.
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, ఉల్టా మనకే తాకింది… అని బీఆర్ఎస్ క్యాంపు విషాదగీతం పాడుకుంటోంది… రేవంత్ రెడ్డి సర్కారును బదనాం చేయడానికి పక్కాగా ఫామ్‌హౌజులోనే స్కెచ్ వేసి, అసెంబ్లీ ఎంట్రీ దాకా అనుకున్నట్టే అమలు చేశారు గులాబీ నేతలు, కానీ హఠాత్తుగా పరిస్థితులు ఎదురు తిరిగి, ఫుల్ డిఫెన్సులో పడిపోయి, తామే బదనాం అయిపోయి, అదనంగా దళిత వ్యతిరేకత అనే ముద్ర పడింది…
కేసీయార్ నోటి వెంట మాటలేదు ఇప్పటికీ ! దళిత స్పీకర్‌కు క్షమాపణ చెప్పడానికి దొరతనం అడ్డు వస్తున్నదేమో బహశా ! వేసిన స్కెచ్ ఏమిటి..? ప్లకార్డులు, జెండాలు, బ్యానర్లు, నిరసన ప్రదర్శన సామగ్రిని సభలోకి ఎలాగూ తీసుకురానివ్వరు, సో, నల్ల డ్రెస్సులపై నినాదాలు ముద్రింపచేశారు… చట్టసభ అంటే ధర్నాచౌక్ కాదు కదా…
Ads

టెన్షన్ క్రియేట్ చేయాలి, చేస్తే పోలీసులు ఊరుకోరు, దాంతో రేవంత్ రెడ్డి దౌర్జన్యం పేరిట గాయిగత్తర లేపాలని, మీడియాలో ప్రచార మైలేజీ రావాలని భావించారేమో… చివరకు పాపం సునీత, సబితలను కూడా ఇన్వాల్వ్ చేశారు…
హరీష్ టీషర్టు విప్పేసి పోలీసుల మీదకు విసిరేయడం, ఒకరిద్దరు పోలీసులపై కేటీయార్, నవీన్, మరొకరు దురుసుగా వ్యవహరించడం… జుట్లు పట్టారు, ప్యాంట్లు పీకారు, తొక్కారు, గుద్దారు వంటి వామ్మో వాయ్యో బాపతు కేకల దాకా బాగానే జరిగింది అనుకున్నట్టుగానే… ఉద్రిక్తతలు పెంచే వాగ్వాదాలు అసలు ప్లాన్… అన్నీ ప్లాన్ ప్రకారమే అప్పటికప్పుడు తెలంగాణభవన్‌లో చికిత్సలు, ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా ఊకదంపుడు సాగాయి…

కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ల-కొడుకు అని దూషించాడో కథ అడ్డం తిరిగింది… తను కేసీయార్ ప్లాన్‌కు తన వ్యాఖ్యలతో నిప్పుపెట్టాడు ఒకరకంగా… సో, రేవంత్ రెడ్డిలోని రాజకీయ నాయకుడు వెంటనే చాన్స్ అందుకున్నాడు… సభలో చర్చ… స్పీకర్ కంటతడి… సీతక్క ఎమోషనల్ స్పీచ్ చకచకా జరిగిపోెయాయి… బీఆర్ఎస్ గుప్తస్నేహిత బీజేపీకి కూడా ఖండించకతప్పలేదు…
కేసీయార్ ఎలాగూ సారీ చెప్పడు, తన దళిత వ్యతిరేక నైజం అంగీకరించదు, కేటీయార్ ఏదో కవరింగుకు ప్రయత్నించాడు, కుదరలేదు… ఇప్పుడిక సర్కారు యాక్షన్ స్టార్ట్.., నవీన్, మధులపై కేసులు నమోదు, అరెస్టులు… అంతేకాదు, బర్తరఫ్ తీర్మానాలు చేస్తారు… ఇంకొందరిపైనా యాక్షన్ ఉంటుంది…

ఇదంతా ఎటు దారితీసింది..? పక్కాగా బీఆర్ఎస్ పార్టీపైన దళిత వ్యతిరేక ముద్రకు దారితీసింది… ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నది అందుకే… బర్తరఫ్ అన్యాయం అని బీఆర్ఎస్ నోరువిప్పడానికి కూడా చాన్స్ లేదు, ఎందుకంటే, కేసీయార్ క్షమాపణ చెప్పాలి. చెప్పడు… గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించిన ఉదాహరణ ఉందిగా, సో, కాంగ్రెస్ యాక్షన్‌ను విమర్శించలేరు…
ఇవన్నీ ఎందుకు..? హుందా రాజకీయాలు నడపొచ్చుకదా అంటారా..? అమాయకపు ప్రశ్న… భలేవారే, అలా నడిపితే అది కేసీయార్ నాయకత్వం అని ఎందుకు అనిపించుకుంటుంది..? ఊరుకుంటే తను రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు..?!
Share this Article