Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా చానెల్ పై BRS దాడి, విధ్వంసం ఖండనీయం..!

June 28, 2025 by Rishi

మహా న్యూస్ చానెల్ పై brs శ్రేణుల దాడి దేశ పాత్రికేయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది…

ఒక ఉద్యమ పార్టీ, పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ జర్నలిజం పై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసానికి దిగడం ఆందోళనకరమే… ఈ చర్యపై జాతీయ స్థాయిలో మీడియా సర్కిల్స్ లో చర్చ మొదలైంది…

నిజానికి కేసీఆర్ పార్టీకి మీడియా పట్ల ఈ వైఖరి కొత్తేమీ కాదు… అధికారంలోకి వచ్చిన కొత్తలోనే నెగెటివ్ గా వెళ్ళే మీడియాను పాతేస్తాను అని హెచ్చరించడం దగ్గరి నుంచీ… బోలెడు
మీడియా మీట్లలో ఇబ్బందికరమైన ప్రశ్న వస్తే చాలు, ఏ పేపర్ నీది, ఇదేనా మీకు ఇచ్చిన ట్రైనింగ్, ఇదొక ప్రశ్నా అంటూ మాటల దాడి కేసీఆర్ నుంచే మొదలయ్యేది… బెదిరింపు స్వరం…

Ads

నెగెటివ్ గా వెళ్తున్నారని ఆంధ్రజ్యోతికి యాడ్స్ బంద్… మీడియా వాళ్ల ఫోన్లన్నీ ట్యాపింగ్… ఆ పార్టీ తన అసహనాన్ని ఎప్పుడూ దాచుకోలేదు…

చివరికి అధికారం పోయాక కూడా అదే ధోరణి… ఏదో ఫ్రస్ట్రేషన్ మీడియా మీద చూపడం… ఎవరెవరితోనో బూతులు తిట్టించి సీఎం రేవంత్ మీద ప్రసారాలు చేయించిన రేవతి మార్క్ యూ ట్యూబిజాన్ని జర్నలిజం అంటూ వాళ్లను వెనకేసుకుని రావడం అందర్నీ విస్తుగొలిపింది… సొంత సోషల్ మీడియా చానెల్స్, సైట్స్, ప్లాట్ ఫారాలలో ఒకరకంగా దాడి… కంచె గచ్చిబౌలి వివాదంలో AI ఇమేజెస్, క్రియేటెడ్ వీడియోస్ తో కాంపెయిన్ చూసిందే…

చివరికి సుప్రీం తీర్పు వచ్చినా హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ అప్పగించకుండా నాన్చి నాన్చి తొక్కిపెట్టడంతో ఇప్పుడు ఆ కేసు బిగుసుకుంది…

మహా టీవీ మీద దాడి పూర్తిగా అన్ డెమొక్రటిక్ … మరి ఆ టీవీ KTR మీద పిచ్చి కూతల ప్రసారాలు చేయడం తప్పు కాదా అనేది ఓ ప్రశ్న… ఖచ్చితంగా తప్పు… తప్పున్నర… దురుద్దేశపూరితం, ఆధారరహితం… డర్టీ జర్నలిజం…

అది అన్ని లైసెన్సులు ఉన్న సాటిలైట్ టీవీ… దానికి పరిమితులు ఉన్నాయి, ఉండాలి… అవి దాటితే రియాక్ట్ కావడానికి మార్గాలు బోలెడు… అది ఇంత రూడ్ గా ఉండక్కర్లేదు, ఉండకూడదు… అది పరిణత, ప్రజాస్వామిక ధోరణి మాత్రం అస్సలు కాదు…

అంతా అయిపోయాక, సంయమనం పాటిద్దాం అంటూ… తప్పు తనవైపు ఉంటే దీన్ని కూడా రేవంత్ పాలనకు ముడిపెట్టి కేటీఆర్ మాట్లాడడం విచిత్రం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త TRS vs కొత్త TRS -! పిల్ల పుట్టకముందే కుల్ల కుడితే ఇలాగే మరి!!
  • హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…
  • ఆదానీ పరుగుకు కేరళ కొత్త సీఎం బ్రేకులు! కాంగ్రెస్ మార్క్ ‘అడ్డు పుల్లలు’!
  • మీ ఇంట్లో ఓవెన్ ఉందా… అనడిగింది ఆమె ఆ బ్యాంకు మేనేజర్‌ను!
  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!
  • రావు బహదూర్‌పై కంప్లీట్ డిఫరెంట్ రివ్యూ! 3.5 గంటల Psychological Trauma…!
  • ALPHA – ఆ పాత్రకు ఆలియా అస్సలు నప్పలేదు – అదే మేజర్ మైనస్!!
  • ఒక చిరంజీవి – ఒక ప్రభాస్ – ఒక పవన్ కల్యాణ్ … ఒక మాధవీలత!!
  • ‘‘తింటే తిన్నారు – ఏ గుడిలో దొంగలు లేరు – ఇవన్నీ దొంగ ఏడుపులు సర్’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions