Ashok Vemulapalli…………… “THE PRIEST”………. మలయాళ సినిమాల్లో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది ఎక్కడో స్టార్ట్ చేసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో ముగిస్తారు .. చూడగలిగితే ప్రతి సినిమాలోనూ కొత్త విషయం మన ఎంజాయ్ చేయొచ్చు.. అలాంటిదే ఈ సినిమా PRIEST..
తమ చావుకు కారణమైన వారిని వదిలి పెట్టకుండా ఆత్మలు తిరిగి వచ్చి రివెంజ్ తీర్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూస్తుంటాం కానీ కూడా అదే కోవకు చెందిన సినిమానే కానీ ఎన్నో ట్విస్టులతో చివరి వరకూ ఉత్కంఠ తో సినిమాని డైరెక్ట్ చేశారు..
లోకంలో దెయ్యాలుంటే బావుండనేవాళ్లలో నేనూ ఒకడిని .. ఇది విచిత్రంగా ఉంటుంది గానీ నిజం .. ఎందుకంటే .. ఒకరి చేతిలో అన్యాయానికి గురై ఎవరికీ చెప్పుకోలేక న్యాయం జరగక ఎవడివల్లో ప్రాణం పోతే .. ఆ రాక్షసుడికి శిక్ష పడేదెప్పుడు ?? ఇప్పుడున్న పొలిటికల్ సిస్టెం లో నిజంగా న్యాయం జరుగుతుందా ?? ఎక్కడ చూసినా అన్యాయమే కదా ?? నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలీదు .. అందుకే దెయ్యాలు కచ్చితంగా ఉండాల్సిందే .. చచ్చాక ఆత్మలై తిరిగొచ్చి అలాంటి దుర్మార్గుల్ని ఏరిపారేస్తే ఇంకొకడికి భయం వస్తుంది .. ఎలాగూ దేవుడంటే భయం పోయింది కదా .. కనీసం దెయ్యాలకైనా భయపడతారు .. దేవుడున్నాడని నమ్మేటప్పుడు దెయ్యాలున్నాయని కూడా నమ్మాల్సిందే కదా.. దేవుడున్నాడనే భక్తి దెయ్యాలున్నాయనే భయం ఉండబట్టే కాస్తో కూస్తో మనిషి కంట్రోల్ లో ఉంటున్నాడు అనిపిస్తుంది నాకు .. ఈ లాజిక్ అర్దమయితే ఓకే .. అర్దం కాకున్నా ఓకే ..
ఇంతటి భూత ప్రేత పిశాచ ఉపోద్ఘాతం ఎందుకంటే ప్రీస్ట్ సినిమాలో కంటెంట్ కూడా ఇదే .. తమని అన్యాయంగా చంపేసిన వారిని ఆత్మలా మారి వచ్చి చంపడమే సినిమా స్టోరీ .. ఇది రెగ్యులర్ గా అన్ని దెయ్యాల సినిమాల్లో ఉండే కాన్సెప్టే అయ్యుండొచ్చు .. కానీ ప్రీస్ట్ లో ఈ స్క్రీన్ ప్లే మరోలా ఉంటుంది.. సినిమా అంతా సీరియస్ గా సాగిపోతుంది .. అలాగని అతి భయంకర ముఖాలతో ఎక్కడా భయపెట్టడు దర్శకుడు .. Jofin T. Chacko
ఒక అనాధ చిన్న పాప చుట్టూ సినిమా స్టోరీ అంతా నడుస్తుంది.. స్టోరీ చెబితే చూడాలన్న ఇంట్రెస్ట్ పోతుంది.. కానీ పాప క్యారెక్టర్ లో బేబీ మౌనిక నటన అద్భుతమే .. ఒక చిన్న పాపతో ఇంత పెద్ద సినిమాని నడపొచ్చని అప్పట్లో మణిరత్నం అంజలి సినిమాతో మ్యాజిక్ చేశారు.. చాలా కాలం తర్వాత మౌనిక యాక్షన్ చూశాక అదే ఫీల్ కలుగుతుంది .. కాకపోతే రెండు జానర్లు వేర్వేరు .. రెండింటినీ పోల్చడానికి వీల్లేదు..
ఎక్కడో మొదలైన సినిమా ఎక్కడో ముగుస్తుంది.. మధ్యలో వచ్చే ట్విస్ట్ లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. బహుశా కొన్ని మనం ఊహించనివి ఉంటాయి .. అయినా ట్విస్ట్ అంటే అర్దమే అది కదా.. మమ్ముట్టిలాంటి స్టార్ నటుడితో కొత్త దర్శకుడు తన మొదటి సినిమా ఇంత బాగా తీస్తాడని ఎవరూ ఊహించరు .. రాహుల్ రాజ్ సౌండ్ ట్రాక్ భయపెట్టకుండా వినడానికి చాలా బావుంది
మమ్ముట్టి , మంజువారియర్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది .. ఇక నిఖిలావిమన్ పాత్ర చాలా కీలకమైంది.. ఈ అమ్మాయి మన అల్లరినరేశ్ తో కలిసి మేడమీద అబ్బాయి సినిమా చేసింది.. మొత్తం మీద సినిమా చాలా బావుంది.. అమెజాన్ ప్రైం లో సినిమా ఉంది …
Share this Article