.
సూపర్ కేటీఆర్… పార్టీ పగ్గాలు పూర్తిగా చేపట్టి, కేసీయార్‌ను ఆ ఫామ్ హౌజుకే పరిమితం చేసి, నువ్వే చక్రాలు తిప్పుతున్నందుకు కంగ్రాట్స్… జనం యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదానేది వేరే సంగతి…
ఎందరు వారస హీరోలను ఈ తెలుగు సమాజం అంగీకరించలేదు… సో, వో బాత్ ఛోడ్ దే… అసలు రైతుల ఆత్మహత్యల మీద పార్టీ నాయకులతో కమిటీ వేశావు చూడూ… అల్టిమేట్… మీ రైతు ప్రేమకు హేట్సాఫ్…
Ads
ఎస్… మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా… మన కేసీయార్ పదేళ్లు పాలించాక కూడా ఎందుకు బంగారు తెలంగాణ రాలేదో, ఇంకా రైతులు ఎందుకు ఉరిపోసుకుంటున్నారో జనానికి తెలియాలి… మీ పార్టీ కమిటీ ఆ నిజాలన్నీ వెలికితీయాలి…
వోట్ల కోసం రైతు బంధు… అసలు రైతు అంటే నిర్వచనం తెలియకుండానే… మైనింగ్ భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, వేల కోట్ల ధనికులకు కూడా ఈ రైతు బంధు ఎందుకు వర్తించిందో కూడా చెప్పాలి… అదెందుకు పదేళ్ల తరువాత కూడా రైతులను నిలబెట్టలేకపోయిందో నిజాలు బయటికి రావాలి…
చస్తే, 5 లక్షలు ఆటోమేటిక్‌గా వచ్చేలా ఓ రైతు బీమా పథకం… గుడ్… కానీ అసలు ప్రాణాల్ని పణంగా పెట్టి సాగు చేసేది కౌలు రైతు కదా… మరి పదేళ్ల స్వర్ణ తెలంగాణ హయాంలో కౌలుదార్లను అసలు రైతులుగా గుర్తించని అజ్ఞానం మీద కూడా ఈ బీఆర్ఎస్ కమిటీ ఫోకస్ చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి… అది బహిరంగం చేయాలి…
పంట బీమా వైఫల్యాలు, అదనపు బోనస్ ప్రైస్ వంటి అనేకానేక అంశాలు కూడా చర్చకు వస్తే బాగుండు… ఒక్క రేవంత్ రెడ్డి ఏడాది పాలననే ప్రామాణికంగా తీసుకోవడం వేస్ట్… రేవంత్ రెడ్డి ఏదో ఉద్దరిస్తాడనే నమ్మకంతో ఎవరూ వోట్లు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి… రాహుల్ గాంధీ నాయకత్వం ఏపాటి డొల్లో అందరికీ తెలుసు… కాకపోతే మళ్లీ కేసీయార్ రావద్దు అధికారంలోకి… అదేకదా కాంగ్రెస్‌ను గద్దెనెక్కించింది…
ఈరోజుకూ రేవంత్ రెడ్డి తాలూకు ఒక్క పాజిటివ్ ముద్ర లేదు పాలనలో… అదీ రిపోర్ట్ చేయడమే కాదు…
మన బీఆర్ఎస్ పార్టీ ఆత్మశోధన లేక, దిద్దుబాట్లు లేక… ఇంకా ఇంకా జస్ట్, పొలిటికల్ ఫ్రేమ్‌లోనే, ఆత్మవంచన బాటలోనే పరుగులు ఎందుకు తీస్తున్నదో కూడా పార్టీ కమిటీ రిపోర్ట్ చేయాలి… అవసరం, తెలంగాణ సమాజానికి అవసరం… గుడ్డిగా కేసీయార్‌ను నమ్మి ఎలా రైతాంగం నష్టపోయిందో కూడా ఓ రిపోర్ట్ అవసరం…
కౌలు రైతుల ఉసురు ఎలా తగిలిందో సవివరంగా పేర్కొంటూనే… చేతనైతే రేవంత్ రెడ్డి ఈ దిద్దుబాట్లు చేపట్టి, పాత కేసీయార్ తాలూకు తప్పిదాలను ఎలా సవరించాలో కూడా మీ పార్టీ పొలిటికల్ డ్రామా కమిటీలు కాదు, ఏదైనా కోర్టు ఓ థర్డ్ పార్టీ ఎంక్వయిరీ కమిటీ ఏర్పాటు చేస్తే ఎంత బాగుండు..!? తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం రాలిన మట్టిపూల సంఖ్య ఎంతో నమస్తే తెలంగాణ ప్రచురించే రోజు వస్తే ఎంత బాగుండు..!?
Share this Article