Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

BRS అర్థరహిత విమర్శలు..! ‘కార్బన్ క్రెడిట్స్’పై కుతంత్రం..!!

December 9, 2025 by M S R

.

ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కావడమే తరువాయి వికారాబాద్ నేవీ రాడార్ దగ్గర నుంచి మొదలైంది బీఆర్ఎస్ అటాక్.,. ఓ ఆరు నెలలు హనీమూన్ ఉంటుందనే సోయి కూడా లేదు…

నేవీ రాడార్‌తో ఈ భూగోళం మీద జీవజాతే అంతరిస్తుంది అన్నట్టుగా పింక్ క్యాంపు మొత్తుకోళ్లు… రాతలు, కూతలు… అసలు దానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందే బీఆర్ఎస్… అక్కడి నుంచి ఇక ప్రతి ఇష్యూలోనూ గాలి పోగేసి, టన్నుల కొద్దీ దుమ్ము, బురద జల్లడం, ఇక కడుక్కో అన్నట్టుగా… (సగటు జనానికి అర్థం కాని సంక్లిష్ట సబ్జెక్టులైతే మరీ రెచ్చిపోయి ఆ‘భూత కల్పనలు…)

Ads

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యతే… కానీ గతంలోని తన విధానాల నుంచి యూటర్న్ తీసుకుని, అప్పట్లో తామేదో ప్రజాస్వామికంగా పాలించినట్టుగా… బేస్‌‌లెస్ ఆరోపణలకు దిగడమే సమస్య… దానికి తగ్గట్టు పార్టీ సోషల్ మీడియా సరేసరి…

ఈ విషయంలో బీజేపీ కాస్త నయం… తన పొలిటికల్ లైన్‌ను బట్టి కొన్ని విషయాల్లోనే నిర్దిష్ట ఆరోపణలు చేస్తుంది… ఎటొచ్చీ బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషనే బాగా కనిపిస్తోంది… మరీ జుబిలీ హిల్స్ ఉపఎన్నికలో జనం వాళ్లను తిరస్కరించినా తమ ధోరణి మాత్రం మార్చుకోలేదు… ఉదాహరణకు నిన్నటి విమర్శ…

brs

హిల్ట్‌పి విధానంపై 5 లక్షల కుంభకోణం అని విమర్శించినట్టే ఇది కూడా… 12 వేల పంచాయతీల భూముల్ని అమ్మకానికి పెట్టారని నమస్తే తెలంగాణ బ్యానర్ కథనం… ఏందయ్యా అంటే, గ్రామకంఠం భూముల్లో చెట్లు పెంచడానికి ఢిల్లీలోని ఓ కంపెనీకి 30 ఏళ్ల లీజు ఇస్తున్నదట ప్రభుత్వం… అయిపోయింది, పల్లెల్ని అమ్మేస్తున్నారు అని గగ్గోలు…

తనే రాస్తుంది లీజు అని, మళ్లీ తనే రాస్తుంది అమ్మకం అని..! యథా బీఆర్ఎస్, తథా మైక్… ఏవేవో లెక్కలేసి, మసి పూసి… జస్ట్ 5 కోట్ల ఖర్చుతో 61,200 కోట్లు సంపాదిస్తుందట ఆ కంపెనీ… ఇదీ అడ్డగోలు లీజుకు ఔటర్ రింగ్ రోడ్డు ధారాదత్తం చేసినట్టు అనుకుందేమో పత్రిక… కార్బన్ క్రెడిట్స్ మీద అర్థజ్ఞానం గాకుండా అర్ధజ్ఞానం…

అసలు కార్బన్ క్రెడిట్స్ ఏమిటో చూద్దాం… చాలా పరిశ్రమలు, కంపెనీలు, ప్లాంట్లు వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ వంటి ఉద్గారాలను వదులుతూ ఉంటాయి కదా… కాలుష్యం ప్లస్ వేడిని పెంచి వాతావరణ స్థితిగతుల్నే మార్చేయడం ఇది… అందుకని క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది… కాస్త వివరంగా…



  • UNFCCC (United Nations Framework Convention on Climate Change) ఇది వాతావరణ మార్పులపై పోరాడటానికి ప్రపంచ ప్రయత్నాలకు ప్రాథమిక వేదిక… దీని ఆధ్వర్యంలోనే క్యోటో ప్రోటోకాల్ (Kyoto Protocol), పారిస్ ఒప్పందం (Paris Agreement) వంటి ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి…

    • క్యోటో ప్రోటోకాల్… అంతర్జాతీయంగా “ఎమిషన్స్ ట్రేడింగ్” (ఉద్గారాల వ్యాపారం) విధానాన్ని ప్రవేశపెట్టింది, దీని ద్వారా దేశాలు తమ ఉద్గార యూనిట్లను (కార్బన్ క్రెడిట్లకు సమానం) కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు…

telangana

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే… కర్బన ఉద్గారాలను వదిలే యూనిట్లు, ప్లాంట్లు, దేశాలు… తాము చేస్తున్న నష్టానికి విరుగుడుగా వాతావరణానికి మేలు చేసే గ్రీన్ ఎనర్జీ, చెట్ల పెంపకం వంటి చర్యల ఉపయోగాల్ని లెక్కకట్టి, దానికి కొంత సొమ్ము చెల్లించి, ఆ కార్బన్ క్రెడిట్స్ కొనుక్కుంటాయి… బ్యాలెన్స్ చేస్తాయి…

  • UNFCCC కింద ఏర్పాటు చేయబడిన యంత్రాంగాలు…: క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం (CDM – Clean Development Mechanism)… అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టుల ద్వారా ధృవీకరించబడిన ఉద్గార తగ్గింపులను (Certified Emission Reductions – CERs) ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది, వీటిని అభివృద్ధి చెందిన దేశాలు కొనుగోలు చేయవచ్చు…

  • International Carbon Action Partnership (ICAP)… ఇది వివిధ ప్రభుత్వాలు కార్బన్ ఉద్గారాల ట్రేడింగ్ సిస్టమ్స్ (ETS) రూపకల్పన, అమలు మరియు సమన్వయంపై సహకరించడానికి ఏర్పడిన అంతర్జాతీయ వేదిక…

  • ప్రపంచ బ్యాంక్ (World Bank)… ప్రపంచ బ్యాంక్ కార్బన్ ప్రైసింగ్ సాధనాలు, నివేదికలు, చొరవలను (Initiatives) ప్రోత్సహించడంలో పాలుపంచుకుంటుంది…

  • అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO)… అంతర్జాతీయ విమానయానం నుండి వచ్చే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి CORSIA (Carbon Offsetting and Reduction Scheme for International Aviation) అనే గ్లోబల్ పథకాన్ని అమలు చేస్తుంది…

కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం, జరిమానాలు

  • కార్బన్ క్రెడిట్ వ్యాపారం ప్రధానంగా “క్యాప్-అండ్-ట్రేడ్” (Cap-and-Trade) వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది… ఈ వ్యవస్థలో, ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థ మొత్తం ఉద్గారాలపై ఒక పరిమితి (Cap) విధిస్తుంది… మరియు కంపెనీలు/దేశాలకు ఉద్గార భత్యాలను (Allowances) కేటాయిస్తుంది…

  • తమ పరిమితి కంటే తక్కువ ఉద్గారాలను విడుదల చేసే సంస్థలు మిగులు క్రెడిట్స్  విక్రయించవచ్చు, ఎక్కువ ఉద్గారాలను విడుదల చేసే సంస్థలు వాటిని కొనుగోలు చేయవలసి ఉంటుంది…

  • కేటాయించిన పరిమితి కంటే ఎక్కువ ఉద్గారాలను విడుదల చేసినప్పటికీ, తగినన్ని క్రెడిట్లను సమర్పించడంలో విఫలమైన సంస్థలకు జరిమానాలు (Fines) విధించబడతాయి… ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్ ఎమిషన్స్ ట్రేడింగ్ స్కీమ్ (EU-ETS)లో ఈ జరిమానాల పద్ధతి ఉంది…



carbon credits

1) తెలంగాణ ప్రభుత్వం తమ విజన్ 2047 లో కార్బన్ క్రెడిట్స్ వ్యాపారాన్ని కూడా ప్రస్తావించింది… గ్రీన్ ఎనర్జీ, చెట్ల పెంపకం వంటి చర్యలతో కార్బన్ క్రెడిట్స్ అమ్ముకుని, ఆ లాభాన్ని, ఆ ప్రయోజనాన్ని రాష్ట్ర అభివృద్ధికి, మరీ పర్టిక్యులర్‌గా పల్లెలకే వినియోగించడం దాని ఉద్దేశం… (మైనింగు సీనరేజీ ఆదాయంలాగా)…

2) పల్లెల్లో చెట్ల పెంపకానికి, ప్రభుత్వ వృథా భూముల్ని లీజుకు ఇవ్వడం అంటే ధారాదత్తం చేయడం కాదు, అమ్మకం అసలే కాదు… గ్రీనరీ పెంచడం ద్వారా కార్బన్ క్రెడిట్స్‌ జనరేట్ చేసుకోవడం, ఆ ట్రేడింగ్‌తో వచ్చే డబ్బును ఆ కంపెనీ మాత్రమే అనుభవించదు… 60 వేల కోట్ల ఆదాయం అనేది మరీ అతిశయోక్తి… ప్రజలను తప్పుదోవ పట్టించే తతంగం… ఈ రంగంలో అనుభవమున్నవాళ్లకు తెలుసు ఆ సంగతి…

3) ఇందులో ఎవరి జేబుల్లోకీ డబ్బు వెళ్లదు… కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ యూనిట్లు, అమ్మకాన్ని బట్టి… వచ్చే సొమ్ము నిర్ణీత ఒప్పందాల్లో ఉన్నట్టుగా… కార్బన్ క్రెడిట్స్ కొనే దేశాలు, సంస్థలు ఆ చెల్లింపుల్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు జమచేస్తాయి… ఇది హవాలా కాదు, జీరో వ్యాపారం కూడా కాదు…

4) క్రెడిట్ విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో నిర్ణీత వాటా ప్రభుత్వానికి/స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలకు) దక్కుతుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంటుంది…



carbon credtis

మరింత స్పష్టత…: కార్బన్ క్రెడిట్స్ ప్రధానంగా రెండు రకాలు

  • నియంత్రిత మార్కెట్ (Compliance Market)…: ఇది UNFCCC వంటి అంతర్జాతీయ ఒప్పందాలు లేదా EU-ETS వంటి దేశీయ/ప్రాంతీయ చట్టాల ద్వారా తప్పనిసరి చేయబడినది. ఇక్కడ “క్యాప్-అండ్-ట్రేడ్” (Cap-and-Trade) పనిచేస్తుంది…

  • స్వచ్ఛంద మార్కెట్ (Voluntary Market)…: ఇక్కడ కంపెనీలు చట్టబద్ధంగా అవసరం లేకపోయినా, తమ స్వంత పర్యావరణ లక్ష్యాలను (CSR – Corporate Social Responsibility) చేరుకోవడానికి క్రెడిట్లను కొనుగోలు చేస్తాయి… చెట్ల పెంపకం (Forestry/Afforestation) ప్రాజెక్టుల ద్వారా వచ్చే క్రెడిట్స్ ప్రధానంగా ఈ మార్కెట్‌లోకి వస్తాయి…

  • తెలంగాణ ప్రాజెక్ట్ (గ్రామకంఠం భూముల్లో చెట్ల పెంపకం) అనేది స్వచ్ఛంద కార్బన్ మార్కెట్‌కు సంబంధించిన అంశం అయ్యే అవకాశం ఎక్కువ…. సో, బీఆర్ఎస్ క్యాంపు విమర్శలు కూడా ఓరకంగా కర్బన ఉద్గారాల్లాంటివే..!! గ్రామ‘కంఠాలకు’ ఇవే అసలు ‘ఉరితాళ్లు’...!!



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • BRS అర్థరహిత విమర్శలు..! ‘కార్బన్ క్రెడిట్స్’పై కుతంత్రం..!!
  • జస్ట్ ఓ మూస మాస్ మూవీ… ఒక హిట్ కాంబో వర్కవుట్ కాలేదు…
  • ఆర్నబ్‌తో టీడీపీ అనవసర కయ్యం… అది యెల్లో రిపబ్లిక్ టీవీ కాదు…
  • బాబూయ్… టీఎంసీ నేతలకు ప్రతిదీ గోకడమే అలవాటుగా ఉంది…
  • నాగబాబు ఇన్‌ఫ్లుయెన్స్ కనిపిస్తోంది… భరణి కెప్టెన్ అయిపోయాడు….
  • ఎవడికి ఏది చేతనైతే… అదే ప్రజాస్వామ్యం, అదే న్యాయం ఈ దేశంలో…
  • తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రమే మోడీ సాబ్… మరిచిపోయినట్టున్నవ్…
  • మమతా బెనర్జీ పార్టీ పునాదులకు పగుళ్లు… అచ్చంగా ‘SIR’ ఫలిస్తోందిలా…
  • రాజేంద్రప్రసాద్- చంద్రమోహన్… ఐనా కామెడీ జాడే లేని ఓ టైమ్‌ పాస్…
  • సొంత మంత్రిపై ఎన్టీఆర్ స్టింగ్ ఆపరేషన్… ఆ ఇంట్రస్టింగ్ కథ తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions