.
Mani Bhushan …….. కవిత ఎపిసోడ్-1 : భిన్న కోణంలో…
ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేని ఏకాకి.
కవిత జోషుకి, జోరుకి తట్టుకోలేని వర్గాలు మొదటి నుంచీ ఆమెను టార్గెట్ చేసుకున్నాయి.
లిక్కర్ స్కాం అనుకోని వరంలా దక్కేటప్పటికి మొత్తం పరాజయ భారం ఆమెపై నెట్టేశారు.
ఇలాంటి సందర్భాలు మరే రాష్ట్రంలోనైనా ఎదురైతే ఇలాగే పార్టీ, ఫ్యామిలీ డీల్ చేస్తాయా! గతంలో ఇటువంటి సమయాల్లో ఆయా పార్టీలు ఎలా వ్యవహరించాయి?
పొరుగున ఉన్న తమిళనాడులో కనిమొళికి, ఏపిలో జగన్మోహన్ రెడ్డికి దక్కిన ఫ్యామిలీ సపోర్టులో చారాణా మందం కవితకు లభించిందా!
Ads
కవిత అరెస్టయితే తండ్రి కెసిఆర్ ఇల్లు కదల్లేదు...
కనిమొళి విషయంలో సవతి అన్నలు సహా కుటుంబమంతా వెనక నిలిచింది. కనిమొళిని ఆమె పార్టీ DMK సమర్ధించిన UPA ప్రభుత్వమే అరెస్ట్ చేయించింది. 2G స్కాం, కలైంజర్ టివి స్కాం పేరుతో సుమారు ఆరు నెలలపాటు కనిమొళి తీహార్ జైలులో గడిపారు. 2G స్పెక్ట్రమ్ అమ్మకంలో రూ.200 కోట్ల పై చిలుకు లంచాలు తీసుకుని, పెద్దమ్మ దయాళ్ (సవతి తల్లి)తో కలిసి కలైంజర్ టివి స్థాపించారన్నది కనిమొళిపై ఆరోపణ. బెయిల్ సైతం రాలేదు.
ఈ మొత్తం వ్యవహారంలో DMK శ్రేణులు ఎక్కడా నోరు జారలేదు.
- స్వయానా కరుణానిధి – అప్పటికే 88 ఏళ్ల వయోభారంతో అనారోగ్యంతో వీల్ చైరుకి పరిమితమైనప్పటికీ- ఒకటికి రెండుమార్లు ఢిల్లీ వెళ్లి జైలులో కూతురిని, ఇవే కేసుల్లో అరెస్టయిన ఇతర డిఎంకె ఎంపి రాజాని కూడా పరామర్శించారు.
సోనియా గాంధీని కలిసి మాట్లాడారు. కనిమొళి తల్లి రాజాత్తి (కరుణ మూడో భార్య), రెండో భార్య కొడుకు అళగిరి కూడా కరుణానిధి వెంట జైలుకెళ్లి పరామర్శించారు.
ఆ స్కాంలన్నీ దరిమిలా కొట్టేశారు.
కరుణానిధి 2018లో చనిపోయారు. స్టాలిన్ తన సవతి చెల్లెలిని గాలికి వదిలేయలేదు. తూత్తుకుడి (Thoothukkudi) నుంచి రెండుసార్లు (2019, 2024) టికెట్టిచ్చి గెలిపించి లోకసభకు పంపారు. ఇక, YSR CP అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అతని కుటుంబం ఎంతగా వెనకేసుకొచ్చిందో, తోబుట్టువు షర్మిల రేయింబవళ్లు తిరిగి ఎలా అండగా నిలిచిందో కొత్తగా చెప్పనక్కర లేదు.
.
ఇక్కడ కవిత విషయానికొచ్చేసరికి మొత్తం ఉల్టా నడుస్తోంది. సందుకొక చానల్, వీధికొక E-paper నడుస్తున్నందువల్ల ఎడాపెడా కవితను మాటలతో కుమ్మేస్తున్నారు! ఎక్కడివరకు పోయారంటే… హరీశ్ రావు తమ్ముడితో నిశ్చితార్థం జరిగి రద్దయిందని, కవితలో ఆ అవమానం రగులుతోందని చెబుతున్నారు! అదెప్పుడో పాతికేళ్ల క్రితం నాటి ఊసు. కవితకు 2003లో దేవనపల్లి అనిల్ కుమారుతో పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు.
తండ్రి కెసిఆర్, అన్న కెటిఆర్ touch me notగా ఉండేసరికి… పార్టీ వర్గాలు taken grantedగా anti-Kavita propaganda ఉధృతం చేశారు. కొన్ని పోస్టులైతే మరీ నీచస్థాయిలో ఉంటున్నాయి.
కవిత తప్పు చేస్తే, లిక్కర్ వగైరా స్కాంలల్లో ఆమెను గిల్టీగా నిర్ధారించాల్సిన వ్యవస్థలు వేరు. దర్యాప్తు సంస్థలున్నాయి, వాటి నివేదికలు, ఛార్జిషీట్ల ఆధారంగా దండించడానికి జ్యూడీషియరీ సిస్టమ్ ఉంది. ఛానళ్లలో డిస్కషన్ల ద్వారానో, సోషల్ మీడియాలో కథనాల ద్వారానో తీర్పులు వెలువడవు. అవి అసలు ఏ రకంగానూ, ఏ విధంగానూ వ్యవస్థల్ని ప్రభావితం చేయలేవు…
- (కవితక్కఅప్‌డేట్స్ పేరిట కవిత మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రారంభించారు… హరీష్ రావు, సంతోష్‌ల మీద ఆమే స్వయంగా మీడియా మీట్‌లో ఆరోపణల్ని సంధించిన సంగతి తెలిసిందే…)
Share this Article