Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

BRS Hereditary heir KTR only – ఈ పార్టీ కేసీయార్ సొంత కుటుంబ ఆస్తి !!

July 24, 2026 by M S R

.

ఈరోజు అన్ని పత్రికల్లోనూ కేటీయార్ జన్మదిన అభినందనల ప్రకటనలు… భారీ ఖర్చు… అబ్బే, విద్యార్థుల నీట్ అందోళనలు, ఎల్‌నీనో కరువు కాలం నేపథ్యంలో నేను జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం లేదు, నో అట్టహాసమ్స్, నో ఆడంబరమ్స్, నో వేడుకల్స్ అని కేటీయార్ ప్రకటించాడు… చూశారా, నాకెంత సమయజ్ఞత ఉందో అని ఫోకస్…

అంతేకాదు, విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా ఏదో ర్యాలీ కూడా తలపెట్టాడు… అన్నీ కలిపి తన ఇమేజ్‌ను బాగా ఎత్తడం కోసం భలే వ్యూహరచన.., తప్పులేదు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం, బీఆర్ఎస్‌లో అత్యంత సహజం…

Ads

ఈరోజు ఎంత హడావుడి అంటే… ఫాఫం, అంతటి కేసీయార్‌కు కూడా ఈ రేంజ్ అట్టహాసపు అభినందనలు దక్కలేదేమో గతంలో తన సొంత పార్టీ వైపు నుంచి! ఇదొక విరోదాభాసం… వద్దు, వద్దు, ప్లీజ్, అస్సలు వద్దు అంటూనే దండలు వేయించుకునే పారడాక్స్ ధోరణి…

ఇవన్నీ ఒకెత్తు… పాపం, హరీష్ రావు జన్మదినాన ఈ హడావుడిలో వన్ పర్సెంట్ ఎందుకు లేదు..? అసలు పార్టీకి ట్రబుల్ షూటర్, మెయిన్ అసెట్, పెద్ద ప్రాపర్టీ అని చెబుతూనే తన బర్త్ డేను ఏమాత్రం ఎందుకు పట్టించుకోలేదు పార్టీ..? ఈ చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిళ్లలో… కామన్ మ్యాన్‌లో కూడా…

ప్రతి అంశానికీ హరీష్ రావు కావాలి, కానీ వారసత్వం అనేసరికి… వారసుడే బాసు, ఫాలోయర్ ఆల్వేస్ ఫాలోయర్ ఓన్లీ… ఎస్, ఇవన్నీ గమనించే కవిత బయటికి వెళ్లిపోయింది, ఈ నెత్తుటి మగ వారసత్వాన్ని ధిక్కరిస్తూ… ఆ కేసీయార్ ధోరణిని ఛీత్కరిస్తూ… ఎస్, కేసీయార్, బీఆర్ఎస్ వారసుడు కేటీయారే… హరీష్ రావు పాపం ఇంకేమైనా ఎక్కువ ఆశిస్తే… అది అత్యాశ, పేరాశ, దురాశ మాత్రమే అని ఈరోజు కేటీయార్ బర్త్ డే హడావుడి చాటిచెబుతోంది… స్పష్టంగా, హరీష్ రావు అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు కదా…

తనకూ టైమ్ వస్తుంది… అది వచ్చేవరకు పెద్ద దొరకు, చిన్న దొరకు విధేయత ప్రకటిస్తూనే ఉంటుంది… రాజకీయాల్లో ఇవన్నీ సహజమే… తనూ ఓ రాజకీయ నాయకుడే, సీనియరే, తనకూ పొలిటికల్ యాంబిషన్స్ ఉంటాయి, నిజమే… కానీ ఆ టైమ్ తన్నుకురావాలి, అదీ అసలు సంగతి!

హరీష్ రావు మీద మోదీ కన్నుందనేదీ నిజమే… బీఆర్ఎస్‌తో పొత్తు సరే గానీ హరీష్ రావును పార్టీలోకి తీసుకోవద్దని ‘భావి బీజేపీ ముఖ్యమంత్రులు’ కోరుతున్నదీ నిజమే… తెలంగాణ రాజకీయాలు రాను రాను చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి సుమా!!

brs Hereditary heir ktr only… అది కుటుంబ పార్టీ, వ్యక్తి పార్టీ, పార్టీ కూడా సొంత కుటుంబ ఆస్తి… ఆ ఆస్తికి మగ నెత్తుటి వారసులే అసలు వారసులు… ఈ కథనం చెప్పే అంతిమ సత్యం ఇదే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • BRS Hereditary heir KTR only – ఈ పార్టీ కేసీయార్ సొంత కుటుంబ ఆస్తి !!
  • అదే గ్లోబరీనా! – కీలెరిగి వాత పెట్టడంలో రేవంత్ తరువాతే ఎవరైనా?
  • ‘యంగెస్ట్- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ’ బుడ్డోడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కాదు… ఎందుకు..?
  • మరక మంచిదే… ఇదీ ఓ పాఠం… ఆదమరిస్తే మరింత ప్రమాదం…
  • నీట్ ఒక్కటే కాదు ! అసలు వైద్య విద్య సమస్యల లోతుల్లోకి వెళ్లేవారేరీ !
  • రూమ్ రెంటుకూ తిప్పలు పడే స్థితి నుంచి… జాతీయ అవార్డు గ్రహీత దాకా…
  • మోదీ ప్రతిష్ట నానాటికీ పలుచన – బీజేపీకి ఇవన్నీ అశుభ సూచికలే !
  • అక్షరసత్యం ! “ఇండస్ట్రీని పెంట పెంట చేసి పడేశారు”..!
  • వితండ- తొండి వాదన ! మళ్లీ మళ్లీ కేసీయార్ అదే శుష్కవాదం !
  • Sorry Vijay, You Failed – టీవీకే పార్టీ బ్లాక్ బస్టర్… జననాయకన్ డిజాస్టర్..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions