Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రపంచాన్ని శాసించబోతున్న కొత్త బ్రిక్స్ డిజిటల్ కరెన్సీ..!! పార్ట్ 3

November 18, 2024 by M S R

.

డోనాల్డ్ ట్రంప్ ముందు ఉన్న ఛాలెంజ్ BRICS PAY! PART 3

అక్టోబర్ 24 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ BRICS PAY ని ప్రారంభించాడు!

Ads

BRICS కోసం అంటూ ప్రత్యేకంగా ఒక పేపర్ కరెన్సీ అంటూ ఏదీ లేదు. మొత్తం డిజిటల్ రూపంలోనే లావాదేవీలు జరుగుతాయి!

BRICS వేదిక మీద BRICS కరెన్సీ అంటూ ఒక 100 బ్రిక్స్ బిల్ ( కరెన్సీ నోట్ ) ని శాంపుల్ గా ఇచ్చారు కానీ అది అధికారికంగా ప్రకటించబడలేదు కాబట్టి దానికి విలువ లేదు!

BRICS PAY – BLOCK CHAIN BASED PLATFORM

బ్రిక్స్ పే అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ ని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది!
అయితే బ్రిక్స్ పే అనేది పశ్చిమ దేశాల అదీనంలో ఉన్న SWIFT పేమెంట్స్ సిస్టమ్ కి పోటీ ఇవ్వగలదా?

SWIFT పేమెంట్ సిస్టమ్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేశారు. అప్పట్లో యూరోపు దేశాలతో పాటు ఆసియా దేశాలు కూడా SWIFT సిస్టమ్ లో భాగస్వామ్యం అయ్యాయి.

ప్రస్తుతం SWIFT పేమెంట్ సిస్టమ్ లో 11 వేల ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు భాగంగా ఉన్నాయి. అయితే ఇది అమెరికా మీద నమ్మకంతో జరిగింది!

అమెరికా స్విఫ్ట్ సిస్టమ్ ని దుర్వినియోగం చేస్తూ తన మాట వినని దేశాల డాలర్ల ని సీజ్ చేస్తుండడం వలన క్రమేపి ప్రపంచ దేశాలలో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది అన్నది వాస్తవం!

ఉదా : రష్యాకి సంబంధించి  300 బిలియన్ డాలర్లని అమెరికా దాని మిత్ర దేశాలు స్థంభింపచేశాయి. రష్యా సెంట్రల్ బాంక్ బంగారాన్ని అమ్మి ఆ డాలర్లని ఈక్విటీస్, బాంక్ డిపాజిట్ల రూపంలో అమెరికాతో పాటు యూరోపు దేశాల్లో ఇన్వెస్ట్ చేసింది.

ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయగానే సీజ్ చేసింది. రష్యా పౌరుల సొమ్ము కూడా విత్ డ్రా చేయడానికి వీలులేకుండా చేసింది. ప్రస్తుతం రష్యా అసెట్స్ ని వివిధ దేశాలు ఎలా వాడుకోవాలో ఒక ప్రణాళిక వేసింది అమెరికా! అంటే ఆ 300 బిలియన్ డాలర్ల కి రష్యాకి ఏమీ సంబంధం ఉండదు అన్నమాట!

ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన 9 బిలియన్ డాలర్ల ని సీజ్ చేసింది అమెరికా. తాలిబాన్లు తమ డాలర్ల ని వాడుకోవడానికి అనుమతి ఇవ్వమని వేడుకుంటున్నా ఫలితం లేదు. ఇదే బాటలో ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా దేశాలు ఉన్నాయి.

ఇక్కడే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ అనేది చాలా దేశాలని ఆకర్షిస్తున్నది!

ప్రధానంగా ఏ దేశానికి అయినా క్రూడ్ ఆయిల్ లేదా శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్ కావాలి. ఇప్పటి వరకూ డాలర్లతోనే కొనాల్సి వచ్చేది. సౌదీ అరేబియా పెట్రో డాలర్ల ఒప్పందాన్ని పొడిగించలేదు కాబట్టి డాలర్ అవసరం లేదు కానీ కొనడానికి ఏదో ఒక రూపంలో కరెన్సీ కావాలి కదా!

ఇక్కడే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ పనిచేస్తుంది.
సౌదీ నుండి ఆయిల్ కొనాలి అంటే బ్రిక్స్ పేమెంట్ ద్వారా కొనవచ్చు డాలర్ అవసరం లేకుండా! సౌదీ అరేబియా, రష్యా, ఇరాన్ దేశాలు బ్రిక్స్ లో ఉన్నాయి కాబట్టి బ్రిక్స్ దేశాలు డాలర్ తో పని లేకుండా కొనవచ్చు.

రష్యా ఇప్పటికే తమ దేశం నుండి ఆయిల్ తో సహా ఏది కొనాలన్నా రూబుల్స్ లోనే పేమెంట్ చేయాలి అనే నిబంధన విధించింది!

అందుకే దాదాపుగా 50 దేశాలు బ్రిక్స్ పేమెంట్ మీద ఆసక్తి చూపుతున్నాయి. అఫ్కోర్స్! తమ ఇంధన అవసరాల కోసం కొన్ని యూరోపు దేశాలు కూడా బ్రిక్స్ లో చేరవచ్చు!

ఎంత పెద్ద పని అయినా మొదటి అడుగు అంటూ సక్రమంగా పడితే విజయం సాధిస్తుంది! ప్రస్తుతం బ్రిక్స్ పేమెంట్స్ ప్రారంభ దశలోనే ఉన్నా ముందు ముందు పెద్దగా ఎదగదు అని భావించడం తప్పు. కానీ పశ్చిమ దేశాల నిపుణులు మాత్రం బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్ కి పోటీ కాలేదు అంటున్నా ఎంతో కొంత డాలర్ ఆధిపత్యాన్ని గట్టిగానే ఎదుర్కుంటుంది అనేది కాదనలేని నిజం!

బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ని తేలికగా తీసుకుంటున్న వారు చైనా నుండి ప్రపంచ దేశాలు చేసుకుంటున్న దిగుమతులని మర్చిపోతున్నారు!

ఇక డోనాల్డ్ ట్రంప్ సగం బిజినెస్ మాన్ మరో సగం రాజకీయ నాయకుడు! ట్రంప్ ఆధ్వర్యంలో నిపుణులు వాస్తవాన్ని గ్రహించి అమెరికా విధిస్తున్న ఆంక్షల విషయంలో పట్టుదలకి పోకుండా సామరస్యంగా ఉంటే బ్రిక్స్ వైపు అత్యధిక దేశాలు వెళ్లవు!

కానీ అది సాధ్యమా?

సాధ్యమే! ముందు రష్యా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రష్యాకి ఇచ్చివేయాలి!ఇది కష్ట సాధ్యం!

ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ కలుగ చేసుకోకూడదు. ఇది సాధ్యమే!

చైనా విషయంలో కాస్త దూకుడు తగ్గించాలి. ఇప్పటికే ఈ విషయం మీద ఎలన్ మస్క్ ట్రంప్ తో చర్చించినట్లు తెలుస్తున్నది. Elan మస్క్ తన టెస్లా ప్లాంట్ చైనాలో ఉంది అనే విషయం ట్రంప్ దృష్టికి తెచ్చి దూకుడు వద్దని కోరినట్లుగా వార్త.

తులసి గబ్బార్డ్ కూడా చైనా విషయంలో గట్టిగా వెళ్ళవద్దనే చెప్పినట్లు వార్త.

కానీ రిపబ్లికన్స్ నుండి వచ్చే మాట కూడా వినాల్సి ఉంటుంది ట్రంప్. ఇదే ఛాలెంజ్ ట్రంప్ కి.

కానీ అతి పెద్ద ఛాలెంజ్ మాత్రం డీప్ స్టేట్ నుండే ఉండవచ్చు!

డీప్ స్టేట్ అంటే? ఆయుధ లాబీ, ఫార్మా లాబీ, వాల్ స్ట్రీట్ లాబీ, అమెరికన్ బాంక్ లాబీలు. వీళ్ళకి వ్యతిరేకంగా ఏ అమెరికా అధ్యక్షుడు సక్రమంగా పనిచేయలేడు.

అయితే బ్రిక్స్ పేమెంట్ విషయంలో భారత్ పాత్ర ఏమిటి?

Contd… part 4 ……. (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions