Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుక్క తిప్పని పాట… ఒకట్రెండు బాలు పాడినవే… మళ్లీ ఆ ప్రయోగమే లేదు…

May 27, 2025 by M S R

.

ఇప్పుడంటే… ఓ పాట రికార్డ్ చేయడానికి… ఎన్నో సాంకేతిక సదుపాయాలు… వేర్వేరు ట్రాకులను కలిపేయడం, చిన్నాచితకా పొరపాట్లను స్వరబద్ధంగానే సరిచేసే యాప్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్… అంతెందుకు అవే పాటలు రాయగలవు, అవే ట్యూన్ ఇచ్చి, అవే సంగీత వాయిద్యాలను ప్లే చేసి, ఔట్‌పుట్ ఇవ్వగలవు… మీరు కోరిన గాయకుల గొంతులతో…

కానీ అలాంటివేవీ లేని రోజుల్లో… నీలీల పాడెద దేవా అనే పాటలో గాయని నాదస్వరంతో పోటీపడాలి… బాంబేలో ఏదో స్టూడియోలో జానకి పాడితే రికార్డు చేశారు… మద్రాసులో నాదస్వరం రికార్డు చేసి, ఆ రెండు ట్రాకులూ కలిపారు… అదే అబ్బురంగా చెప్పుకున్నారు అప్పట్లో…

Ads

జానకి ఇదే సాంగ్ తరువాత పాడిన లింక్… 

సరే, ఓం మహా ప్రాణదీపం పాట తెలుసు కదా… ఆ బ్రెత్‌లెస్ ప్రయోగం గురించి ముచ్చటలో ఓ కథనం తరువాత మిత్రుల నడుమ మాటామంతీ… దాన్ని అద్భుతంగా పాడిన ఆ శంకర్ మహాదేవన్ ఈటీవీ 20 ఇయర్స్ ఉత్సవంలో సరిగ్గా పాడలేకపోయాడు… ఎస్పీ బాలు వేదిక మీద ఎప్పుడూ అటెంప్ట్ చేయలేదు…

శంకర్ మహాదేవన్ పాట లింక్… 

టెక్నికల్ సౌలభ్యం గురించి చెప్పుకోవడం ఎందుకంటే..? బ్రెత్ లెస్ సాంగ్ అంటే పూర్తిగా ఏకబిగిన మధ్యలో ఊపిరి తీయడం కూడా ఆపేసి పాడటం కాదు, సాధ్యం కాదు… రికార్డింగ్‌లో కొంత టెక్నికల్ సాయం తీసుకుని, అలా అనిపించేలా చేస్తారు… పెద్ద రహస్యమేమీ కాదు… కాకపోతే ఆ ప్రయోగం ఎంత సక్సెస్‌ఫుల్‌గా జనం రిసీవ్ చేసుకున్నారనేదే ప్రధానం… చెవుల నుంచి గుండెను బాగా తాకిందా లేదా, మది పులకించిందా లేదానేదే ముఖ్యం…

అంతెందుకు..? అప్పుడెప్పుడో జగదేకవీరుని కథ సినిమాలో ఘంటసాల మాస్టారు సరిగమలతో చెడుగుడు ఆడుకున్నదే సంగీత ప్రయోగంగా చెప్పుకునే వారు… ఆ పాటను ఆ ఘంటసాలే మళ్లీ ఎప్పుడు వేదిక మీద పాడటానికి సాహసించలేదు, అదీ ఒరిజినల్ పాట స్టామినా… బాలు కూడా వేదిక మీద ఎప్పుడూ పాడలేదు…

శివశంకరి సాంగ్ లింక్… 

1990 నుండి 2000 వరకు… అంటే శంకర్ మహదేవన్ బ్రెత్‌లెస్ సాంగ్ మహాప్రాణదీపం వచ్చే వరకు దశాబ్దం పాటు ఎస్పీ బాలు నాన్ స్టాప్ చరణాల పాట దక్షిణాదిలో ఓ సంగీత చర్చ…

కేలడి కన్మణి అంటే తెలుగులో ఓ పాప లాలి సినిమా… 1990 నాటి సినిమా… మూచ్చి విడామ పాడరంగ అంటే … శ్వాస ఆపకుండా పాడుతానని ఓ సీన్‌లో బాలు రాధికకు ప్రామిస్ చేస్తాడు…. అప్పుడు ఈ పాటలో బాల సుబ్రహ్మణ్యం రెండు చరణాలను శ్వాస గుక్క తిప్పకుండా పాడతాడు… ఇళయరాజా మ్యూజిక్‌లో 90 లలో అప్పుడొక అద్భుతమైన ప్రయోగంగా తమిళ, తెలుగులలో ఈ పాట ఇప్పటికే సూపరే… ఇదీ లింక్… 

అజిత్- షాలిని నటించిన అమర్కళం… తెలుగులో అద్భుతం పేరుతో డబ్ అయ్యింది… ఇందులో దాదాపు మూడున్నర నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా తమిళ్/ తెలుగులో ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా అనే బ్రెత్ లెస్ సాంగ్ పాడాడు… తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో వారం రోజుల సినిమాగానే మిగిలింది… పాట లింక్…  కల్పన వంటి సింగర్స్ వేదికల మీద కూడా దీన్ని అటెంప్ట్ చేశారు…

మళ్లీ కొన్నేళ్లకి EVV సత్యనారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్- సదా కాంబినేషన్‌లో వచ్చిన లీలా మహల్ సెంటర్‌లో కూడా బాలు బ్రెత్‌లెస్ సాంగ్ పాడాడు… కొండాకోనల‌ మధ్య సేమ్ తమిళంలో ఎలా పాడారో.. ఎలా చిత్రీకరించారో తెలుగులో కూడా అలానే కానిచ్చేశాడు దర్శకుడు దేవిప్రసాద్ .C… ఎందుకో గానీ ఈ పాట పెద్దగా చర్చల్లోకి రాలేదు ఎప్పుడూ… ఇదీ పాట లింక్… 

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే… బ్రెత్‌లెస్ సాంగ్స్‌కు సాంకేతిక సహకారం ప్లస్ సంగీత దర్శకులు, ఆయా సినిమాల దర్శకుల ప్రయోగాల అభిరుచి, బాలు స్వరజ్ఞానం, సామర్థ్యం… కానీ మహాప్రాణదీపం శివం శివం తరువాత ఇన్నేళ్లయినా మళ్లీ ఒక్కటీ ఆ రేంజ్ పాట రాలేదు… బ్రెత్‌లెస్ కేటగిరీలో… అలౌకిక ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తేలా…!! ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చి కూడా..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
  • ‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…
  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions