Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కాళేశ్వర కదనం దేనికి..? కదం, కవాతు దేనికి..? బీఆర్ఎస్ రాంగ్ స్ట్రాటజీ..!!

July 7, 2025 by M S R

.

అతడు సినిమా… నువ్వు ఊఁ అను, రేపీపాటికి బొక్కలు విరిచి, మొక్కలకు ఎరువుగా వేస్తాను అంటుంటాడు తనికెళ్ల భరణి కొడుకు పాత్రధారి… ‘‘ఎల్లుండి నూకాలమ్మ జాతర, వాడు గుడికొస్తాడు, వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటయ్… తప్పించుకున్నాడనుకో…

చుక్కల గుడి దగ్గర ఇంకో మూడు సుమోలు ఉంటయ్… ఇక్కడా మిస్సయ్యాడనుకో… సరుగుడు తోపు చివరలో ఈసారి అయిదు సుమోలు ఉంటయ్…’’ అంటుంటాడు… భరణి నోరు తెరిచి, అన్ని బళ్లెందుకురా, మర్డర్ చేయాలంటే కత్తులుండాలి గానీ క్వాలిసులు, సుమోలు దేనికిరా బుజ్జీ…

Ads

రేయ్, జింకను వేటాడేప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా..? అట్టాంటిది మరి పులినే వేటాడాలంటే  మనం ఎంత ఓపికగా ఉండాలి..?’’ అని వారిస్తుంటాడు… ఈ సీన్ ఎందుకు గుర్తొచ్చిందీ అంటే..? కన్నెపల్లి పంపుల్ని ప్రభుత్వం ఆన్ చేయకపోతే లక్షలాది కర్షకులతో మేమే వెళ్లి మోటార్లు ఆన్ చేస్తాం అని హరీష్ రావు బెదిరించిన వార్త చదివాక…

మోటార్లు ఆన్ చేయడానికి లక్షలాది మంది కర్షకులు దేనికి..? నలుగురు సానుకూల విలేఖర్లు, సొంత విలేఖర్లు, కేసీయార్, హరీశ్ రావు, ఆ ప్రాంత బీఆర్ఎస్ నేతలు నలుగురు చాలదా..? మరెందుకు ఈ హెచ్చరికలు..? ఇదీ తెలంగాణ సమాజంలో చర్చనీయాంశం…



brs

  • ఎందుకంటే..? కాలేశ్వరం అక్రమాలపై విచారణ జరుగుతోంది కాబట్టి… బోలెడు మంది బాధ్యులైన అధికార్లు, ఇంజనీర్లపైనా చర్యలు ఉండబోతున్నయ్ కాబట్టి… సాక్షాత్తూ కేసీయారే విచారణకు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి…ఇంకా ఇంకా కాలేశ్వరం మీద తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతూ లక్ష కోట్ల ప్రజాధన వినియోగంపై బీఆర్ఎస్, కేసీయార్ మీద చర్చలు సాగుతూనే ఉన్నయ్ కాబట్టి… కాలేశ్వరం కథను దిశ మళ్లించి… రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఏదో ద్రోహం చేస్తోందని గాయిగత్తర లేపి, జనం కళ్లకు గంతలు కట్టాలి కాబట్టి..!

నిజానికి ఇది రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ… అసలు ప్రజాజీవితంలోనే లేని కేసీయార్ స్వయంగా కదనం, కదం అంటే జనం ఇప్పుడప్పుడే నమ్మరు గానీ… లక్షల జనంతో కవాతు అని హడావుడి చేస్తే ప్రభుత్వం ఊరుకోదు, బీఆర్ఎస్‌కు ప్రచారం వస్తుంది గానీ, కాలేశ్వరం అక్రమాల మీద మరింత బలమైన చర్చ జరిగి బీఆర్ఎస్‌కే నష్టం… ఈ లాజిక్ హరీశ్ రావు ఎందుకు మిస్సయినట్టు..?

kannepalli

ఆయనకు ఓ వార్త గుర్తు చేయాలనుకుంటున్నా… మూడేళ్ల క్రితం కావచ్చు… ఇప్పుడు లక్షల మందితో వెళ్లి స్టార్టర్లు ఆన్ చేస్తా అంటున్నాడు కదా… ఆ కన్నెపల్లి పంపు హౌజు వరదల్లో మొత్తం మునిగిపోయింది… అసలు ఆ పాయింట ఎంపికే తప్పు అట… 29 బాహుబలి మోటార్లు, కంట్రోల్ ప్యానెళ్లు మటాష్ ఆరోజు… కాలేశ్వరం మీద ఆహాఓహో రాతలు రాయించినప్పుడే ఈ పంపు హౌజ్‌నూ ఆకాశానికెత్తారు అప్పట్లో… తీరా చూస్తే, పంపు హౌజ్ మునక… ఇప్పటికీ అది డేంజర్ జోనే…

తరువాత మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల ప్రమాదస్థితి… మరి ఈ పంపులు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయడం వల్ల ఫాయిదా ఏమిటి..? అవెలా రిపేర్ చేయాలో కేంద్ర సంస్థలకే అంతుబట్టడం లేదు… కేసీయార్ దయతో బాగుపడ్డ ఎల్‌అండ్‌టీ సంస్థ తోకజాడిస్తోంది… పైగా కేసీయార్ హయాంలోనే దాదాపు 170 టీఎంసీలను లిఫ్ట్ చేసి, ఎల్లంపల్లి నుంచి మళ్లీ 45 టీఎంసీల వరకూ సముద్రంలోకి వృథాగా వదిలేసిన ఉదంతమూ గుర్తొచ్చింది… ఎందుకూ అంటే..? అనాలోచితంగా నీటిని లిఫ్ట్ చేయవద్దు అని చెప్పడానికి..!

సరే, నీటిని ఎప్పుడు లిఫ్ట్ చేయాలి, ఏమేరకు ఎలా వాడాలో చెప్పడానికి ప్రతి ప్రాజెక్టుకూ వాటర్ స్టోరేజీ, వాటర్ రిలీజ్ ప్రోటోకాల్స్ ఉంటాయి… డ్యామ్ సేఫ్టీ లెక్కలుంటయ్… దీనికే కాదు, హరీశ్ రావు చెబుతున్న కల్వకుర్తి లిఫ్టుకూ ఇది వర్తిస్తుంది… జూలై చివరలో గానీ, ఆగస్టులో గానీ అక్కడ ఆన్ చేస్తారు… ఉత్తమకుమార్‌రెడ్డి చెప్పిందీ అదే…

సో… బనకచర్ల మీద ఏదేదో చెప్పి, చివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నాలతో చంద్రబాబు కుట్రలకు చెక్ పడ్డట్టయింది… కేంద్ర పర్యావరణ, సాగునీటి సంస్థలు బనకచర్ల ప్రాథమిక ప్రతిపాదనల్ని వాపస్ పంపించాయి… అవి ఆపింది మేమే అని బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకుంటే వోకే గానీ… అదైపోయింది కాబట్టి ఇక ఈ కన్నెపల్లి కథ షురూ చేసినట్టా..?

దానికన్నా ముందు కేసీయార్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం డబుల్ ఎందుకైందో, కృష్ణా నీటిని యథేచ్ఛగా ఎవరిసాయంతో ఏపీ ప్రభుత్వాలు వాడేసుకున్నాయో బీఆర్ఎస్ తెలంగాణ సమాజం అవగాహన కోసం ఓ నిజనివేదికను సమర్పిస్తే బెటరేమో..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అడ్డూఅదుపూ లేని కాళేశ్వరం దందాకు… కేసీయారే పూర్తి బాధ్యుడు…’’
  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!
  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…
  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions