జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి సంభాషణల్ని ట్రాక్ చేసిన తీరు మీద జనంలో బాగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది కదా…చివరకు హీరోయిన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనికవర్గాల ఫోన్లనూ ట్యాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, లొంగదీసుకున్న ఉదంతాలూ బయటపడి తెలంగాణ జనానికి ఓరకమైన ఎలపరం కలుగుతోంది కదా… కేటీయార్ జస్ట్, సింపుల్‌గా ‘‘ఒకరిద్దరి లంగల ఫోన్లను ట్యాప్ చేసినారేమో, అదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా… జనం దృష్టిని మళ్లించడానికి ఇదే ప్రయత్నం’’ అని కొట్టిపారేశాడు… మరింత బాధ్యతారాహిత్యం… ఇలాంటి వ్యాఖ్యలతో మరింత నష్టం… ఊరుకున్నంత ఉత్తమం లేదనే సామెత బహుశా తను విని ఉండడు, అఫ్‌కోర్స్ వాళ్లకు ఇలాంటివి చెప్పేవాళ్లూ ఉండరు…బీఆర్ఎస్ చీకటి పాలన తాలూకు విధ్వంసాలు, కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి బాగోతాలు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నయ్… రేవంత్‌రెడ్డికి బహుశా ఈ ఐదేళ్లు తవ్వినా సరే కేసీయార్ బాపతు అక్రమాల్ని వెలికితీయడం పూర్తిగా సాధ్యం కాదేమో… తాజాగా CNRF చెక్కుల స్కాం… 5 వేల చెక్కులు కనిపించడం లేదట… హరీష్ మాజీ పీఏను అరెస్టు చేశారు… ఎవరికి అందినంత కాడికి వాళ్లు దండుకున్నారన్నమాట… అసలు చెక్కులు బయటివాళ్లు డ్రా చేసుకోవడం ఏమిటి..? చివరకు రోగులనూ వదల్లేదు…ఈడీలు, బీడీలు, మోడీలు ఏం పీక్కుంటారు అన్నారు కదా… ఏమైంది… తీహార్ జైలుకు చేరింది కథ… ఒకవైపు కోర్టు కస్టడీని ఆదేశించాక బయటికొస్తూ కవిత జై తెలంగాణ అని పిడికిలి బిగించి స్లోగన్ ఇవ్వడం అయితే మరీ బేకార్ స్పందన… అదేదో మద్యప్రవాహ ఉద్యమం తెలంగాణ కోసం చేస్తున్నట్టు… ఆమే ఏదో వీరపోరాటం చేస్తున్నట్టు… జనంలోకి ఫుల్లు నెగెటివ్‌గా వెళ్తున్నామనే సోయి లోపిస్తే ఎలా..?మేడిగడ్డ స్తంభాలు కూలిపోయి, లక్షన్నర కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైన వేళ దాన్ని మొదట్లో పీసా టవర్‌తో పోల్చి, రెండు మూడు స్థంభాలు కూలిపోతే ఇంత పంచాయితీయా..? రిపేర్ చేయించలేరా..? పైగా మొత్తం కూల్చేసే కుట్ర చేస్తోందంటూ గాయిగత్తరకు దిగారు… కేసీయార్ అయితే మేడిగడ్డా, బొందలగడ్డా అని మాట్లాడాడు… ఏం పీకనీకి మేడిగడ్డ పోతున్నరు అన్నాడు… దరిద్రమైన భాష… పదేళ్ల పాలన మొత్తం బూతులు, ఏతులే కదా… పైగా రేవంత్‌కు సంస్కారం లేదా, ఇదేం దురుసు భాష అంటాడు… ఆ మాటలు విని జనం నవ్వుకున్నారు…జస్ట్, ఇవి ఉదాహరణలు… ఎన్నికల్లో ఓడిపోయాక, ఒక్కొక్క భారీ అక్రమమే బయటపడుతూ జనం నివ్వెరపోతున్నవేళ… బీఆర్ఎస్ ముఖ్యుల స్పందన, మాటలు మరీ ఘోరంగా ఉంటున్నయ్… మీరలాగే ఉండండి, ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ మీ ఇంటిని ఖాళీ చేస్తారు… అదే జరుగుతోంది కూడా..!!
Share this Article