయం వచ్చేసింది…!
2023లో ఇలాంటి అక్రమ గేమింగ్ కంపెనీలు సేకరించిన డిపాజిట్లు రూ.80 వేల కోట్లకు పైగానే ఉన్నాయ్. ఈ విషయం స్వయంగా ఈ-గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కానీ నో యాక్షన్… అంటే ఈ నెట్‌వర్క్ ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థమవుతోంది కదా…!! (ఇంత జరుగుతోంది కదా, రీతూ ఏదో యాప్ ప్రమోట్ చేస్తున్న ఫ్రెష్ రీల్ నిన్న కనిపించింది…)
దీన్ని ఏమంటారు..!?
Share this Article