Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బంద్‌కు అందరూ సై… కానీ బీఆర్ఎస్ మద్దతులో నిజాయితీ ఎంత..?

October 17, 2025 by M S R

.

మొదట బీసీలకు స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యానికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన ఓ ద్రోహ విషయం చెప్పుకోవాలి… తరువాతే మిగతాది…

2018 డిసెంబర్‌లో, కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఎన్నికల కోసం 50 శాతం గరిష్ట పరిమితిని దృష్టిలో పెట్టుకునే కొన్ని సవరణలు చేశాడు… దీని ద్వారా షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) కోటాలు పోగా… ఇక వెనుకబడిన తరగతుల (BC)కు దక్కినవి 22 శాతం కూడా లేవు… నిజానికి సరైన లెక్కలు తీస్తే అదింకా తక్కువే… ఉజ్జాయింపుగా 34 శాతం నుంచి 22 శాతం లోపుకే పడిపోయాయి…

Ads

ఇప్పుడు జై బీసీ అంటున్న బీఆర్ఎస్ నేతలు అప్పుడు కేసీయార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు… అదీ హిపోక్రసీ… కానీ ఈ తగ్గింపుపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు, బీసీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.., ఇది బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించాయి…

తరువాత, తెలంగాణలో కొత్త ప్రభుత్వం (రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో (GO) జారీ చేసింది… విద్య, ఉపాధి రంగాల్లో ఈ 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9 లో చేర్చాలి… చేరిస్తేనే చట్టబద్దం, న్యాయసమీక్ష నుంచి మినహాయింపు…

కాంగ్రెస్ చట్టం చేసింది, ఢిల్లీలో ఆందోళన చేసింది… బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ కలిసిరాలేదు… రావు… ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ వస్తుందో అని..! మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు జీవో మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్లాడింది… కోర్టులు అదే 50 శాతం పరిమితి అంటున్నాయి… సరే, పార్టీపరంగా 42 శాతం అనే స్పూర్తితో ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం…

అంటే అనివార్యంగా బీజేపీ, బీఆర్ఎస్‌లను అటువైపు నెట్టేయడం.,. అంటే పరోక్షంగా 42 శాతం సాకారం కావడమే… చట్టబద్ధంగా కాదు, రాజకీయంగా… అదే స్పిరిట్‌తో..!! అంతేకాదు, ఈ రిజర్వేషన్ల చెల్లుబాటు కోరుతూ బీసీ సంఘాలు ఇస్తున్న రాష్ట్ర బంద్‌కు కూడా కాంగ్రెస్ మద్దతు పలికింది… 42 శాతం అనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పింది…

బీజేపీ ఏమీ మాట్లాడదు… తన స్టాండ్ ఏమిటో కూడా సరిగ్గా జనానికి వివరించేవాళ్లు లేరు… కాకపోతే బీజేపీలోనే ఉన్న బీసీ కృష్ణయ్య వంటి నేతలు ప్రస్తుత ఆందోళనల్లో చురుకుగా ఉన్నారు… ఈటెల మద్దతు ప్రకటన… మరి గతంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన బీఆర్ఎస్..?

మేము సైతం బీసీ ఆందోళనలకు మద్దతు అంటోంది… అవును, కాదంటే బీసీల్లో మరింత ఛీత్కారం తప్పదు కాబట్టి..! కానీ బీఆర్ఎస్ పొలిటికల్ స్టాండ్ గందరగోళం, జనాన్ని మభ్యపెట్టేదిగా ఎందుకు ఉన్నదంటే..? బంద్ మద్దతు విషయంలోనూ వాళ్ల సిన్సియారిటీ లేదు… ఓ మిత్రుడి విశ్లేషణ ఏమిటంటే..?

‘‘ఇదే కేసీఆర్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు… ఇప్పుడు బంద్‌కు జై అంటారు, హిపోక్రసీ… బీసీ కృష్ణయ్యను కేవలం బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప, నిజమైన బీసీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి కాదు…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను నిలబెట్టింది… నవీన్ యాదవ్ తండ్రి కేసీఆర్ కుటుంబంలో ఓ వివాహానికి ఆర్థిక సహాయం చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన్ను నిరంతరం లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శ ఉంది…

బలమైన బీసీ నాయకుడైన ఈటల రాజేందర్‌ను కోవిడ్ ఉచ్ఛస్థితిలో ఆరోగ్య మంత్రి పదవి నుండి తొలగించి, అవమానించి, ఆ స్థానాన్ని హరీశ్ రావుకు కట్టబెట్టడానికి బీఆర్‌ఎస్ (గతంలో టీఆర్‌ఎస్) వెనుకాడలేదు… ఇది బీసీ నేతను బలిదానం చేయడమే…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తీన్మార్ మల్లన్నతో సహా పలువురు బీసీ నాయకులను జైల్లో పెట్టింది ఆ ప్రభుత్వం… బీఆర్‌ఎస్ పార్టీలో బీసీ నాయకులను సంక్షేమ పథకాల రిబ్బన్ కటింగ్‌లకే పరిమితం చేశారు తప్ప పాలసీ నిర్ణయాల విషయంలో వారికి ఏ స్థానమూ దక్కలేదు… బీసీ బంధు వంటి పథకాలు కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చినవే…

పదేళ్ల పాటు సంపూర్ణ అధికారంతో పాలించినా, జాతీయ స్థాయిలో బీసీ కులగణన (BC Census) కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషి లేదు… ఈ అంశాలన్నీ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ వర్గాల వాస్తవ సాధికారత, రాజకీయ ప్రాధాన్యత గురించి చర్చకు దారితీస్తున్నాయి… అంతేకాదు, బీఆర్ఎస్ వంటి పార్టీల బీసీ నినాదంలోని నిజాయితీని కూడా ప్రశ్నిస్తున్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వై ఓన్లీ హిమాంశు…? వై నాట్ ఆదిత్య…? కాచుకో కేటీయార్… నెక్స్ట్ తరమూ రెడీ…
  • జూనియర్… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది, ఇదేం కక్కుర్తి..?!
  • ఒకరు యోగి సిస్టర్, మరొకరు మోడీ సిస్టర్… ఈ ఫోటో చెప్పే నీతి ఏమనగా..!!
  • ముద్దాయిల సంస్కరణ సగటు తెలుగు సినిమా తీసినంత వీజీయా…!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • నా చిన్నప్పటి ప్రియురాలు ఆమె… ఈరోజుకూ కలలోకి వచ్చి పలకరిస్తుంది…
  • KCR పాలనలో లక్ష మంది బోగస్ ఉద్యోగులు… వేల కోట్ల ప్రజాధనం గోవిందా…
  • కన్నుమూసి అప్పుడే 39 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!
  • తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!
  • కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions