Shyla ………… సూర్యకాంతం, జమున, ఛాయాదేవి , విజయశాంతి, సుహాసిని, రాధిక, రాధ తదితర యాక్టర్ల ఫొటోలేస్తే సినిమా అరిగిపోద్దా మాస్టారు… మీ ఫ్యాన్ అండ్ ఏసీని కాబట్టే అడుగుతున్నా KV సాబ్…
నటనకి లింగభేదం వుందనా ఉద్దేశ్యం..?
లేదా టైటిల్స్ లో ఫొటువాలు పడ్డ నటులంతా సినిమా మూల పాత్రధారి రాఘవరావులాాగా అహంకారులు, తిరుగుబోతులు, తాగుబోతులు, హంతకులని వారి వరకే వేసారా?
Ads
కొందరివి అయితే multiple పిక్స్ .. ఆ వ్యవధిలో స్త్రీలవి కూడా వేయవచ్చు.. సమయాభావం అని అనకండి ప్లీజ్..
పోనీ ఒక మగ మహానటుడి కథను మగ నటుల వరకే పరిమితం చేశారు అనుకుందామంటే..
To be or not to be అనే లైన్స్ .. చావటమా బ్రతికుండటమా అని అంతర్మధన పడుతున్నట్టు చెప్పాల్సిన డైలాగ్స్ ని రాఘవరావు అరుస్తూ చెప్తుంటే అర్ధం అవుతుంది అతనేమీ తను అనుకునేంత తోపు నటుడు కాదని..
ఒక టిపికల్ narcissist ఆ రాఘవరావు .. clear pattern of gaslighting and projection!!
ఇకపోతే..
యాక్టింగ్ స్కూల్ లో మగ యాక్టర్ కి మాత్రమే ప్రశంసలు.. ఆ జుట్టు పీకించుకుని నేల మీద పడవేయబడి, వీపు మీద కాలుతో తొక్కించబడ్డ అమ్మాయికి ఒక కాంప్లిమెంటూ లేదు సదరు యాక్టింగ్ కోచ్ నుండి..
వివక్ష యాక్టింగ్ స్కూల్స్ లోనే మొదలు అని బాగా చూపించారు.. అదే టైటిల్స్ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది
మారదాం కాస్త…
Share this Article